• facebook
  • whatsapp
  • telegram

Latest News: 21-05-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

01. Education: జేఎన్‌జీపీకి రాష్ట్రస్థాయి ర్యాంకులు

ఈసెట్‌ పరీక్షా ఫలితాలు మే 20న విడుదలయ్యాయి. రామంతాపూర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


02. Degree Result: డిగ్రీ ఆరో సెమిస్టర్‌ ఫలితాల విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ఏప్రిల్‌ 30 నుంచి మే 10 వరకు నిర్వహించిన ఆరో సెమిస్టర్‌ ఇంటర్నషిప్‌ మార్కుల ఫలితాలను వీసీ రాజశేఖర్‌ సోమవారం విడుదల చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


03.  Admission: ఏఎన్‌యూ ఇంజినీరింగ్‌  ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష తేదీ గడువు పొడగించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


04. Exam: తొలి రోజు టెట్‌కు 77.81 శాతమే హాజరు

రాష్ట్రంలో మే 20న  ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) పేపర్‌-2 గణితం, సైన్స్‌కు తొలిరోజు కేవలం 77.81 శాతం మంది హాజరయ్యారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


05. Education: ఉస్మానియా, సిటీ కళాశాల న్యాక్‌  గుర్తింపు కోసం అడుగులు 

విదేశీ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, సిటీ కళాశాల న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్, అక్రిడేషన్‌ కౌన్సిల్‌)గుర్తింపు కోసం వడివడిగా అడుగులు వేస్తున్నాయి.  

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Updated Date : 21-05-2024 12:45:28

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం