• facebook
  • whatsapp
  • telegram

గిరిజన గ్రామ పంచాయతీ వ్యవస్థ

1. కిందివాటిలో తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన తెగ?
       ఎ) గోండ్లు        బి) కోయలు        సి) యానాదులు, సవరలు        డి) అన్నీ
జ: డి(అన్నీ)

 

2. కిందివాటిలో గిరిజన తెగ లక్షణం?
       ఎ) సహజ వనరులను ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు
       బి) ధనిక, పేద తారతమ్యాలు ఉండవు
       సి) పండిన పంటను అందరూ సమష్టిగా పంచుకుంటారు
       డి) అన్నీ
జ: డి(అన్నీ)

 

3. గిరిజన ప్రజల గురించి అధ్యయనం చేసేవారిని ఏమంటారు?
జ: ఆంత్రోపాలజిస్టులు

 

4. తెలుగు రాష్ట్రాల్లో గిరిజన తెగలను 1940వ దశకంలో అధ్యయనం చేసినవారు?
జ: ప్యూరర్ హైమన్ డార్ఫ్

 

5. తెలుగు రాష్ట్రాల్లోని ఏ గిరిజన తెగలను హైమన్‌డార్ఫ్ అధ్యయనం చేశారు?
       ఎ) చెంచులు        బి) కొండరెడ్లు        సి) గోండ్లు        డి) అన్నీ
జ: డి(అన్నీ)

 

6. ప్యూరర్ హైమన్‌డార్ఫ్ భారత్‌లోని తెలుగు రాష్ట్రాలతోపాటు ఏ ప్రాంత గిరిజనులను అధ్యయనం చేశారు?
జ: ఈశాన్య రాష్ట్రాలు

 

7. గోండు తెగల పంచాయతీని ఏమంటారు?
జ: పంచ్

 

8. గోండుల గ్రామపెద్దను ఏమంటారు?
జ: పట్లా పాట్లల్

 

9. తెలంగాణలోని ఏ జిల్లాలో గోండుల పంచాయతీ వివరాలను హైమన్‌డార్ఫ్ వివరించారు?
జ: ఆదిలాబాద్

 

10. గోండు తెగల పంచాయతీ సమావేశాలు సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతాయి?
జ: ఎప్పుడు అవసరమైతే అప్పుడు

 

11. గోండు పంచాయతీల్లో మాట్లాడే అవకాశం లేనివారు?
జ: స్త్రీలు

 

12. గోండు పంచాయతీ అధికారం ఏమిటి?
       ఎ) పండగ తేదీలను నిర్ణయించడం
       బి) వివాహం, విడాకులు మొదలైన తగాదాలను పరిష్కరించడం
       సి) కర్మకాండలకు సంబంధించిన విధివిధానాల ఖరారు
       డి) అన్నీ
జ: డి(అన్నీ)

 

13. కిందివాటిలో గోండుల గ్రామపెద్దకు సంబంధించిన అంశాలు?
       ఎ) గోండుల గ్రామపెద్దను 'పట్లా పాట్లల్' అంటారు.
       బి) ఈ పదవి వారసత్వంగా లభిస్తుంది
       సి) గ్రామపెద్ద ప్రతిరోజూ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.
       డి) అన్నీ
జ: డి(అన్నీ)

 

14. గోండుల గ్రామ పెద్ద పొలంలో గ్రామస్థులందరూ సంవత్సరానికి ఎన్ని రోజులు ఉచితంగా పని చేయాల్సి ఉంటుంది?
జ: 1

 

15. హైమన్ డార్ఫ్ ప్రకారం గోండుల ఆచార వ్యవహారాల్లో మార్పులకు కారణం?
       ఎ) పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడం
       బి) తెలుగు, మరాఠావారు ఆ ప్రాంతాలకు వెళ్లడం
       సి) గోండులు తమ వివాదాల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లు, కోర్టులను ఆశ్రయించడం
       డి) అన్నీ
జ: డి(అన్నీ)

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌