విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Medical fees: పెరిగిన నర్సింగ్, పారా మెడికల్‌ ఫీజులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ నర్సింగ్, పారా మెడికల్‌ కాలేజీల ఫీజులను పెంచుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ సిఫారసుల మేరకు కొత్త ఫీజులను నిర్ధారించినట్లు పేర్కొన్నారు. 2026వ సంవత్సరం వరకు పెంచిన ఫీజులు అమల్లో ఉంటాయని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ ఉత్తర్వుల్లో తెలిపారు. పెరిగిన 13 కోర్సుల కొత్త ఫీజుల వివరాలను వెల్లడించారు. బీఎస్సీ (నర్సింగ్‌), ఎమ్మెస్సీ (నర్సింగ్‌), బీపీటీ, ఎంపీటీ, బీఎస్సీ (అనుబంధ హెల్త్‌ సైన్సెస్‌) సహా మొత్తం 13 కోర్సులకు సంబంధించి ఎ-కేటగిరి, బి-కేటగిరి సీట్ల ఫీజులను ఖరారు చేశారు. బీఎస్సీ నర్సింగ్‌కు ఎ-కేటగిరిలో ఫీజు గతంలో రూ.24 వేలు ఉండగా.. రూ.45 వేలకు పెరిగింది. బి-కేటగిరి సీటు ఫీజును రూ.90 వేలుగా నిర్ధారించారు. ఇతర పారా మెడికల్‌ కోర్సుల ఎ-కేటగిరి సీట్ల ఫీజులను రూ.21 వేల నుంచి రూ.30 వేలకు, రూ.16 వేల నుంచి 40 వేలకు, రూ.14 వేలు ఉన్న ఫీజును రూ.27 వేలకు పెంచారు. బి-కేటగిరి సీట్ల ఫీజులు ఎ-కేటగిరి సీట్ల ఫీజులకు రెట్టింపుగా ఉన్నాయి. ఎమ్మెస్సీ నర్సింగ్‌ సహా ఎంపీటీ కోర్సుల ఫీజులను ఏడాదికి రూ.5 వేల మేర పెంచారు.

Published at : 27-07-2024 13:17:38

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం