1. బాక్సైట్ నుంచి దేన్ని తయారుచేస్తారు?
జ: అల్యూమినియం
2. ఎరువుల తయారీలో ఉపయోగించే ఖనిజం ఏది?
జ: అపోడైట్
3. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కోహినూర్, నైజాం వజ్రాలు మనరాష్ట్రంలో ఏ ప్రాంతంలో లభించాయి?
జ: కృష్ణానదీ లోయ
4. మామిడి పండ్లకు ప్రసిద్ధిచెందిన జిల్లా?
1) కృష్ణా 2) ఉభయగోదావరి 3) చిత్తూరు 4) పైవన్నీ
జ: పైవన్నీ
5. మినుముల పంటకు ప్రసిద్ధిచెందిన ప్రాంతం ఏది?
జ: కోస్తాంధ్ర
6. గాజులకు ప్రసిద్ధిచెందిన ప్రాంతం?
జ: శ్రీకాళహస్తి
7. దేశంలోనే చాలా మేలైన జాతికి చెందిన ఎద్దులు ఏవి?
జ: ఒంగోలు
8. నల్ల గొర్రెల ఉన్ని నుంచి గొంగళ్లు నేయడం ఏ జిల్లా ప్రజల ముఖ్యవృత్తి?
జ: మహబూబ్నగర్
9. కృష్ణానది పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలి, మళ్లీ ఒకటిగా కలిసిపోతుంది. ఈ పాయల మధ్య ప్రదేశానికి ఏమని పేరు?
జ: దివిసీమ
10. సారా తయారుచేయడానికి ఉపయోగించే ఇప్పపువ్వు ఏ ప్రాంతంలో విరివిగా లభిస్తుంది?
జ: తెలంగాణా ప్రాంతపు అడవులు