• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్ర శాతవాహనులు

     శాతవాహన అనేది వంశ నామం, ఆంధ్ర అనేది జాతి నామం. ఐతరేయ బ్రాహ్మణం, మత్స్య, వాయుపురాణాలు, అశోకుడి శిలాశాసనం, నాసిక్, హతిగుంఫా శాసనాలు, కన్హేరి గుహ శాసనం, కథాసరిత్సాగరంలో శాతవాహనుల గురించిన ప్రస్తావన కనిపిస్తుంది.
* విదేశీ రచనలు: మెగస్తనీస్ - ఇండికా, ప్లీనీ -నేచురల్ హిస్టరీ
* శాతవాహన రాజ్యస్థాపకుడు - శ్రీముఖుడు
* పరిపాలన కాలం - క్రీ.పూ 271 నుంచి క్రీ.శ. 174
* మొదటి రాజధాని - ప్రతిష్ఠానపురం
* రెండో రాజధాని - ధాన్యకటకం
* రాజుల వరుస క్రమం - శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి, పులోమావి, హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి.
* మొదటి శాతకర్ణి బిరుదు - దక్షిణాపదపతి
* మొదటి శాతకర్ణి భార్య పేరు - నాగానిక (నానాఘాట్ శాసనం)
* శాతవాహనుల్లో 17వ చక్రవర్తి - హాలుడు
* హాలుడి కాలంలో సారస్వత వికాసం జరిగింది.
* హాలుడు రచించిన గ్రంథం - గాథాసప్తశతి
* కాతంత్ర వ్యాకరణం రచయిత - శర్వవర్మ
* బృహత్కథ గ్రంథ రచయిత - గుణాఢ్యుడు. దీన్ని ప్రాకృత భాషలో రాశాడు.
* శాతవాహనుల్లో 23వ చక్రవర్తి - గౌతమీపుత్ర శాతకర్ణి. ఈయన తల్లి పేరు బాలశ్రీ (నాసిక్ శాసనం).
* గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడే రెండో పులోమావి.
* యజ్ఞశ్రీ శాతకర్ణి రుద్రదమనుడితో జరిగిన పోరాటంలో మరణించాడు.
* ఆచార్య నాగార్జునుడు - యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలీకుడు.
* పారావతి విహార నిర్మాత - యజ్ఞశ్రీ శాతకర్ణి
* శాతవాహన రాజుల్లో చివరి పాలకుడు - మూడో పులోమావి.
* ఆచార్య నాగార్జునుడి రచనలు: సుహృలేఖ, ఆరోగ్యమంజరి, రసరత్నాకరణం, ప్రజ్ఞాపారమితి
* శాతవాహనుల కాలంలో సామ్రాజ్యాన్ని 'ఆహారాలు'గా విభజించారు.
* ఆహారానికి ఉద్యోగి మహామాత్రుడు.
* శాతవాహనుల కాలంలో ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు.
* శాతవాహనులు బౌద్ధమతాన్ని అభిమానించారు.
* నాటి ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం
* శాతవాహనుల కాలంలోని వాణిజ్య కేంద్రాలు - పైఠాన్ (ప్రతిష్ఠానపురం), గోవర్థన్, ధాన్యకటకం, విజయపురి.
* పశ్చిమతీరంలోని రేవు పట్టణాలు: భరుకచ్చం, సోపార, కళ్యాణి.
* తూర్పుతీరంలోని రేవు పట్టణాలు - మైసోలియా, ఘంటసాల.

 

మౌర్య సామ్రాజ్యం

* మౌర్య వంశ స్థాపకుడు - చంద్రగుప్త మౌర్యుడు
* అర్థశాస్త్రం గ్రంథ రచయిత - కౌటిల్యుడు
* ఇండికా గ్రంథ రచయిత - మెగస్తనీస్
* చంద్రగుప్త మౌర్యుడి తల్లి పేరు - ముర
* చంద్రగుప్త మౌర్యుడు - సల్లేఖన వ్రతం చేపట్టాడు
* చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు - బిందుసారుడు    
* బిందుసారుడి బిరుదులు - అమిత్రఘాత్రుడు, సింహసేనుడు
* బిందుసారుడి సమకాలీకుడు - యాంటియోకస్-1
* బిందుసారుడు ఆదరించిన మతం - అజీవక మతం
* బిందుసారుడి కుమారుడు - అశోకుడు
* కళింగ యుద్ధం క్రీ.పూ. 261లో జరిగింది.
* కళింగ - నేటి ఒరిస్సా రాష్ట్రం
* అశోకుడికి బౌద్ధమత దీక్ష ఇచ్చింది - ఉపగుప్తుడు
* అశోకుడి బిరుదులు - దేవానాం ప్రియా, ప్రియదర్శిని
* అశోకుడు బౌద్ధమత ప్రచారం కోసం ధర్మ మహామాత్రులను నియమించాడు.
* శ్రీనగర నిర్మాత - అశోకుడు
* పాటలీపుత్ర నగరాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దింది - అశోకుడు
* మూడో బౌద్ధమత సమావేశం పాటలీపుత్రంలో జరిగింది.
* మౌర్యుల కాలంలో ప్రజల ముఖ్య వృత్తి - వ్యవసాయం

 

మగధ రాజ్యం

* క్రీ.పూ. 6వ శతాబ్దంలో షోడశ మహాజనపదాలు అనే పేరుతో 16 రాజ్యాలు ఏర్పడ్డాయి.
* షోడశ మహాజనపదాల్లో గొప్ప రాజ్యం - మగధ
* మగధ రాజధాని - మొదట రాజగృహం తర్వాత పాటలీపుత్ర

 

హర్యాంక వంశం

* హర్యాంక వంశ స్థాపకుడు - బింబిసారుడు
* బింబిసారుడు గౌతమబుద్ధుడి సమకాలీకుడు.
* బింబిసారుడి కుమారుడి పేరు అజాతశత్రువు.
* పాటలీపుత్ర నగర నిర్మాత - అజాతశత్రువు
*హర్యాంక వంశంలో చివరివాడు - నాగదాసకుడు

 

శైశునాగ వంశం

* శైశునాగ వంశ స్థాపకుడు - శిశునాగుడు
* శిశునాగుడి కుమారుడి పేరు - కాలశోకుడు
* కాలశోకుడి కాలంలో మొదటి రాజధాని వైశాలి. తర్వాత వైశాలి నుంచి రాజధానిని పాటలీపుత్రానికి మార్చారు.
* నందవంశం స్థాపకుడు - మహాపద్మనందుడు
* మహాపద్మనందుడి బిరుదు - ఉగ్రసేనుడు
* నంద వంశంలో చివరి రాజు - ధననందుడు

 

సంగం యుగం

* చేర, చోళ, పాండ్య రాజ్యాలను - తమిళకం అంటారు.
* సంగం అంటే - మదురైలోని కవి పండిత పరిషత్తు
* చేర రాజుల్లో గొప్పవాడు - సెంగుత్తవాన్
* సెంగుత్తవాన్ బిరుదు - ఎర్రచేర
* చేర రాజధాని - వంజి లేదా కరూర్
* ప్రాచీన చోళ వంశ స్థాపకుడు - ఎలార
* చోళ వంశంలో గొప్పవాడు - కరికాలుడు
* కావేరీ నదికి ఆనకట్ట కట్టించింది - కరికాలుడు
* పాండ్యుల రాజధాని - మదురై
* పాండ్యుల్లో గొప్ప రాజు - నెడుంజెళియాన్
* తమిళ సాహిత్య రంగంలో స్వర్ణయుగం సంగమ యుగం.
* తొల్కపీయం గ్రంథ రచయిత - తొల్కపీయర్
* తొల్కపీయం వ్యాకరణ గ్రంథం
* శిలప్పధికారం గ్రంథ రచయిత - ఇలాంగో అడింగల్
* మణిమేఖలై గ్రంథ రచయిత - సుత్తలై సత్తనార్
* జీవక చింతామణి గ్రంథ రచయిత - తిరుతక్కదేవార్
* జీవక చింతామణి అనేది వైద్యగ్రంథం
* సంగం యుగ ప్రజల ముఖ్యవృత్తి - వ్యవసాయం
* ముఖ్య ఎగుమతులు - సుగంధ ద్రవ్యాలు, పత్తి, ఉన్ని, ముత్యాలు
* దిగుమతులు - గుర్రాలు, రాగి, సీసం, పట్టు వస్త్రాలు

 

కుషాణులు

* కుషాణులు యూచీ తెగకు చెందినవారు.
* కుషాణ రాజుల్లో గొప్పవాడు - కనిష్కుడు
* శక యుగ ప్రారంభకుడు - కనిష్కుడు
* శక యుగం ప్రారంభం - క్రీ.శ. 78
* కనిష్కపురం పట్టణ నిర్మాత - కనిష్కుడు
* కనిష్కుడి బిరుదులు - దైవపుత్ర, రెండో అశోక
* రాజధాని - పురుషపురం. సామ్రాజ్యాన్ని రాష్ట్రాలు, ఆహారాలు, జనపదాలుగా విభజించారు.
* రాజుకు ప్రధాన సలహాదారుడు - రాజా మాత్రుడు
* గ్రామ ఉద్యోగులు - గ్రామిక, భద్రపాల
* కనిష్కుడి ఆస్థానంలో వసుమిత్రుడు, అశ్వఘోషుడు, చరకుడు, పార్శ్వుడు ఉండేవారు.
* కనిష్కుడి ఆస్థాన వైద్యుడు చరకుడు.
* చరక సంహిత గ్రంథ రచయిత - చరకుడు
* చరక సంహిత ఆయుర్వేద గ్రంథం.
* గాంధార శిల్పకళను పోషించింది - కనిష్కుడు
* నాలుగో బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో జరిగింది. 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌