• facebook
  • whatsapp
  • telegram

గిరిజన గ్రామ పంచాయతీ వ్యవస్థ

* తెలంగాణ రాష్ట్రంలో గోండ్లు, కొండరెడ్లు, కోయలు, చెంచులు, యానాదులు, సవరలు లాంటి అనేక గిరిజన సముదాయాలు ఉన్నాయి.
* ఈ గిరిజన సముదాయాలను తెగలుగా పేర్కొంటారు.
* ఈ గిరిజన తెగల మధ్య విభిన్న జీవన విధానాలు, భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ కొన్ని ఒకే రకమైన లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ లక్షణాల ఆధారంగానే వారిని గిరిజనులుగా పేర్కొంటారు.
    1. ఒక తెగలోని సభ్యులందరూ తామంతా ఒకే మూల పురుషుడి నుంచి ఆవిర్భవించామని భావిస్తారు.
    2. సహజ వనరులైన భూమి, అడవి, నీరు మొదలైన వాటిని ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు.
    3. గిరిజన తెగల్లో ధనిక, పేద తారతమ్యాలు ఉండవు.
    4. ప్రతి ఒక్కరికీ సమష్టి ఆదాయంలో వాటా ఉంటుంది.
    5. భూమి మొత్తాన్ని అన్ని కుటుంబాలకు, కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి పంచుతారు.
    6. కొన్ని సందర్భాల్లో గిరిజన సమూహ సభ్యులందరూ కలిసి సాగుచేసి పంటను పండిస్తారు.
    7. పండిన పంటను గిరిజనులు సమష్టిగా పంచుకుంటారు.

 

గిరిజన తెగల వృత్తులు
 

* వ్యవసాయం
* అటవీ ఉత్పత్తుల సేకరణ
* పశువులను మేపడం
* దుస్తుల తయారీ
* బుట్టల తయారీ
* ఇల్లు నిర్మించడం
* అడవి దేవతలను, తమ మూల పురుషులను సంతృప్తిపరచడానికి వీలుగా జరిపే సామూహిక ఉత్సవాలకు, పండగలకు గిరిజన సమూహంలో ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది.
* గిరిజన ప్రజల గురించి అధ్యయనం చేసేవారిని 'ఆంత్రోపాలజిస్ట్‌లు' (మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు) అంటారు.
* ప్రముఖ ఆంత్రోపాలజిస్ట్ ప్యూరర్ హైమన్ డార్ఫ్ 1940వ దశకంలో తెలంగాణలోని గోండ్లు, కొండరెడ్లు, చెంచుల గురించి అధ్యయనం చేశారు.
* ప్యూరర్ హైమన్ డార్ఫ్ ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనుల గురించి అధ్యయనం చేశారు.

 

 గోండు పంచ్: ఇది గోండు తెగల పంచాయతీ
 

పట్లా పాట్లల్: ఇతడు గోండుల గ్రామ పెద్ద
* ఆదిలాబాద్ జిల్లాలోని గోండ్లు తమ సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారో ప్యూరర్ హైమన్ డార్ఫ్ వివరించారు.
* గ్రామపెద్ద తన అధికారాన్ని పంచ్ (పంచాయతీ) లేదా పురుషుడు యజమానిగా ఉండేవారితో ఏర్పడిన మండలి నుంచి పొందుతాడు.
* గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, గ్రామ పెద్దను నియమించడంలో గ్రామసభ (మండలి) నిర్ణయమే కీలకం.
* పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు. కానీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయి.
* పంచాయతీలో ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు పురుషులందరూ హాజరవుతారు.
* యువకులు, మహిళలు పంచాయతీ జరిగే విధానాన్ని పరిశీలిస్తారు.
* ఆడవాళ్లకు పంచాయతీలో మాట్లాడే అవకాశం లేదు. కానీ వారు తమ సమస్యలను తెలియజేయవచ్చు.

 

గోండు పంచాయతీ ప్రధాన విధులు
 

* పండగల తేదీలను నిర్ణయించడం
* వివాహం, విడాకులు లాంటి తగాదాలను పరిష్కరించడం
* కర్మకాండలకు సంబంధించిన అంశాలను నిర్ణయించడం
* దోషిగా నిర్ణయించిన వారికి జరిమానా విధించడం
* గోండుల్లో గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచ్‌లు (పంచాయతీలు) సంయుక్త సమావేశం నిర్వహిస్తాయి.
గోండ్ల తీర్పుకు సంబంధించిన ఒక కీలక సన్నివేశం కింది విధంగా ఉంది.
     'ఒక రోజు ఒక అమ్మాయి తనను ఇబ్బంది పెడుతున్న ఒక వ్యక్తి మీద పంచ్ ముందు ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నాడు. దోషికి ఏ రకమైన శిక్ష విధించాలని ఆమెను పంచ్ అడిగింది. అత్యంత అవమానకరమైన శిక్షను అతడికి విధించాలని ఆమె కోరింది. సభ మధ్యలో ఆమె ముందు మోకాళ్ల మీద నిలబడి క్షమాపణ కోరమని ఆ వ్యక్తిని పంచాయతీ ఆదేశించింది.
 

పట్లా పాట్లల్: (గ్రామ పెద్ద)
 

* ప్రతి గ్రామానికి పెద్దగా 'పట్లా పాట్లల్' వ్యవహరిస్తారు.
* ఈ పదవి వారసత్వంగా లభిస్తుంది.
* గ్రామపెద్ద ప్రతి రోజూ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
* గ్రామాన్ని సమైక్యంగా ఉంచేందుకు బయటి వ్యక్తులతోనూ, ప్రభుత్వ సంస్థలతోనూ సంధానకర్తగా వ్యవహరిస్తారు.
గ్రామపెద్ద గ్రామానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యమిస్తారు.
* దీనికి ప్రతిఫలంగా గ్రామస్థులందరూ గ్రామపెద్ద పొలంలో సంవత్సరంలో ఒక రోజు పనిచేస్తారు.
* తెగ అభిప్రాయాలకు వ్యతిరేకంగా గ్రామపెద్ద గర్వంతో ప్రవర్తిస్తే అతడిని గ్రామస్థులు తొలగించి, అతడి స్థానంలో మరొకరిని నియమిస్తారు.
* అలా జరగని సందర్భంలో గ్రామంలోని కుటుంబాలు ఆ గ్రామాన్ని వదిలి కొత్త ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి.
* గ్రామపెద్ద తెగలోని అందరికంటే ధనవంతుడిగా ఉండి, ఆ సంపదను తెగ సంక్షేమం కోసం ఖర్చు చేస్తాడు.

 

హైమన్ డార్ఫ్ ప్రకారం గోండుల ఆచార వ్యవహారాల్లో మార్పులకు కారణాలు
 

* తెలుగువాళ్లు, మరాఠీలు ఆ ప్రాంతాలకు వలస వెళ్లడం
* పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడం
* ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి పోలీస్ స్టేషన్లు, కోర్టులను ఆశ్రయించడం

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌