• facebook
  • whatsapp
  • telegram

విజయనగర సామ్రాజ్యం

1. విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం?
జ: క్రీ.శ. 1336


2. ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పాటైంది?
జ: మహ్మద్ బిన్ తుగ్లక్


3. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ నదిఒడ్డున స్థాపించారు?
జ: తుంగభద్ర


4. సంగమ వంశంలో గొప్పవాడు?
జ: రెండో దేవరాయలు


5. పారశీక రాయబారి అబ్దుల్ రజాక్ ఏ విజయనగర చక్రవర్తి కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు?
జ: రెండో దేవరాయలు


6. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాల వరుస క్రమాన్ని గుర్తించండి.
    1. సంగమ     2. తుళువ     3. అరవీటి     4. సాళువ
జ: 1, 4, 2, 3

7. శ్రీకృష్ణదేవరాయలు ఏ సంవత్సరంలో పోర్చుగీసువారితో సంధి చేసుకున్నాడు?

జ: క్రీ.శ. 1510


8. శ్రీకృష్ణ దేవరాయలు విజయస్తంభాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు?
జ: సింహాచలం


9. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీయుడు ఎవరు?
జ: డోమింగ్ పేయిజ్


10. ఆముక్తమాల్యద రచయిత ఎవరు?
జ: శ్రీకృష్ణదేవరాయలు


11. శిల్పులు రామాయణగాథను ఏ ఆలయ గోడలపై చెక్కారు?
జ: హజార రామాలయం


12. తళ్లికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
జ: క్రీ.శ. 1565


13. కృష్ణదేవరాయల పండిత సభను ఏమనేవారు?
జ: భువన విజయం


14. శ్రీకృష్ణదేవరాయలు ఏ సంవత్సరంలో మరణించాడు?
జ: క్రీ.శ. 1529

15. విజయనగర రాజ్య ముఖ్య ఉద్దేశం?

జ: హిందూ ధర్మరక్షణ


16. ఏ వంశం రాజుల కాలం నుంచి వైష్ణవం బాగా వాడుకలోకి వచ్చింది?
జ: సాళువ


 


 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌