1. గాజును చల్లబరిచే ప్రక్రియను ఏమంటారు?
2. టాల్క్ రసాయన సంఘటనం ఏది?
3. ప్రయోగశాల పరికరాలను ఏ గాజుతో తయారుచేస్తారు?
4. గాజుకు రంగును ఆపాదించేవి ఏవి?
5. పగిలిన గాజు ముక్కలను ఏమంటారు?
6. కృత్రిమ రంజనాన్ని కనుక్కున్నది ఎవరు?
7. నైట్రోఫాస్క్ ఏ రకమైన ఎరువుకు ఉదాహరణ?
8. ఇన్సులిన్ ఏ రకానికి చెందినది?
9. ఏ విధానం ద్వారా పెట్రోలియాన్ని తయారుచేస్తారు?
10. బూడిద రంగులో ఉన్న బంతులను ఏమని అంటారు?
జవాబులు:
1. మందశీతలీకరణం 2. మెగ్నీషియం సిలికేట్ 3. పైరెక్స్ 4. లోహ ఆక్సైడ్లు 5. కల్లెట్ 6. హెన్రీ పెర్కిన్ 7. మిశ్రమఎరువు 8. హార్మోన్ 9. అంశిక స్వేదనం 10. క్లింకర్