• facebook
  • whatsapp
  • telegram

పట్టణ ప్రాంతంలో - స్థానిక స్వపరిపాలన

      నగరాల్లో, పట్టణాల్లో పౌరసదుపాయాలను అందించే వ్యవస్థనే 'పురపాలక' సంస్థ అంటారు. జనాభా ఆధారంగా మనకు మూడు రకాల పురపాలక సంస్థలు ఉన్నాయి. అవి:
    1. నగర పంచాయతీ: 20,000 - 40,000 జనాభా
    2. మున్సిపల్ కౌన్సిల్: 40,000 - 3,00,000 జనాభా
    3. మున్సిపల్ కార్పొరేషన్: మూడు లక్షలపైన జనాభా

 

మున్సిపాలిటీల ఏర్పాటు
* నగర ప్రాంతాలను వార్డులుగా, డివిజన్లుగా విభజిస్తారు.
* వార్డులకు ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.
* ఈ ప్రతినిధులను పురపాలక సంస్థలో కౌన్సిలర్ అని, కార్పొరేషన్‌లో కార్పొరేటర్ అని పిలుస్తారు.
* మున్సిపాలిటీకి ఎన్నికైన కౌన్సిలర్లు తమలో నుంచి ఒకరిని ఛైర్మన్‌గా, మరొకరిని వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు.
* మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికైన కార్పొరేటర్లు తమలో నుంచి ఒకరిని మేయర్‌గా, మరొకరిని డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకుంటారు.
* పురపాలక సంఘాల ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకొకసారి జరుగుతాయి.
* 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఆయా మున్సిపల్ వ్యవస్థల్లోని ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు.
* మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయసు 21 సంవత్సరాలు.
* తెలుగు రాష్ట్రాల్లో మొదటి మున్సిపాలిటీ 1861లో ఏర్పడిన 'భీమునిపట్నం మున్సిపాలిటీ'.
* ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది.
* 2011 నాటికి భీమునిపట్నం మున్సిపాలిటీకి 150 సంవత్సరాలు.

 

పురపాలక సంఘాలు - విధులు
* నీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు.
* కొత్త రోడ్లు వేయడం, మరమ్మతులు చేయించడం.
* మురికి కాల్వల నిర్వహణ, చెత్తను తొలగించడం.
* పాఠశాలల నిర్వహణ
* చౌక ధరల దుకాణాలు, ఆసుపత్రుల నిర్వహణ.
* పురపాలక సంఘాల్లోని పనుల నిర్వహణకు అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం.
* పురపాలక సంఘాల్లోని కౌన్సిలర్లు ప్రజల అవసరాలు, సమస్యలను పురపాలక సమావేశంలో చర్చించడం.

 

పురపాలక సంఘం - నిధులు
* పురపాలక సంఘం అనేక రకాల పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది.
* ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాలపై పన్ను
* దుకాణాలపై పన్ను, సినిమా టికెట్ల మీద పన్ను
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు

 

సబ్ కాంట్రాక్టింగ్ వర్క్
* మెరుగైన సేవలు అందించడానికి దేశంలో చాలా పురపాలక సంఘాలు చెత్త సేకరించడం, తొలగించడం లాంటి పనులకు ప్రైవేట్ కాంట్రాక్టర్లపై ఆధారపడుతున్నాయి. దీన్ని 'సబ్ కాంట్రాక్టింగ్' అంటారు.
 

వేములవాడ నగర పంచాయతీ
* వేములవాడ కరీంనగర్ జిల్లా కేంద్రానికి 33 కి.మీ. దూరంలో ఉంది.
* ఈ నగర పంచాయతీ వార్డుల సంఖ్య 20.
* ఇది 2011 వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది.
* ఇక్కడ ప్రసిద్ధిచెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంది.
* ఈ పట్టణం 'ఆకాశగంగ' అనే ప్రత్యేక తాగునీటి వ్యవస్థను కలిగి ఉంది.
* ఈ వ్యవస్థ 2003లో ప్రారంభమైంది.
* 'స్వజలధార పథకం' ద్వారా వేసిన ఈ పైపులైనులో భాగంగా ప్రతి 10, 15 కుటుంబాలకు కలిపి ఒక నల్లా ఏర్పాటు చేశారు.
* దీని ద్వారా 5000 కుటుంబాలకు రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.
* చెత్త నుంచి ప్లాస్టిక్‌ను వేరుచేసి, ఆ చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రతిపాదన ఇక్కడ ఉంది.
* భారతదేశంలోని మొత్తం కార్పొరేషన్లు 186.
* మహారాష్ట్రలో అత్యధికంగా 26 కార్పొరేషన్లు ఉన్నాయి.
* తెలంగాణలో ఆరు కార్పొరేషన్లు ఉన్నాయి.
* భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ 1687లో మద్రాస్‌లో ఏర్పడింది.
* కార్పొరేషన్‌లో కనిష్ఠంగా 50, గరిష్ఠంగా 100 డివిజన్లు ఉంటాయి.
* మున్సిపాలిటీలో కనిష్ఠ వార్డుల సంఖ్య 23, గరిష్ఠం 50.
* ప్రస్తుతం తెలంగాణలో 37 మున్సిపాలిటీలు ఉన్నాయి.

 

స్థాయి సంఘాలు
* ఇవి మున్సిపల్ వ్యవస్థకు కళ్లు, చెవుల లాంటివి.
* ప్రాచీన భారతదేశంలో పట్టణ ప్రభుత్వాలను మౌర్యులు అభివృద్ధి చేశారు.
* మౌర్యుల రాజధాని పాటలీపుత్ర నగరపాలన గురించి మెగస్తనీస్ రచించిన 'ఇండికా' గ్రంథంలో ఉంది.
* గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాన్ని 'నగర పంచాయతీ' అంటారు.
* ప్రస్తుతం తెలంగాణలో 26 నగర పంచాయతీలు ఉన్నాయి.
* పి.వి. నరసింహారావు ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించి 29 రకాల అంశాలను బదిలీ చేయాలని నిర్దేశించింది.
* 74వ సవరణ ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రత కల్పించి 18 రకాల అంశాలను బదిలీ చేయాలని నిర్దేశించింది.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌