• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐటీబీపీలో పోలీసు కొలువులు

‘సాథీ ఎస్‌ఎస్‌సీ’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఐఐటీ-కె
 


స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలకు సిద్ధమయ్యేవారికి శుభవార్త. ఇకపై మీరు నాణ్యమైన స్టడీ మెటీరియల్‌తో ఉచితంగా పరీక్షలకు సన్నద్ధమయ్యే అవకాశం దక్కింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాన్పూర్‌ (ఐఐటీ-కె) ఓ కొత్త శిక్షణ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.. అదే ‘సాథీ ఎస్‌ఎస్‌సీ’. ఎస్‌ఎస్‌సీ పరీక్షల అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు.


ఈ సైటు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. వెనుకబడిన వర్గాల వారికి పూర్తిస్థాయిలో శిక్షణ అందాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో స్టడీ మెటీరియల్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్, వీడియో లెక్చర్స్, ఇంటరాక్టివ్‌ సెషన్స్‌ వంటివన్నీ అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్లు, రాబోయే నోటిఫికేషన్ల గురించి ఎప్పటికప్పుడు వివరాలు దొరుకుతాయి. ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, సీపీవో ఎస్‌ఐ, జూనియర్‌ ఇంజినీర్, ఇతర పోస్టులకు సంబంధించి మొత్తం ఇక్కడ చదువుకునే వీలుంది.


ప్రముఖ ఉన్నత విద్యాసంస్థలను అందరికీ దగ్గర చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫామ్‌లో అభ్యర్థుల సన్నద్ధతకు కావాల్సిన సమాచారం అంతా ఉంది. డైలీ క్విజ్‌లు, ఎస్‌ఎస్‌సీ క్యాలెండర్, లైవ్‌ క్రాష్‌ కోర్సులు వంటివి ఉన్నాయి. ఇందులో ఏఐ ఆధారిత ట్యూటరింగ్‌ సిస్టమ్‌ ఉంది. దీని ద్వారా విద్యార్థులకు వ్యక్తిగత అభ్యాస అనుభవం దొరుకుతుంది. ఉచితంగా రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. మరిన్ని వివరాలు  https://sathee.prutor.ai/ వెబ్‌సైట్, SATHEE పేరుతో ఉన్న మొబైల్‌ యాప్‌ల నుంచి పొందవచ్చు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ రాత పరీక్ష లేకుండా కొలువు!

‣ వాలంటరీ వర్క్‌తో ఐటీ ఉద్యోగానికి తోవ!

‣ పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!

‣ రోజుకో గంట చదివితే... రూ.34లక్షల జీతం!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

Posted Date : 24-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం