గత డీఎస్సీ, టెట్‌లో వచ్చిన ప్రశ్నలు
1. దీర్ఘచతురస్రంతో పోలుస్తూ ఒక సమాంతర చతుర్భుజ వైశాల్యాన్ని గణన చేసేందుకు ఎక్కువగా ఉపయోగపడే బోధనోపకరణం
జ: ప్లానెల్ బోర్డు
2. గణిత బోధనలో ప్లానెల్ బోర్డు ఉపయోగం
జ: త్రిభుజం, చతురస్రం సూత్రాలను రాబట్టేందుకు
బిట్లు
1. బోధనోపకరణాలను శంఖువు ఆకారంలో రూపొందించినవారు?
జ: ఎడ్గార్‌డేల్
2. కోబన్ అనే విద్యావేత్త ప్రకారం చూడటం ద్వారా నేర్చుకునే వారి శాతం
జ: 83%
3. ఎడ్గార్‌డేల్ అనుభవాల శంఖువులో పీఠభాగంలో ఉండేవి
జ: ప్రత్యక్ష, ప్రయోజనాత్మక అనుభవాలు
4. ఎడ్గార్‌డేల్ అనుభవాల శంఖువులో అగ్రభాగంలో ఉండేవి
జ: శాబ్దిక సంకేతాలు
5. ఎడ్గార్‌డేల్ అనుభవాల శంఖువులో పరిశీలన ద్వారా అభ్యసనను సూచించేవి?
1) చలనచిత్రాలు, టీవీ 2) ప్రదర్శనా వస్తువులు
3) క్షేత్ర పర్యటనలు 4) అన్నీ
జ: 4(అన్నీ)
6. ఎడ్గార్‌డేల్ అనుభవాల శంఖువులో వినడం, చూడటం ద్వారా అభ్యసనను సూచించేవి?
1) శాబ్దిక సంకేతాలు 2) దృశ్య సంకేతాలు
3) రేడియో, రికార్డింగ్‌లు, స్థిరచిత్రాలు 4) అన్నీ
జ: 4(అన్నీ)
7. గణిత ఉపాధ్యాయుడు త్రిభుజం ABCని ΔABC అని రాస్తే, ఈ ప్రక్రియ అనుభవాల శంఖువులో దేన్ని సూచిస్తుంది?
జ: దృశ్య సంకేతాలు
8. కిందివాటిలో దృశ్య ఉపకరణం కానిది ఏది?
1) స్థిర చిత్రాలు 2) టేప్‌రికార్డర్
3) నమూనాలు 4) వాస్తవ వస్తువులు
జ: 2(టేప్‌రికార్డర్)
9. ఉపాధ్యాయుడు తాను ముందుగా ఒక పాఠ్యాంశాన్ని ఎన్నుకొని, దాన్ని బోధించడానికి ఒక ప్రణాళికను రచించి, ఆ పాఠాన్ని కంప్యూటర్ సహాయంతో బోధన చేస్తాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించిన టీఎల్ఎం దేన్ని సూచిస్తుంది?
జ: దృశ్య శ్రవ్యోపకరణం
10. ఎడ్గార్‌డేల్ అనుభవ శంఖువులో మొదటి సోపానం
జ: ప్రత్యక్ష అనుభవాలు
11. ఎడ్గార్‌డేల్ అనుభవ శంఖువులో చివరి సోపానం
జ: శాబ్దిక సంకేతాలు
12. ఎడ్గార్‌డేల్ అనుభవ శంఖువులో మూడో సోపానం
జ: నాటకీకరణ అనుభవాలు
13. కిందివాటిలో వినడం, చూడటం ద్వారా అభ్యసన జరిగే సోపానం కానిది
1) శాబ్దిక సంకేతాలు 2) దృశ్య సంకేతాలు
3) క్షేత్ర పర్యటనలు 4) రేడియో, రికార్డింగ్‌లు, స్థిర చిత్రాలు
జ: 3 (క్షేత్ర పర్యటనలు)
14. పరిశీలన ద్వారా అభ్యసనను సూచించే సోపానం
జ: ప్రదర్శనా వస్తువులు
15. కిందివాటిలో ట్రాన్స్పరెన్సీలను (పారదర్శకాలను) ప్రదర్శించేందుకు ఉపయోగించనిది
1) స్లైడ్ ప్రొజెక్టర్ 2) ఓవర్‌హెడ్ ప్రొజెక్టర్
3) ఒపెక్ ప్రొజెక్టర్ 4) పవర్ పాయింట్ ప్రొజెక్టర్
జ: 2(ఓవర్‌హెడ్ ప్రొజెక్టర్)
16. అపారదర్శక వస్తువులను ప్రదర్శించేందుకు వాడేది
జ: ఒపెక్ ప్రొజెక్టర్
17. స్లైడ్లను ప్రదర్శించేందుకు వాడేది
జ: స్లైడ్ ప్రొజెక్టర్
18. అర్ధ వృత్తంలోని కోణం లంబకోణం అని నిరూపించేందుకు ఉపయోగపడే గణిత బోధనోపకరణం
జ: జియోబోర్డు
19. జియోబోర్డు ద్వారా ఏర్పరిచే ఆకారం
1) వృత్తం 2) చతురస్రం 3) త్రిభుజం 4) అన్నీ
జ: 4(అన్నీ)
20. గణితంలో Mensuration అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపయోగపడే టీఎల్ఎం
జ: నమూనాలు
21. జియోబోర్డులా కనిపిస్తూ, మేకుల స్థానంలో రంధ్రాలు కలిగిన గణిత బోధనోపకరణం
జ: పెగ్బోర్డు
22. ఫ్లాష్ కార్డులు వల్ల ఉపయోగం ఏమిటి?
1) డ్రిల్లింగ్కు
2) బోధించిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకునేందుకు
3) పునశ్చరణ
4) అన్నీ
జ: 4(అన్నీ)
23. చార్టులపై ప్రదర్శించేవి
1) సూత్రాలు 2) సిద్ధాంతాల నిరూపణ 3) పటాలు 4) అన్నీ
జ: 4(అన్నీ)
24. నిజ వస్తువులకు బదులుగా చూపించే ఉపకరణాలు
1) చార్టులు 2) గ్రాఫ్‌లు 3) పటాలు 4) నమూనాలు
జ: 4(నమూనాలు)
25. కిందివాటిలో ద్విమితీయ ఉపకరణం
1) పత్రికా వ్యాసాలు 2) స్థిర చిత్రాలు 3) పోస్టర్లు 4) అన్నీ
జ: 4(అన్నీ)