• facebook
  • whatsapp
  • telegram

సమాజం /జనసముదాయం

* సమష్టి ప్రయోజనాలు ఉండే జనాన్ని జనసముదాయం (Community) అంటారు.
* ప్రతి జనసముదాయం తన సభ్యుల్లోని ఏకత్వాన్ని ఇతరుల నుంచి ప్రత్యేకతను అవగతం చేసుకుంటుంది.
* సామూహిక గుర్తింపు ఉండి సంఘటితమైన అనేక ప్రజా సముదాయాలతో కూడిన సమాహారమే సమాజం.
* కుటుంబాల సమూహంతో కూడిందే సమాజం.
* ఒక వ్యక్తి ప్రవర్తన సాధారణంగా తన జనసముదాయం, సంస్కృతికి అనగుణంగా ఉంటుంది.

 

సమాజం - రకాలు:

     
 

గ్రామీణ సమాజం:

* ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం.
* ఆధునిక సౌకర్యాల కొరత ఉంటుంది.
* అక్షరాస్యత తక్కువగా ఉంటుంది.
* 72% జనాభా గ్రామాల్లో నివసిస్తున్నారు.

 

పట్టణ సమాజం:

* సుమారు 20% మంది ఈ సమాజంలో ఉన్నారు.
* ఎక్కువ మంది జనాభా కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులుగా జీవనోపాధిని పొందుతున్నారు.
* ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
* అక్షరాస్యత ఎక్కువ.
నిరుద్యోగం, అధిక జనాభా ఉంటుంది.

 

గిరిజన సమాజం:

* సాధారణంగా ఈ జనసముదాయాలు అడవులు, కొండ ప్రాంతాల్లో ఉంటాయి.
* వీరిలో మూఢనమ్మకాలు ఎక్కువ.
* ఆధునిక సౌకర్యాల కొరత చాలా ఎక్కువ.
* వీరి ప్రధాన వృత్తులు - వేట, చెట్లు కొట్టడం, అటవీ ఉత్పత్తుల సేకరణ, అమ్మడం.
* అక్షరాస్యత చాలా తక్కువ.
* వీరు మాట్లాడే భాషలకు లిపి ఉండదు.
* ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వల్ల వీరు సమాజానికి దగ్గరవుతారు.

 

పౌర జీవనం:

* కుటుంబం, సమాజంలోనూ జరిగే కార్యకలాపాలన్నీ పౌర జీవనంలో ఒక భాగం.
* పౌర జీవనంలో కుటుంబం అతి ముఖ్యమైన విభాగం.
* కుటుంబం తర్వాత పిల్లలను ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడంలో పాఠశాల ప్రధానపాత్ర పోషిస్తుంది.
* పిల్లలు పాఠశాల నుంచి క్రమశిక్షణ, సహకారం, శ్రమ విలువ, దేశభక్తి, ఆత్మవిశ్వాసం మొదలైనవి నేర్చుకుంటారు.

 

సాంఘిక దురాచారాలు:

* సమాజం అభివృద్ధికి అవరోధంగా ఉన్న అంశాలను సాంఘిక దురాచారాలు అంటారు.
 

కులవ్యవస్థ:

* వివాహం లేదా వంశానుక్రమంతో అనుసంధానం పొందిన ఒక జనసమూహాన్నే కులం అంటారు.
* పూర్వకాలంలో వృత్తి ఆధారంగా కులవ్యవస్థ ఏర్పడింది.
* ప్రాచీన కాలంలో 'చతుర్వర్ణ వ్యవస్థ' అమల్లో ఉండేది.
      (a) బ్రాహ్మణ - మత సంస్కార క్రియలు నిర్వర్తించేవారు.
      (b) క్షత్రీయ - యుద్ధాలు చేసి రాజ్యాన్ని రక్షించేవారు.
      (c) వైశ్యులు - నేలను సాగుచేసి, వర్తక వ్యాపారాలు చేసేవారు.
      (d) శూద్రులు - కాయకష్టంతో పై మూడు వర్గాలవారికి సేవ చేసేవారు.
* తర్వాత కాలంలో అగ్రకులాలు, నిమ్నకులాలు అనే కుల వివక్షత ఏర్పడి నిమ్నకులాల వారిని అంటరానివారుగా భావించడం మొదలైంది.
* అంటరానికులాల వారిని గాంధీజీ 'హరిజనులు' అని పిలిచారు.
* సత్యాన్ని, అహింసను విశ్వసించిన గాంధీజీ 'అస్పృశ్యతను' ఒక శాపంగా విమర్శించారు.
* ఈ రోజుల్లో కుల ప్రాతిపదికన అస్పృశ్యతను పాటించడం ఒక నేరం.
* కులవ్యవస్థ 'అణిచివేత సంస్కృతి'కి ప్రాతినిథ్యం వహిస్తుంది.
* "అస్పృశ్యత, హిందూ మతంలోని జీవశక్తిని తినే ఒక విషక్రిమి, నా అభిప్రాయంలో దీనికి హిందూ గ్రంథాల్లో ఆమోదం లేదు." - గాంధీజీ

 

వరకట్నం:

* వివాహ సమయంలో వరుడి తల్లిదండ్రులకు వధువు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తిని 'వరకట్నం' అంటారు.
* ఇది స్త్రీలపై జరిగే ఒక దోపిడి పద్ధతి.
* వరకట్న నిషేధ చట్టం 1961లో అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టాన్ని 1984, 1986లలో సవరించారు.
* ఈ చట్టం ప్రకారం వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నిషేధం.

 

స్త్రీల అసమానత్వం:

* బాల్యవివాహాలు, బహుభార్యత్వం, స్త్రీలకు సరైన విద్యావకాశాలు లేకపోవడం, గృహహింస మొదలైనవి స్త్రీ అసమానత్వానికి నిదర్శనాలు.
* గృహహింస నిరోధ చట్టం 2005లో అమల్లోకి వచ్చింది.
* రాజ్యాంగంలోని 24 నిబంధన ప్రకారం బాలకార్మిక వ్యవస్థ నిషేధం.
* బాలకార్మిక నిషేధ చట్టాన్ని 2006లో సవరించారు.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌