• facebook
  • whatsapp
  • telegram

PARTS OF SPEECH

There are eight Parts of Speech in English. They are:
1. Noun
2. Pronoun
3. Verb
4. Adjective
5. Adverb
6. Preposition
7. Conjunction
8. Interjection

 

Parts of Speechలోని అంశాలు  

1) Noun    2) Pronoun    3) Adjective    4) Verb     5) Adverb    6) Conjunction     7) Preposition     8) Interjection

* Determinersను కూడా వీటిలో భాగంగా కలిపి చదవాలి.

Noun (నామవాచకం): దీన్ని కంటికి కనిపించే, కనిపించని (Physical existence - Persons, Places, Things, Animals, Qualities) వాటికి పేరు పెట్టడానికి ఉపయోగిస్తారు. అందుకే దీన్ని Naming word అనే పేరుతో పిలుస్తారు. 

* దీన్ని వాక్యంలో Subject లేదా Object గా ఉపయోగిస్తారు. 

* ఉపయోగాన్ని బట్టి దీన్ని Sentenceలో వివిధ పేర్లతో పిలుస్తారు. అవి:

1. Common noun  2. Proper noun
3. Material noun    4. Abstract noun

* ఉపయోగాన్ని బట్టి ఈ నాలుగు Nounsను Countable noun, Uncountable noun, Compound noun, Possessive noun, Collective noun అనే పేర్లతోనూ పిలుస్తారు.

Common noun: ఒకే పేరును చాలా మంది మనుషులకు/ ప్రదేశాలకు/ జంతువులకు/ వస్తువులకు వాడితే దాన్ని Common noun అంటారు.

E.g.: Shakespeare is a great dramatist. Underlined word is....
a) Proper noun          b) Common noun
c) Collective noun     d) Possessive noun

‘Drama’
రాసే ఎవరినైనా ‘Dramatist’ అని పిలవొచ్చు. కాబట్టి b సరైన సమాధానం.

* అన్ని రకాల జంతువులు (cow, dog, cat, etc.), పక్షులు (cock, sparrow crow, etc.), వస్తువులు (pen, chair, fan, etc.) లను Common nounsగా వాక్యంలో ఉపయోగిస్తారు. 

Common nounsని సాధారణంగా countable/ uncountable nouns అంటారు. Countable nounsనే singular/ plural nouns అనే పేర్లతో పిలుస్తారు.

* పరీక్షలో ప్రశ్నలను లోతుగా అడగాలనుకుంటే కింది విధంగా అడగొచ్చు.

E.g.: Which of the below only has singular and plural forms?
a) Material nouns     b) Abstract nouns
c) Common nouns   d) Proper nouns
Ans: c


* కొన్ని సందర్భాల్లో  Proper noun లాంటి (One’s own ) పేర్లను కూడా Common nounగా ఉపయోగిస్తారు. ఈ అంశంపై ప్రశ్న అడిగితే అది కఠినమైన ప్రశ్నగానే భావించాలి.

E.g.: Kiran is Sachin Tendulkar of Kadapa district. Underlined word in the above is ....
a) Proper noun           b) Common noun
c) Collective noun      d) Compound noun

Ans: b

* Syllabusలో correction of sentences కూడా భాగమే కాబట్టి Common nounsకి సంబంధించి Noun-Number విభాగంలో ప్రశ్న అడగొచ్చు.

E.g.: 1. Which of the below can be used both as singular and plural?
a) Fish     b) Sheep       c) Deer    d) All the above

Ans: d


2. Which of the below is grammatically correct?
a) Fishes are swimming in water    b) Deers are running in the forest
c) Sheep are grazing in the fields    d) Dogs is loyal animals
Ans: c


Proper noun: ఒక Common nounకు Particularగా ఏదైనా పేరును పెడితే దాన్ని Proper noun అంటారు. Persons/ Places/ Animals/ Thingsకు మనమిచ్చే, వాటికి మాత్రమే సొంతమయ్యే పేర్లే Proper nouns.

E.g.: Which of the below is started with capital letter?
a) Proper noun         b) Common noun
c) Abstract noun      d) Material noun
Ans: a


వీటిని Sentenceలో ఎక్కడ ఉపయోగించినా capital letterనే వాడాలి.

E.g.: Which of the below Common noun always used capital letter in a sentence?
a) Teacher     b) District    c) God      d) Book
Ans: c

* దేవుడు లేదా దానికి సమాంతరంగా ఉన్న పదానికి Capital letterనే ఉపయోగించాలి

(E.g.: Almighty, Lord, Creator, etc.)

* Proper nouns
లో Plurals ఉండవు. కానీ ఒక Conjunction (ముఖ్యంగా ‘and’)ను ఉపయోగించి  Plural proper nounగా వాడొచ్చు.

Material noun: ఒక Productను తయారుచేసేందుకు వాడే raw materialకు పేరు పెడితే దాన్ని Material noun అంటారు. ఇది కేవలం ఒక Metal/ Wood మాత్రమే కాదు, తయారీకి ఉపయోగించే ప్రతి Substanceను Material noun గానే భావించాలి.

E.g.: This wall is made of bricks.-
Underlined word is.-.-.-
a) Common noun b) Proper noun
c) Material noun d) Abstract noun
Ans: c


* Usage ఆధారంగా Material nounను Common nounగా పిలవొచ్చు.

E.g.: It is a Brickలో brickను Common nounగానే పరిగణించాలి. దాని ద్వారా దేన్ని అయినా తయారు చేస్తారు, అనే సందర్భంలోనే అది Material noun అవుతుంది.


Abstract noun: కంటికి కనిపించనిది, చేతితో తాకలేనిది, ఒక భౌతిక రూపం లేనిది. 

* కేవలం ఆస్వాదించేది, అనుభూతి చెందేది. Abstract noun పని, గుణాలు, స్థితి, భావనల గురించి తెలుపుతుంది.

Names referring to actions, qualities, state of being and feelings etc.
E.g.: Name of action:
Verb (Action)  -   Noun (Name)
    Move               Movement
    Apply               Application
    Know               Knowledge

Name of qualities:
Adjective (Quality)  -  Noun (Name)
        Happy                 Happiness
        Brave                  Bravery
        Kind                    Kindness

Name of State of Being:
        Child                  Childhood
        Free                   Freedom
        Poor                   Poverty

Model Questions
 

1. Which of the below must be preceded by an Indefinite article?
a) Countable noun                     b) A singular common noun
c) A common noun in usage      d) Above all

Ans: Above all


2. Which of the below is grammatically correct?
a) Ravi is an Honest            b) Krishna is an active
c) Mohan is an idiot              d) Above all

Ans: Mohan is an idiot


3. Which of the below is grammatically incorrect?
a) I want to buy a soap                             b) I want a paper
c) I want as Information from you           d) Above all

Ans: Above all​​​​​​​


4. Which of the below is grammatically incorrect?
a) This news are fake                        b) That furniture are mine
c) I want many advices from you     d) Above all

Ans: Above all​​​​​​​


5. Which of the below is plural form of fish?
a) Fishes     b) Fishs      c) Fish       d) Above all

Ans: Fish 


6. Which of the below is grammatically incorrect?
a) He gave me advise           b) He gave me advice
c) He practiced sincerely      d) None

Ans: He gave me advice​​​​​​​


7. Which of the below is grammatically incorrect?
a) I drink 2 teas everyday              b) I got 2 papers
c) He gave me 2 soaps                 d) Above all

Ans: Above all


8. Which of the below has plural?
a) nouns          b) pronouns
c) adjective     d) verb

Ans: nouns ​​​​​​​


9. Which of the below is correct countable unit?
a) I want two cups of tea                b) I want two cups of teas
c) I want two cup of tea                  d) I want two cup of teas

Ans:  I want two cups of tea


**************************************************

1. NOUN: A Noun is the name of a person, place or ANY thing. అంటే వ్యక్తులు, స్థలాలు, వస్తువుల పేర్లు Concrete Nouns  అవుతాయి. అయితే courage, education, idea, love, luck మొదలైనవి కూడా Nouns అని గ్రహించాలి. ఎందుకంటే గుణాలు, పనులు, స్థితులు, కళలు, శాస్త్రాల పేర్లను తెలియజేసే పదాలు abstract  (గ్రహించదగినవి మాత్రమే) sense లో ఉంటాయి. అందువల్ల వాటిని Abstract Nouns అంటారు. Nouns విషయంలో ఇది గ్రహిస్తే చాలు.
e.g.: Shreya (వ్యక్తి పేరు);             Ooty (స్థలం పేరు);              pencil ; (వస్తువు పేరు);
     
student  (కామన్ నౌన్);       army (సమూహం పేరు);     iron (పదార్థం పేరు);
     
 poverty  (స్థితికి పేరు);        grammar  (శాస్త్రం పేరు);          laughter (పనికి పేరు);
       
 beauty  (గుణానికి పేరు);    dream (అనుభవానికి పేరు);      pleasure (అనుభూతికి పేరు);
       
 paramecium (జీవికి పేరు); penicillin (ఔషధానికి పేరు)...
So,  ఈ విధంగా పేర్లను తెలిపే అన్ని పదాలను Nouns గా పరిగణించాలి. -ness, -dom, -ship, -ion, -ation, - ist, -ance, -ence, -or, -er, -ity, -ment, -ian  మొదలైన Suffix లు కూడా Nouns ను ఏర్పాటు చేస్తాయి.
e.g.: neatness, wisdom, friendship, tension, inforrmation, dentist, attendance, evidence, convenor, teacher, brevity, move ment,
technician . . .

కొన్ని సందర్భాల్లో వేరే భాషా భాగానికి చెందిన పదాలు కూడా Nouns గా  పనిచేస్తాయి. నిజానికి మనం జాగ్రత్తగా ఉండాల్సింది సరిగ్గా ఇలాంటి పరిస్థితులలోనే!
e.g.: He wants to watch the T.V. at night.
                               Verb
He looked at his watch immediately.
                             Noun

* అదే పదం Verb గా మరియు Noun గా వాడిన సందర్భాలివి.
e.g.:   He is a rich man.
                       Adj.
        Don’t believe the rich.
                                      Noun

*  అదే పదం Adjective గా మరియు Noun గా వాడిన సందర్భాలివి.

 

2. PRONOUN: A Pronoun is a word used in the place of a noun. It helps us to avoid
repetition of nouns.
అంటే నామవాచకాలకు బదులుగా ఉపయోగించే మాటలను సర్వనామాలు అంటారు.
                             
e.g.: Ravi built a house.  It is nice.
                                                            Noun      Pronoun
                       

 

          ఈ Pronouns  అనేవి వ్యక్తులకు, వస్తువులకు సంబంధించినవై ఉంటాయి. వస్తువు అంటే చూడదగినది, గ్రహించదగినది ఏదైనా కావచ్చు! మీ సౌలభ్యం కోసం అన్నిరకాల Pronouns తో రూపొందించిన పట్టిక ఇదిగో...


Note: Who, What, Which, Where, Whom, Whose, Why మరియు How లను Question Words అంటారు.  కానీ వీటిని చాలా సందర్భాలలో  Interrogative Pronouns గా కూడా ఉపయోగిస్తారు. అందుకే ఒక పదం యొక్క Parts of Speech ను ఉపయోగించిన వాక్యంలోని సందర్భాన్ని బట్టి చెప్పాలి.
e.g.:   A triangle whose three sides are equal is called equilateral.
                           Pronoun
         This is the boy that I spoke of.
                               Pronoun    
   He said that he would go home.
                   Conjunction

* ఒక పదం వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు భాషాభాగంగా ఉండొచ్చు. అందుకే Parts of Speech of a certain word depends on the context in which it is used.

 

3. VERB: A Verb is a word which expresses the action of doing, being or possessing.
అంటే పనిని తెలిపే పదాన్ని క్రియ అంటారు. పనులను, స్థితులను, కలిగి ఉండటాన్ని తెలియజేసే పదాలను Verbs  అని పిలుస్తారు.
e.g.:   The pen is black. (action of being)
                       Verb
          I have a house. (action of possessing)
             Verb
         Children play games. (action of doing)
                        Verb

పనులు మూడు విధాలుగా జరుగుతాయని చూశారు కదా!
*  స్థితులను తెలియజేసే
Verbs ను ‘be’ forms  అంటారు. అవి am, is, are, was, were
*  కలిగి ఉండటాన్ని తెలియజేసే Verbs ను ‘Possessive’ forms of Verbs అంటారు. అవి have, has, had.
* చేసే పనులను తెలియజేసే Verbs ను '‘do’ forms of Verbs అంటారు. అవి walk, run, eat, sleep, do, sit . . .... మొదలైనవి.
* అనేక సందర్భాల్లో సహాయక క్రియలుగా వచ్చే
Verbs ను Helping Verbs  లేదా Auxiliary Verbs అంటారు. అవి can, could, shall, should, will, would, may, might, must మొదలైనవి మరికొన్ని.
* ప్రతి
Verb మూడు విభాగాలుగా ఉంటుంది. ఒకటో విభాగం V1 (Simple Present);  రెండో విభాగం V2 (Simple Past)  మూడో విభాగం V3 (Past Participle). ఉదాహరణకు go- went- gone. ఈ మూడు విభాగాలలో ఉన్న పదాలన్నీ క్రియలే.
          ఈ విధంగా క్రియలను గుర్తించాలి. అయితే వీటికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఈ కింద చూడండి.
* కొన్ని సార్లు క్రియాపదం
(Verb) ) వేరే భాషాభాగంగా కూడా ఉండొచ్చు.
e.g.: We want to visit our Chairman shortly.
                             Verb
We paid a visit to him last summer.
                 Noun

Visit మొదటి వాక్యంలో Verb గా, రెండవ వాక్యంలో Noun గా వాడారు. మరొక ఉదాహరణ... |
saw saw, is sawing a saw, such a saw I never saw!
  Verb     Noun                   Noun           Noun           Verb
*  -fy, -en, -ate 
మొదలగు suffix లు కూడా Verbs ను రూపొందిస్తాయి.
e.g.: identify, strengthen, decorate

 

4. ADJECTIVE: An ‘Adjective’ tells the quality, quantity, colour and number of nouns/pronouns. అంటే స్వభావాన్ని, పరిమాణామాన్ని, రంగును, సంఖ్యను తెలిపే పదాలు. ఇవి నామవాచకాలను లేదా సర్వనామాలను వర్ణిస్తాయి.
e.g.: great, much, double, this, each, whose, same, green . . . మొదలైనవి.
* ఒక పదం యొక్క భాషాభాగాన్ని దాన్ని వాడిన వాక్యంలోని సందర్భాన్ని బట్టి చెప్పాలి. కాబట్టి ఇతర భాషాభాగాలకు చెందిన పదాలు కూడా
Adjectives అయ్యే వీలుంది. అందుకని దీన్ని వివరంగా చూడాలి.
* ఒక
Adjective  అనేది Noun/Pronoun ను గురించి తెలియజేస్తుంది. కాబట్టి వాక్యంలో అది Noun/ Pronoun ముందే ఉండాలా? అనే సందేహానికి జవాబుగా 'అక్కర్లేదు' అని చెప్పవచ్చు.
e.g.:    She has melodious  voice.
                       Adjective    Noun

వివరణ:  Noun కు ముందు వచ్చి దాని గురించి తెలిపే Adjective ను ‘epithet’ (Attributive Adjective) అంటారు.
e.g.:     Her voice is melodious.
                  Noun    Adjective

వివరణ: ఇక్కడ Adjective అనేది వాక్యంలో Noun  తర్వాత ఉంది. దీన్ని Predicative Adjective  అంటారు. అయితే రెండు వాక్యాల భావార్థం ఒకటే!
ఇప్పుడు
Adjective లో రకాలేంటో చూద్దాం.
* Qualitative Adjectives: Shape ని  size ని colour ని taste ని condition ని behaviour ని అవి కలిగించే impression ని తెలియజేసేవి.
e.g.: round, narrow, white, bitter, weak, cruel, smooth, great, attractive, beautiful. . .
* Quantitative Adjectives:
పరిమాణం, పరిమితిని తెలియజేసేవి.
e.g.:   much, little, any, no, many, some, all . . .
          I  have a little knowledge of English.
                          Adj.
*  Numeral Adjectives: Numbers (definite/indefinite/multiplicative)
ను తెలియజేసేవి.
e.g.:   two, five, first, tenth, double, bi-fold . . .
         We have been living in the twenty-first century.
                                                           Adjective
*  Demonstrative Adjectives:
'ఫలానా' అని నిర్దేశించేవి.
e.g.: this, that, these, those, such, same, the, other, certain . . .
certain man went down from Kashmir to Cape Comarin.
Adjective
* Distributive Adjectives:
వస్తువులు/ వ్యక్తులు ఒక్కొక్కటిగా తీసుకునేలా తెలియజేసేవి.
e.g.: each, every, either, neither . . .
Every boy praised Raghu yesterday.
  Adj.
* Interrogative Adjectives: Nouns  
ముందు వాడుతూ ప్రశ్నలు వేయడానికి ఉపయోగపడేవి.
e.g.: what, which, whose . . .
        which boy got the prize in the race?
     Adjective
*  Relative Adjectives: '
సంబంధిత' అనే అర్థంలో వాడేవి.
e.g.: which, what, whose . . . Relative Adjectives కూడానూ
         
This is Ramu whose pen was stolen.
                              Adjective

*  ఒక వాక్యంలో రెండు Nouns పక్కపక్కనే వచ్చినప్పుడు మొదటి Noun, Adjective అవుతుంది.
Pronoun లుగా స్ఫురించే కొన్ని పదాలు Adjective  కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నందువల్ల ఆయా సందర్భాల్లో వాటిని Adjectives  గానే గుర్తించాలని తెలుసుకున్నారు కదా! అందుకే Parts of Speech ఆద్యంతం ఆసక్తికరం. వాటి ఉపయోగాల వెనక ఉన్న స్వల్ప తేడాలను గ్రహిస్తే వాక్య రచనాశైలి మెరుగుపడుతుంది. ఇందులో సందేహమే లేదు.

 

మీకు తెలుసా?
When you put more than one adjective together, the order of the adjectives is important.

 

Order of Adjectives
(OSASCOMP)

 

1. opinion (= what you think about something)
2. size
3. age
4. shape
5. colour
6. origin (=where something comes from)
7. material (= what something is made of)
8. purpose (=what something is used for)
e.g.:    a    clever,   big,   old,   round,    black,   Chinese,   pet   dog.
          Adj.  Adj.    Adj.   Adj.     Adj.       Adj.         Adj.       Adj.   Noun

 

5. ADVERB: ఒక Verb  (క్రియ) తెలియజేసే పని ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎంతవరకు జరుగుతుందో తెలియజేసే పదాలు, Adjectives  (విశేషణాలు) పరిమితిని తెలియజేసే మాటలను క్రియా విశేషణాలు (ADVERB) ) అంటారు. అలాగే ఒక Adverb కొన్ని సందర్భాల్లో మరొక Adverb యొక్క పరిమితిని కూడా తెలియజేస్తుంది.
So, an ‘Adverb’ is a word which qualifies or adds to the meaning of a verb, an adjective or another adverb.
e.g.: Raju came  yesterday.
(పని 'ఎప్పుడు' జరిగింది అని తెలిపే Adverb)
                 
Verb  Adverb
        Raju spoke  gently. (
పని 'ఎలా' జరిగింది అని తెలిపే Adverb)
                   Verb   Adverb
        Raju eats   slowly. (
పని 'ఏవిధంగా' జరిగింది అని తెలిపే Adverb)
                 Verb  Adverb
        Raju lived   here. (
పని 'ఎక్కడ' జరిగింది అని తెలిపే Adverb)
                 Verb  Adverb      
Raju is very   handsome. (‘Adjective’
పరిమితిని తెలిపే Adverb)
                   Adverb  Adjective
        Raju sang enough  sweetly. ( ‘Adverb’
పరిమితిని తెలిపే మరొక Adverb)
                        Adverb   Adverb
        Raju’s house is extremely  busy. (
ఎంతమేరకు అని తెలిపే Adverb)
                                     Adverb    Adverb

ఈ విధంగా ఒక Verb యొక్క,  Adjective  యొక్క, మరొక Adverb  యొక్క అర్థాన్ని విశదీకరించి చెప్పే పదాలను ADVERBS గా గుర్తించాలి. భాషాభాగాలను గుర్తించే ప్రక్రియలో ఈ Adverbs ను గుర్తించడం కష్టతరం. ఇపుడు వీటిలో ఉన్న రకాలను తెలుసుకుందాం.

 

ADVERB ల రకాలు
 

1. Adverbs of Time: సమయ నిర్దేశం చేసేవి, ఒక వాక్యంలో Verb కి ‘When’ అనే ప్రశ్నవేస్తే వచ్చే జవాబే ఈ Adverbs of Time.. ఉదాహరణకు now, then, since, ago, before, already, soon, presently, immediately, instantly, early, late, today, tomorrow, yesterday, afterward, next లాంటివి.
e.g.: Lakshmi will arrive tomorrow.
2. Adverbs of Place:  
స్థల నిర్దేశం చేసేవి. '‘Where’ అని అడిగితే వచ్చే జవాబులు. ఉదాహరణకు here, there, hence, thence, hither, thither, in, out, within, without, above, below, far, near, inside, outside, up, down, beyond లాంటివి.
e.g.: We find him everywhere.
3. Adverbs of Number:  
'ఎన్నిసార్లు' అని నిర్దేశించేవి. ‘How often’ అనే ప్రశ్నకు సమాధానంగా నిలిచే Adverbs. ఉదాహరణకు once, twice, thrice, again, always, seldom, never, frequently, sometimes, often, firstly, secondly, four-fold, five-fold  లాంటివి.
e.g.: I helped him once.
4. Adverbs of Manner:  పని జరిగిన తీరును నిర్దేశించేవి. ‘How’ అనే ప్రశ్నకు జవాబుగా వచ్చే పదాలు. ఉదాహరణకు surely, probably, ertainly, meanly, extremely, so, conveniently, happily, sadly, well, ill, badly, quickly, loudly లాంటివి.
e.g.: She did the job happily.
5. Adverbs of Degree or Extent or Quantity:
 ఏ పరిమాణం మేరకు, ఎంతవరకు ఒక పని జరిగిందో నిర్దేశించేవి. ఉదాహరణకు  too, almost, fully, rather, quite, very, wholly, partly,  somewhat, (a) little, much, enough, pretty, half, so లాంటివి.
e.g.: The student’s answer is quite right.
6. Adverbs of Affirmation and Negation:  
అవును/ కాదు, ఉంది/ లేదు అని సరళంగా నిర్దేశించే పదాలు ఉదాహరణకు: yes, surely, certainly, definitely, no, not లాంటివి.
e.g.: Lalitha does not make false promises.
7. Adverbs of Reason:  
కాబట్టి/ అందువల్ల అని తెలిపేవి. ‘Why’ అని అడిగితే వచ్చే జవాబు పదాలు ఈ Adverbs ఉదాహరణకు as, because, therefore, hence, since లాంటివి.
e.g.: I therefore stopped talking to him.
8. Adverbs of Interrogation:  
ప్రశ్నించడానికి వాడే పదాలన్ని ఈ రకం Adverb లే. ఉదాహరణకు why, where, when, how మొదలైనవి.
e.g.: How do you drink that bad?
*ఇవే కాకుండా Adverbial Particles  కొన్ని ఉన్నాయి. అవి up, down, in, out, on, off, away,
back
లాంటివి.
e.g.: Take off your coat.
* ఇతర భాషాభాగాలకు చెందిన పదాలు కూడా Adverbs గా పనిచేయడం గమనార్హం.
e.g. He has been sleeping since morning.
* -ly
తో అంతమయ్యే పదాలు చాలా వరకు Adverbs అయి ఉంటాయి.
e.g.; The cup was nearly full.

 

POSITION OF ADVERBS IN A SENTENCE
*  e.g.: Mayuri danced well in the auditorium last Sunday.
         Adv.      Adv.      Adv.

Posted Date : 21-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌