• facebook
  • twitter
  • whatsapp
  • telegram

స్వచ్ఛంద ఐటీ సేవలో ఇవి పాటిస్తే మేలు


ఏదైనా స్వచ్ఛంద సంస్థలో సాంకేతిక సేవలు అందించగలిగితే ఐటీ కెరియర్‌లోకి సులువుగా ప్రవేశించవచ్చు. స్వచ్ఛంద సంస్థలో మీ బాధ్యత.. ఆదాయం లేని ఉద్యోగం వంటిది. రేపటి ఆకర్షణీయమైన కెరియర్‌ను అందుకునేందుకు సోపానం లాంటిది. అందుకే ఈ ఉచిత సేవా బాధ్యతల్లో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.  


1 ఏరి కోరి స్వీకరిస్తున్న స్వచ్ఛంద పనిని ఇష్టంగా చేయాలే తప్ప నిర్బంధంగా భావించకూడదు. ఏరోజుకు ఆరోజు కొత్త కొత్త విషయాలు కనుగొంటూ ఆసక్తితో ముందుకు సాగాలి.  


2 స్వచ్ఛంద సంస్థ నమ్మకంతో అప్పగించిన పనిని శాయశక్తులా కృషి చేసి పూర్తిచేయాలి. తగిన కార్యాచరణతో పనిని గడువు ముందే పూర్తిచేయాలి.  


3 నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానం తెలియనివారైతే వారిని చిన్నచూపు చూడకూడదు. టెక్నాలజీ విషయంలో వారు తెలియనివారైనా అనుభవం రీత్యా సీనియర్లు. వారిని గౌరవిస్తూ...వారికి సాంకేతిక పరిజ్ఞాన విషయాల్లో అవగాహన కలిగించడం బాధ్యతగా తీసుకోవాలి.  


4 ప్రొఫెషనల్‌ స్కిల్‌ను అత్యుత్తమంగా ఉపయోగించి పని పూర్తి చేయాలి. ఎందుకంటే మీరు చేసేది సంస్థకు ఉపయోగపడాలి. మరోపక్క మీరు ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు పరిశీలనలో నిలబడగలగాలి.  


5 అవసరం అనుకుంటే ఇతరుల సహకారం తీసుకునేందుకు వెనుకాడకూడదు. నేరుగా కాలేజీ నుంచి వచ్చిన ఫ్రెÆషర్‌గా మీ నైపుణ్యాలను వినియోగించేటప్పుడు కొన్ని సవాళ్లు ఎదురుకావొచ్చు. వీటిని ఛేదించేందుకు సీనియర్ల సహకారం తీసుకోవచ్చు. 


6 మీరు చేసిన టెక్‌ వర్క్‌ పూర్తయ్యాక ప్రజెంటేషన్‌ రూపొందించుకొని నిర్వాహకులందరినీ సమావేశపరచి వివరించండి. వారి సందేహాలు నివృత్తి చేయండి. ఆ వెబ్‌సైట్‌/ యాప్‌ అందుబాటులో ఉంచాక వినియోగదారులుగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వండి.  


7 మీ టెక్‌ బాధ్యత పూర్తయ్యాక నిర్వాహకులనుంచి అధీకృత ధ్రువీకరణ, స్పందన లేఖలను సేకరించుకోండి. మీ ఉద్యోగాన్వేషణలో అవసరమైతే వారిని రిఫరెన్స్‌లుగా పేర్కొంటానని అనుమతి పొందండి. మీరు చేసిన పని అప్‌డేేషన్‌కి మరో ఉద్యోగంలో చేరినా విరామ సమయంలో సేవలందిస్తానని వాగ్దానం చేయండి. 
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నేర్చుకుంటే.. నెగ్గుకురాగలం!

‣ ఐటీబీపీలో పోలీసు కొలువులు!

‣ రాత పరీక్ష లేకుండా కొలువు!

‣ వాలంటరీ వర్క్‌తో ఐటీ ఉద్యోగానికి తోవ!

‣ పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!

‣ రోజుకో గంట చదివితే... రూ.34లక్షల జీతం!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

Posted Date : 25-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం