విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

DAO Key: 31న డీఏవో ప్రాథమిక ‘కీ’ విడుదల

  • అభ్యంతరాలకు గడువు ఆగస్టు 5 


ఈనాడు, హైదరాబాద్‌:
రాష్ట్రంలో డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారుల(డీఏవో) పోస్టుల భర్తీకి జూన్‌ 30 నుంచి జులై 4వ తేదీ వరకు నిర్వహించిన సీబీఆర్‌టీ పరీక్షల ప్రాథమిక ‘కీ’ని జులై 31న విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘కీ’తోపాటు అభ్యర్థుల సమాధానాల పత్రాలను వెబ్‌సైట్లో పొందుపరచుతామన్నారు. సమాధాన పత్రాలు ఆగస్టు 30 వరకు వెబ్‌సైట్‌లో ఉంటాయన్నారు. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు ఆగస్టు 1 నుంచి 5 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేయాలని అభ్యర్థులకు సూచించారు.

Updated at : 27-07-2024 20:23:08

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం