• facebook
  • whatsapp
  • telegram

మండల పరిషత్

* పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడు అంచెలు ఉంటాయి. కిందిస్థాయిలో గ్రామ పంచాయతీ, పైస్థాయిలో జిల్లా పరిషత్, మధ్యస్థాయిలో మండల పరిషత్ ఉంటుంది.
* మండల పరిషత్ పరిధిలో 20 నుంచి 30 గ్రామ పంచాయతీలు ఉంటాయి.

 

మండల పరిషత్ నిర్మాణం: మండల పరిషత్ కింది సభ్యులతో ఏర్పడుతుంది.

* ప్రాదేశిక నియోజక వర్గాల నుంచి ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులు
     (ఎంపీటీసీ - MPTC = Mandal Parishad Teritorial Constituency)
* మండలానికి సంబంధించిన నియోజక వర్గ శాసన సభ్యులు.
(విధానసభ, లోక్‌సభ సభ్యులు - ఎంఎల్ఏ, ఎంపీ)
* మండలంలో ఓటరుగా నమోదు చేసుకున్న రాజ్యసభ సభ్యులు.
* మండలంలో ఓటరుగా నమోదు చేసుకున్న అల్పసంఖ్యాక వర్గానికి చెందిన 'కో ఆప్ట్' చేయబడిన ఒక వ్యక్తి.
* ఎంపీటీసీ సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకోవడానికి మండలాన్ని ప్రాదేశిక నియోజక వర్గాల కింద విభజిస్తారు.
* ఈ నియోజక వర్గాల్లో 3000 నుంచి 4000 వరకు జనాభా ఉండేలా మండలాన్ని అవసరమైనన్ని నియోజక వర్గాలుగా విభజిస్తారు.

 

మండల పరిషత్ ఎన్నికకు రిజర్వేషన్లు

* ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తిలో కేటాయిస్తారు.
* బీసీలకు   వ వంతు.
* మహిళలు   వ వంతు (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 50% సీట్లు కేటాయిస్తున్నారు.)

 

ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హతలు

* 21 సంవత్సరాల వయసు నిండినవారు.
* ఆ మండల ఓటర్ల జాబితాలో పేరు నమోదైనవారు.

 

పదవీకాలం

* ప్రత్యక్షంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు, కోఆప్ట్ సభ్యులు అయిదేళ్లు పదవిలో ఉంటారు.
* పదవిరీత్యా సభ్యులైనవారు ఆ పదవీకాలం పూర్తి అయ్యేవరకు మండల పరిషత్ సభ్యులుగా కొనసాగుతారు.
ఉదా: ఎంపీ, ఎంఎల్ఏ

 

శాశ్వత ఆహ్వానితులు:

* జిల్లా కలెక్టరు
* మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు.
మండల పరిధిలోని అన్ని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు.
గమనిక: వీరు సమావేశాల్లో పాల్గొని మాట్లాడటానికి అధికారం ఉంది. కానీ ఓటు వేయడానికి అర్హత లేదు.

 

అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు:

* ప్రతి మండల పరిషత్‌కు ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటారు.
* వీరిని మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీ) పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు.
* మండల పరిషత్ తొలి సమావేశంలోనే అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.

 

మండల పరిషత్ ఆర్థిక వనరులు

* ప్రభుత్వ గ్రాంట్‌లు
* విరాళాలు
* ప్రభుత్వం ఇచ్చే పన్నుల వాటాలు
* స్వంత ఆర్థిక వనరులు
* మండల పరిషత్ విధించే పన్నులు

 

విధులు

* గ్రామ పంచాయతీలు, సహకార సంఘాలు మొదలైన వాటి సహకారంతో సమాజాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం.
* వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి చర్యలు చేపట్టడం. నూతన వ్యవసాయ పద్ధతులను ప్రచారం చేయడం.
* పశుసంపద అభివృద్ధికి కృషి చేయడం.
* పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం.
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు.
* అడవుల అభివృద్ధికి కృషి.

 

మండల అభివృద్ధి అధికారి (ఎండీవో)

* ప్రతి మండల పరిషత్‌కు ఒక అభివృద్ధి అధికారి ఉంటాడు.
* ఇతడు మండలానికి ముఖ్య కార్యనిర్వహణాధికారి.
* మండల పరిషత్ నిర్ణయాలను అమలు చేయడం ఇతడి ముఖ్యవిధి.
* మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పని తీరును ఇతడు పర్యవేక్షిస్తాడు.
* ఇతడు మండల పరిషత్ సమావేశాలకు హాజరు కావచ్చు కానీ ఓటు హక్కు లేదు.
* ఇతడిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌