• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జిప్‌మర్‌లో గ్రూప్‌ బీ, సీ ఉద్యోగాలు


 

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌).. 209 గ్రూప్‌-బీ, సీ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ఎంపిక చేస్తారు.


మొత్తం ఉద్యోగాల్లో అన్‌రిజర్వుడ్‌కు 117, ఓబీసీలకు 25, ఎస్సీలకు 14, ఎస్టీలకు 20, ఈడబ్ల్యూఎస్‌లకు 33 కేటాయించారు. 


గ్రూప్‌-బి: జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌-1, జూనియర్‌ ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌-1, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్‌-4, నర్సింగ్‌ ఆఫీసర్‌-154, ట్యూటర్‌ ఇన్‌ స్పీచ్‌ పేథాలజీ అండ్‌ ఆడియోలజీ-1, ఎక్స్‌రే టెక్నీషియన్‌ (రేడియోథెరపీ)-1, ఎక్స్‌రే టెక్నీషియన్‌ (రేడియో డయాగ్నొసిస్‌)-5, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఎలక్ట్రానిక్స్‌ (ఫిజియాలజీ)-1, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (న్యూక్లియర్‌ మెడిసిన్‌)-1 ఉన్నాయి. 

గ్రూప్‌-సి: అనస్థీషియా టెక్నీషియన్‌-1, ఆడియాలజీ టెక్నీషియన్‌-1, జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌-24, ఫార్మసిస్ట్‌-6, రెస్పిరేటరీ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌-2, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2-1, కార్డియోగ్రాఫిక్‌ టెక్నీషియన్‌-5 ఉన్నాయి. 

గ్రూప్‌-బీ, గ్రూప్‌-సీలలో ఎక్కువ ఖాళీలు ఉన్న నర్సింగ్‌ ఆఫీసర్, జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసుకుందాం.


1. నర్సింగ్‌ ఆఫీసర్‌-154: బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్‌ / బీఎస్సీ నర్సింగ్‌ పాసవ్వాలి. లేదా బీఎస్సీ (పోస్ట్‌ సర్టిఫికెట్‌)/ పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ ఉత్తీర్ణత. స్టేట్‌/ ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌గా నమోదు కావాలి.  లేదా 

  డిప్లొమా ఇన్‌ జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ పాసవ్వాలి. స్టేట్‌/ ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌గా నమోదుకావాలి. యాభై పడకల ఆసుపత్రిలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. 


2. జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌-24: ఇంటర్మీడియట్‌/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. కంప్యూటర్‌పైన ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్‌ చేయగలగాలి. వయసు 30 సంవత్సరాలు  దాటరాదు. 

  అన్‌ రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు దరఖాస్తు ఫీజు రూ.1500, ఎస్సీ/ ఎస్టీలకు రూ.1200. పీడబ్ల్యూబీడీలు ఫీజు చెల్లించనవసరం లేదు. 

  పోస్టులను బట్టి అభ్యర్థుల వయసు 27 నుంచి 45 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీని బట్టి పది నుంచి పదిహేనేళ్లు, మాజీ సైనికోద్యోగులకు కేటగిరీని బట్టి మూడు నుంచి ఎనిమిదేళ్ల సడలింపు ఉంటుంది. 

  కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానం, సిలబస్, స్కిల్‌ టెస్ట్‌ల వివరాలను త్వరలోనే జిప్‌మర్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

  అన్‌రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు సీబీటీలో 50 శాతం, స్కిల్‌ టెస్ట్‌లో 50 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. దివ్యాంగులు సీబీటీలో 45 శాతం, స్కిల్‌ టెస్ట్‌లో 50 శాతం మార్కులు సంపాదించాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీలు సీబీటీలో 40 శాతం, స్కిల్‌ టెస్ట్‌లో 50 శాతం మార్కులు సాధించాలి. 


  సీబీటీ పరీక్ష కేంద్రాలు: పుదుచ్చేరి, దిల్లీ/ఎన్‌సీఆర్, కోల్‌కతా, ముంబయి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచిరపల్లి, తిరునెల్‌వెలి, వెల్లూరు, బెంగళూరు, హైదరాబాద్, తిరువనంతపురం, త్రిసూర్, కొచి, కోజికోడ్, కొల్లం అండ్‌ కన్నూర్‌లో నిర్వహిస్తారు. 

రాతపరీక్షకు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 19.08.2024

హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌: 02.09.2024

పరీక్ష తేదీ: 14.09.2024

వెబ్‌సైట్‌: https://www.jipmer.edu.in/
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నేర్చుకుంటే.. నెగ్గుకురాగలం!

‣ ఐటీబీపీలో పోలీసు కొలువులు!

‣ రాత పరీక్ష లేకుండా కొలువు!

‣ వాలంటరీ వర్క్‌తో ఐటీ ఉద్యోగానికి తోవ!

‣ పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!

‣ రోజుకో గంట చదివితే... రూ.34లక్షల జీతం!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

Posted Date : 25-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం