• facebook
  • whatsapp
  • telegram

స్వతంత్ర భారతదేశం (1947 - 1977)

1. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సదుపాయాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది?
జ: మండల్ కమిటీ


2. మండల్ కమిషన్‌ను నియమించిన ప్రధానమంత్రి ఎవరు?
జ: మొరార్జీ దేశాయ్


3. మండల్ కమిషన్ సిఫార్సులను అమలుపరచిన ప్రభుత్వం ఏది?
జ: నేషనల్ ఫ్రంట్


4. మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు ఓబీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి?
జ: 27%


5. మండల్ కమిషన్ సిఫార్సులను అమలుచేసిన ప్రధాని ఎవరు?
జ: వి.పి. సింగ్


6. దళితుల ప్రయోజనాల ప్రాతినిధ్యం కోసం ఏర్పడిన పార్టీగా చెప్పుకుంది?
జ: బహుజన సమాజ్ పార్టీ (BSP)
7. బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఏ రాష్ట్రంలో ప్రాబల్యం పొందింది?
జ: ఉత్తర్‌ ప్రదేశ్

8. 'పురాతన భారతీయ సంస్కృతి' ఆధారంగా పని చేస్తున్న పార్టీ ఏది?

జ: ఎస్ఏడీ


9. దేశ పౌరులందరికీ ఒకేరకమైన 'ఉమ్మడి పౌరస్మృతి'ని డిమాండ్ చేస్తున్న పార్టీ ఏది?
జ: భారతీయ జనతా పార్టీ (BJP)


10. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్ల సంఖ్య?
జ: 2


11. అయోధ్యలో రామాలయ నిర్మాణం లక్ష్యంగా రథయాత్రకు శ్రీకారం చుట్టిన భాజపా నాయకుడు ఎవరు?
జ: ఎల్.కె. అడ్వాణీ


12. 1990లో రథయాత్రను భాజపా నాయకులు ఎక్కడ ప్రారంభించారు?
జ: సోమనాథ్


13. రథయాత్రను నిర్వహిస్తున్న ఎల్.కె. అడ్వాణీని ఏ రాష్ట్రంలో అరెస్ట్ చేశారు?
జ: బిహార్


14. ఎల్.కె.అడ్వాణీ అరెస్ట్‌కు నిరసనగా ఏ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును భాజపా ఉపసంహరించుకుంది?
జ: వి.పి. సింగ్


15. 1991, మే 21న రాజీవ్ గాంధీని హత్య చేసిన శ్రీలంకకు చెందిన ఉగ్రవాద బృందం ఏది?
జ: ఎల్‌టీటీఈ

16. 1991 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఎన్ని స్థానాలు గెలుచుకుంది?

జ: 120


17. హిందూ సంప్రదాయ బృందాలు అయోధ్యలోని 'మసీద్‌'ను ఎప్పుడు ధ్వంసం చేశాయి?
జ: 1992, డిసెంబరు 6


18. 1991లో వి.పి. సింగ్ తర్వాత దేశ ప్రధాని ఎవరు?
జ: పి.వి. నరసింహారావు


19. భారత ఆర్థిక సంక్షోభ నివారణ కోసం 1992లో 'అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)'తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రధాని ఎవరు?
జ: పి.వి. నరసింహారావు


20. భారత్‌లో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన ప్రధాని ఎవరు?
జ: పి.వి. నరసింహారావు


21. నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా ఐఎంఎఫ్ భారత్‌కు కింద తెలిపిన ఏ విధానాన్ని నిర్దేశించింది?
      ఎ) రైతులకు ఇచ్చే రాయితీలపై కోత విధించడం.
     బి) విదేశీ సరకుల దిగుమతులపై పరిమితులు తొలగించడం.
     సి) టెలిఫోన్, బ్యాంకింగ్, విమానయాన రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు అనుమతించడం.
    డి) అన్నీ
జ: డి ( అన్నీ)

22. కిందివాటిలో భారత ప్రజాస్వామ్యం సాధించిన విజయం ఏది?

     ఎ) శాంతియుత పద్ధతుల ద్వారా ప్రభుత్వాల మార్పు
     బి) ఎన్నికల్లో ఓటు వేసే వారి సంఖ్య పెరగడం
     సి) స్వేచ్ఛాయుత, న్యాయపూరిత ఎన్నికలు
     డి) అన్నీ
జ: డి (అన్నీ)


23. పి.వి. నరసింహారావు ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించింది?
జ: 73


24. పి.వి. నరసింహారావు ప్రభుత్వం ఎన్ని రకాల అధికారాలు, విధులు పంచాయతీరాజ్‌కు బదలాయిస్తూ 73వ రాజ్యాంగ సవరణ చేసింది?
జ: 29


25. 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కులపై జరిగిన హింసాకాండకు క్షమాపణ చెప్పిన ప్రధాని ఎవరు?
జ: మన్మోహన్ సింగ్


26. జై జవాన్, జై కిసాన్ అనే నినాదం ఇచ్చిన ప్రధాని ఎవరు?
జ: లాల్‌బహదూర్ శాస్త్రి

27. భారత్‌లో నిరంతర ప్రణాళికలు చేపట్టిన ప్రధాని ఎవరు?

జ: మోరార్జీ దేశాయ్


28. పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యత్వం లేకుండా ప్రధాని పదవి చేపట్టిన తొలి వ్యక్తి ఎవరు?
జ: పి.వి. నరసింహారావు


29. కిందివాటిలో వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న కాలంలో జరిగిన అంశాలు?
     ఎ) జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్
     బి) ప్రాథమిక విద్యావ్యాప్తికి సర్వశిక్షా అభియాన్ కార్యక్రమం
     సి) భారత పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి
     డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)


30. భారత్‌కు రెండుసార్లు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించింది ఎవరు?
జ: గుల్జారీలాల్ నందా


31. భారత ప్రభుత్వం నియమించిన ఎస్ఆర్‌సీ (రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం) లో సభ్యుడు కాని వారెవరు?
ఎ) తరుణ్ జోషి                         బి) ఫజుల్అలీ
సి) కె.ఎం. ఫణిక్కర్                   డి) హెచ్.ఎన్. కుంజ్రు
జ: ఎ (తరుణ్ జోషి)

32. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి?

జ: 14


33. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి?
జ: 6


34. భాషా ప్రాతిపదిక రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నపుడు ఏ భాషను పరిగణనలోకి తీసుకోలేదు?
     ఎ) గోండి          బి) సంథాలి          సి) ఒరావన్         డి) అన్నీ
జ: డి (అన్నీ)


35. ప్రణాళికా రచనను మంచి ఆర్థిక విధానంగానే కాకుండా, మంచి రాజకీయంగా కూడా భావించినవారు?
జ: జవహర్‌లాల్ నెహ్రూ


36. భారత్‌లో 'ప్రణాళికా సంఘాన్ని' ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఎవరు?
జ: జవహర్‌లాల్ నెహ్రూ


37. భారత్‌లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం?
జ: 1950


38. ప్రస్తుతం ప్రణాళికా సంఘాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
జ: నీతి ఆయోగ్

39. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ అంశానికి ప్రాధాన్యం ఇచ్చింది?

      ఎ) వ్యవసాయం                                    బి) రవాణా, ప్రసార రంగాల అభివృద్ధి
      సి) సామాజిక సేవల కల్పన                   డి) అన్నీ
జ: డి (అన్నీ)


40. వ్యవసాయ రంగంలో మార్పును గ్రామీణ, రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పుగా ఎవరు భావించారు?
జ: జవహర్‌లాల్ నెహ్రూ


41. వ్యవసాయ రంగంలో మార్పులకు భారత ప్రభుత్వం ఏ మార్గాన్ని అనుసరించింది?
     ఎ) జమీందారీ వ్యవస్థ రద్దు                          బి) కౌలు విధానాల సంస్కరణ
     సి) భూ పరిమితి విధానాలు                         డి) అన్నీ
జ: డి (అన్నీ)


42. సహకార సంఘాల ద్వారా సాధించే లక్ష్యం ఏమిటి?
     ఎ) లాభసాటి ఆర్థిక విధానం                         బి) విత్తనాల సరఫరా
     సి) ఎరువులు, రసాయనాల సరఫరా            డి) అన్నీ
జ: డి (అన్నీ)


43. భారత్‌లో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇచ్చిన పంచవర్ష ప్రణాళిక?
జ: 2వ

44. భారత ఆర్థిక రాజ్యాంగంగా పేరొందిన పారిశ్రామిక తీర్మానాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది?

జ: 1956


45. రెండో ప్రపంచ యుద్ధానంతరం 'ప్రచ్ఛన్న యుద్ధం' ఏ దేశాల మధ్య ప్రారంభమైంది?
జ: అమెరికా - రష్యా


46. 'రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది కానీ, సామాజిక, ఆర్థిక అంశాల్లో అసమానత్వం ఉంటుంది' అని ఎవరు పేర్కొన్నారు?
జ: బి.ఆర్. అంబేడ్కర్


47. స్వాతంత్య్రానంతరం భారతదేశ నాయకత్వం ముందున్న సవాళ్లు ఏమిటి?
    ఎ) దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడటం
    బి) సామాజిక, ఆర్థిక మార్పులు తీసుకురావడం
    సి) ప్రజాస్వామిక వ్యవస్థను బలోపేతం చేయడం
    డి) అన్నీ
జ: డి (అన్నీ)


48. భారతదేశంలో వయోజనులందరికీ ఏ ఆర్టికల్ ప్రకారం ఓటు హక్కు కల్పించారు?
జ: 326

49. ఏ ఆర్టికల్ ప్రకారం 'భారత ఎన్నికల సంఘం' ఏర్పడింది?

జ: 324


50. భారత్‌లో మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
జ: 1951 - 52


51. 1958లో 'ప్రజాస్వామిక ఎన్నికల్లో భారతీయ అనుభవం' అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
జ: మార్గరెట్ డబ్ల్యూ ఫిషర్, జోన్ వి. బొండ్యురాంట్


52. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించడానికి కుస్తీ పోటీలు నిర్వహించిన గ్రామం ఏది?
జ: పెప్సు


53. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ఎంత శాతాన్ని పొందింది?
జ: 45%


54. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత శాతం సీట్లు సాధించింది?
జ: 70%


55. స్విట్జర్లాండ్‌లో మహిళలకు ఎప్పుడు ఓటు హక్కు కల్పించారు?
జ: 1971


56. బ్రిటిష్ కాలంలో భారత్‌లో ఉన్న ప్రెసిడెన్సీ ఏది?
       ఎ) కలకత్తా          బి) బొంబాయి        సి) మద్రాస్                   డి) అన్నీ
జ: డి (అన్నీ)

57. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏ భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు?

    ఎ) గోండి, ఒడియా                           బి) కన్నడ, తెలుగు
    సి) మళయాళం, తమిళం                 డి) అన్నీ
జ: డి (అన్నీ)


58. బ్రిటిష్ పాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఒక్క తాటికి తీసుకురావడానికి ఎవరు ప్రయత్నాలు చేశారు?
జ: ఆంధ్ర మహాసభ


59. భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఎప్పుడు చేసింది?
జ: 1956


60. భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని (SRC) ఎప్పుడు ఏర్పాటు చేసింది?
జ: 1953 ఆగస్టు


61. 'బాండుంగ్' సమావేశం ఎప్పుడు జరిగింది?
జ: 1955


62. బాండుంగ్ సమావేశంలో ఏ ఖండానికి చెందిన దేశాలు పాల్గొన్నాయి?
జ: ఆసియా, ఆఫ్రికా

63. అలీన విధాన రూపకర్త ఎవరు?

       ఎ) జవహర్‌లాల్ నెహ్రూ                          బి) మార్షల్ టిటో, డాక్టర్ సుకర్నో
      సి) కమాలుద్దీన్ నాజర్                             డి) అందరూ
జ: డి (అందరూ)


64. అలీన దేశాల తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?
జ: 1961


65. అలీన దేశాల తొలి సమావేశం ఎక్కడ జరిగింది?
జ: బెల్‌గ్రేడ్


66. 1954, జూన్ 28న పంచశీల ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది?
జ: భారత్ - చైనా


67. పంచశీల ఒప్పందంపై సంతకం చేసిన భారత ప్రధాని ఎవరు?
జ: జవహర్‌లాల్ నెహ్రూ


68. భారత్‌పై చైనా ఎప్పుడు దురాక్రమణకు పాల్పడింది?
జ: 1962


69. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎప్పుడు మరణించారు?
జ: 1964

70. నెహ్రూ మరణానంతరం దేశ ప్రధాని ఎవరు?

జ: లాల్‌బహదూర్ శాస్త్రి


71. 'హిందీ వ్యతిరేక' ఉద్యమం పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో జరిగింది?
జ: తమిళనాడు


72. 'హిందీ వ్యతిరేక' ఉద్యమాన్ని చేపట్టిన పార్టీ?
జ: డీఎంకే


73. ఏ ప్రధాని కాలంలో 'హిందీ వ్యతిరేక ఉద్యమం' జరిగింది?
జ: లాల్‌బహదూర్ శాస్త్రి


74. భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం?
జ: 1965


75. తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన భారత ప్రధాని ఎవరు?
జ: లాల్‌బహదూర్ శాస్త్రి


76. విదేశాల్లో మరణించిన భారత ప్రధాని ఎవరు?
జ: లాల్‌బహదూర్ శాస్త్రి


77. హరిత విప్లవం దేనికి సంబంధించింది?
జ: వ్యవసాయోత్పత్తులు పెంచడం

78. భారత్‌లో హరిత విప్లవానికి ఏ సంవత్సరంలో శ్రీకారం చుట్టారు?

జ: 1966


79. లాల్‌బహదూర్ శాస్త్రి మరణానంతరం ప్రధాని బాధ్యతలను ఎవరు స్వీకరించారు?
జ: ఇందిరా గాంధీ


80. భారత ప్రభుత్వం అధికార భాషా చట్టాన్ని ఎప్పుడు చేసింది?
జ: 1963


81. వ్యవసాయంలో ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థాగత విధానాన్ని ఎవరు సమర్థించారు?
జ: జవహర్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్‌లోని వామపక్ష భావాలున్న వారు


82. లోక్‌సభ ఏ ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ 284 స్థానాలకు పరిమితమైంది?
జ: 1967


83. 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఘోర పరాజయం పాలైంది?
        ఎ) తమిళనాడు      బి) కేరళ        సి) పశ్చిమ్ బంగ        డి) అన్నీ
జ: డి (అన్నీ)


84. భారతదేశం ఏ ఎన్నికల అనంతరం నిజమైన బహుళ పార్టీ వ్యవస్థగా మారింది?
జ: 1967


85. 1967లో జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో ఏ రాజకీయ పార్టీ ఘన విజయం సాధించింది?
జ: డీఎంకే

86. 'సంయుక్త విధాయక దళ్' ప్రభుత్వాలు ఏ రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి?

జ: ఉత్తరాది


87. 'సంయుక్త విధాయక దళ్' ప్రభుత్వాల్లో శాసన సభ్యులు ఎవరు?
     ఎ) జనసంఘ్ పార్టీకి చెందినవారు
    బి) సోషలిస్ట్ పార్టీకి చెందినవారు
    సి) కాంగ్రెస్ నుంచి ఫిరాయించినవారు
    డి) అందరూ
జ: డి (అందరూ)


88. బిహార్ రాష్ట్రంలో పేరొందిన మధ్యస్థాయి కులం ఏది?
      ఎ) కుర్మి         బి) కొయిరి       సి) యాదవ       డి) అన్నీ
జ: డి (అన్నీ)


89. 'వెల్లల' కులం ఏ రాష్ట్రంలో పేరొందింది?
జ: తమిళనాడు


90. 'ఒక్కళిగా' కులం ఏ రాష్ట్రంలో ఉంది?
జ: కర్ణాటక

91. 1969, డిసెంబరులో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం?

జ: మేఘాలయ


92. మేఘాలయ రాష్ట్రాన్ని ఏ గిరిజన ప్రాంతంతో కలిపి ఏర్పాటు చేశారు?
      ఎ) ఖాసి     బి) జైంతియా    సి) గారో        డి) అన్నీ
జ: డి (అన్నీ)


93. పంజాబ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జ: 1966


94. పంజాబ్ - హరియాణా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అయిన ఏ ప్రాంతాన్ని తమకు కేటాయించాలని 1968 - 69లో పంజాబ్ ప్రజలు డిమాండ్ చేశారు?
జ: చండీగఢ్


95. బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలన్న వాదన ప్రారంభించిన పార్టీ ఏది?
జ: శివసేన


96. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని స్వతంత్రంగా ఉంచాలని భావించిన పాలకుడు ఎవరు?
జ: రాజా హరిసింగ్


97. 'అఖిల జమ్మూ అండ్ కశ్మీర్ కాన్ఫరెన్స్' ప్రజా ఉద్యమానికి నాయకుడు ఎవరు?
జ: షేక్ మహ్మద్ అబ్దుల్లా

98. 'అఖిల జమ్మూ అండ్ కశ్మీర్ కాన్ఫరెన్స్' ఉద్యమం తర్వాత ఏ పార్టీగా మారింది?

జ: నేషనల్ కాన్ఫరెన్స్


99. కశ్మీర్ విషయమై 'దిల్లీ' ఒప్పందం కుదుర్చుకున్న నేత ఎవరు?
జ: షేక్ అబ్దుల్లా


100. కిందివాటిలో దిల్లీ ఒప్పందంలోని ముఖ్యాంశం ఏమిటి?
      ఎ) కశ్మీరీలు భారతదేశ పూర్తి పౌరులుగా ఉంటారు.
      బి) జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి అధిక స్వయంప్రతిపత్తి ఉంటుంది.
      సి) జమ్మూ కశ్మీర్‌లో భూసంస్కరణలు అమలు చేస్తారు.
     డి) అన్నీ సరైనవే
జ: డి (అన్నీ సరైనవే)


101. 'జమ్మూకశ్మీర్‌'కు స్వతంత్రం కావాలంటూ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1990


102. 1990లో కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగాయి?
      ఎ) రాంచీ (బిహార్), జలగావ్ (మహారాష్ట్ర)
      బి) అహ్మదాబాద్ (గుజరాత్)
      సి) అలీఘర్ (ఉత్తర ప్రదేశ్)
      డి) అన్నీ
జ: డి (అన్నీ)

103. 1970 దశాబ్దం ప్రథమాంకంలో ఏ ప్రాంతంలో ఆందోళనలు చెలరేగాయి?

జ: తూర్పు పాకిస్థాన్


104. పాకిస్థాన్‌లో 1970లో జరిగిన ఎన్నికల్లో ఎవరి నాయకత్వంలో ఉన్న పార్టీ గెలిచింది?
జ: ముజిబుర్ రెహ్మాన్


105. పాకిస్థాన్‌లోని తూర్పు ప్రాంతం ఏ స్వతంత్ర దేశంగా అవతరించింది?
జ: బంగ్లాదేశ్


106. 1971లో కింది ఏ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది?
జ: భారత్ - పాకిస్థాన్


107. 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరణకు సహకరించిన దేశం ఏది?
జ: భారతదేశం


108. 1971 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఇచ్చిన నినాదం?
జ: గరీబీ హఠావో


109. సామాజిక, ఆర్థిక మార్పు సాధించాలనే లక్ష్యంతో 1969లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎన్ని బ్యాంకులను జాతీయం చేసింది?
జ: 14

110. మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు ఇచ్చే రాజభరణాలను రద్దు చేసిన ప్రధానమంత్రి ఎవరు?

జ: ఇందిరా గాంధీ


111. రాజ్యాంగాన్ని తరచూ సవరించడం వల్ల సమతౌల్యం దెబ్బతింటుందని 1973లో ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది?
జ: కేశవానంద భారతి కేసు


112. 1973లో ఏ దేశాల మధ్య జరిగిన యుద్ధం వల్ల చమురు ధరలు గణనీయంగా పెరిగాయి?
జ: అరబ్ - ఇజ్రాయెల్


113. భారత్‌లో 1975లో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా జరిగిన ప్రతిపక్షాల ఉద్యమానికి నాయకుడు ఎవరు?
జ: జయప్రకాష్ నారాయణ్


114. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని ఏ కోర్టు తీర్పునిచ్చింది?
జ: అలహాబాద్ కోర్టు


115. జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని జె.పి. ఉద్యమం ఏ రాష్ట్రంలో భారీ స్థాయిలో జరిగింది?
జ: బిహార్, గుజరాత్


116. ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆంతరంగిక జాతీయ అత్యవసర పరిస్థితిని ఎప్పుడు విధించింది?
జ: 1975

 117. ఇందిరా గాంధీ కాలంలో విధించిన 1975 నాటి ఆంతరంగిక అత్యవసర పరిస్థితి కాలంలోని పరిణామం ఏమిటి?

   ఎ) ప్రజాస్వామ్యం కుప్పకూలింది
   బి) అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేశారు
   సి) అక్రమ అరెస్ట్‌లు, హింస పెరిగాయి
   డి) పైవన్నీ
జ: డి( పైవన్నీ)


118. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగంగా పేర్కొంటారు. దీన్ని చేసిన ప్రధాని ఎవరు?
జ: ఇందిరా గాంధీ


119. న్యాయస్థానాల న్యాయ సమీక్ష అధికారానికి పరిమితులు విధించిన ప్రధానమంత్రి ఎవరు?
జ: ఇందిరా గాంధీ


120. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న 'కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్' (కాగ్) గురించి తెలిపే ఆర్టికల్ ఏది?
జ: 148


121. రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలిపే ఆర్టికల్ ఏది?
జ: 243(K)


122. స్వాతంత్య్రానంతరం మొదటి ముప్పై ఏళ్లలో భారతదేశం సాధించిన ఫలితం ఏమిటి?
    ఎ) సైనిక దళాలపై పౌర నియంత్రణ.
    బి) దేశ ఐక్యత, సమగ్రతను రక్షించడం.
    సి) భిన్నత్వంలో ఏకత్వం, బహుళ పార్టీ ప్రజాస్వామ్యం.
    డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

                 
 


 

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌