విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

NEET: రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది

  •  నీట్‌ - యూజీలో అర్హుల సంఖ్య 47,356కు తగ్గుదల 

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. జూన్‌ 4న మొదట విడుదల చేసిన ఫలితాల్లో 47,371 మంది అర్హత సాధించగా..జులై 26న ఎన్టీఏ వెల్లడించిన ఫలితాల్లో 47,356 మంది అర్హత పొందారు. అలానే ర్యాంకుల్లోనూ స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రానికి చెందిన అనురన్‌ ఘోష్‌కు గతంలో జాతీయస్థాయిలో 77వ ర్యాంకు రాగా.. ఈ సారి 137వ ర్యాంకు వచ్చింది.గత ఫలితాల్లో గుగులోత్‌ వెంకటనృపేశ్‌కు ఎస్టీ కేటగిరిలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు.. సాధారణ ర్యాంకు 167 రాగా.. తాజా ఫలితాల్లో ఎస్టీ కేటగిరిలో మొదటి ర్యాంకు, సాధారణ ర్యాంకు 219 వచ్చింది. 

లావుడ్య శ్రీరాంనాయక్‌కు మొదట వెల్లడించిన ఫలితాల్లో ఎస్టీ కేటగిరిలో జాతీయ స్థాయి రెండో ర్యాంకు, సాధారణ ర్యాంకు 453 రాగా.. ప్రస్తుతం ఎస్టీ కేటగిరిలో నాలుగో ర్యాంకు, సాధారణ ర్యాంకు 553 వచ్చింది.
 

Published at : 27-07-2024 13:08:22

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం