• facebook
  • whatsapp
  • telegram

పాండిత్య సాధన నికష నిర్మాణం, నిర్వహణ, విశ్లేషణ

మూల్యాంకనం:
        విద్యార్థుల్లోని ప్రవర్తనా పరివర్తనల మాపనానికి చెందిన గుణాత్మక, పరిమాణాత్మక, సాంకేతిక విధానాల కలయికే 'మూల్యాంకనం'.

* మూల్యాంకనంలో ప్రధానంగా 4 ఉప ప్రక్రియలు ఉంటాయి. అవి
1. సమాచారాన్ని సేకరించడం (సరైన సాధనాల ఎంపిక)
2. సమాచారాన్ని వ్యాఖ్యానించడం (సమాచారాన్ని గుణాత్మక పదాల్లో వ్యాఖ్యానించడం)
3. తీర్పు తయారుచేయడం (గ్రేడు ఇవ్వడం)
4. నిర్ణయం తీసుకోవడం (విద్యార్థిని పైస్థాయిలోకి పంపాలా లేదా అదేస్థాయిలో ఉంచి లోప సవరణ చేయాలా)
* మూల్యాంకనం అనేది పాండిత్య, పాండిత్యేతర రంగాల్లో జరగాలి.

 


 

* పాండిత్య సాధన నికషలు 3 రకాలు. అవి:
          1) నియోజనాలు
          2) పరీక్షలు
          3) ప్రాజెక్టులు
* నియోజనాల్లో 3 భాగాలు ఉంటాయి. అవి:
          1) పాఠానికి ముందు సిద్ధం చేయాల్సిన భాగం (Preparation part)
          2) సాధన చేయాల్సిన భాగం (Practice part)
          3) వ్యాసక్తుల భాగం (Activity part)

 

1. పాఠానికి ముందు సిద్ధం చేయాల్సిన భాగం (Preparation part):
* విద్యార్థులకు 'ఆకారాల వర్గీకరణ' విషయం చెప్పే ముందు వివిధ ఆకారాలున్న వస్తువులను సేకరించమనడం, పటాలను వేయమనడం.
* విద్యార్థులకు 'ద్రవ్యమానం' పరిచయం చేసే ముందు చలామణిలో ఉండే నాణేలను, నోట్లను సేకరించమనడం.
* 'కాలమానం' పాఠ్యాంశం బోధించే ముందు రైలు, బస్సు కాల పట్టికలు సేకరించమనడం.

 

2. సాధన చేయాల్సిన భాగం (Practice part):
* తరగతిలో బోధించిన పాఠ్యాంశానికి చెందిన సూత్రాలు, నిర్మాణాలు, సమస్య సాధన పద్ధతులు మొదలైనవాటిని అభ్యాసం చేయడానికి ఉపయోగపడే నియోజనం.
* పాఠ్యపుస్తకంలో ఇచ్చిన సమస్యలను సాధన చేయడం.
* వివిధ పటాలను నిర్మించమనడం.
* నేర్చుకున్న విషయాన్ని క్లుప్తంగా రాయమనడం.
3. వ్యాసక్తుల భాగం (Activity part):
* వికాస బోధనకు ఇచ్చే నియోజనమే వ్యాసక్తుల భాగం.
* విద్యార్థుల అభ్యసన మరింత అర్థవంతంగా, ప్రయోజనకరంగా ఉండటానికి, విద్యార్థుల విశ్లేషణ సామర్థ్యాలను పెంచడానికి, నూతన విషయాలను తెలుసుకునేందుకు ఇచ్చే నియోజనం.
* పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల జ్ఞానావగాహనలు, క్రియాత్మక సామర్థ్యాలు, నైపుణ్యాలను తెలుసుకోవడానికి ఇచ్చే నియోజనం.
* వివిధ దేశాల నాణేలను సేకరించమనడం.
* కొలతలను వివిధ ప్రమాణాల్లోకి మార్చి చెప్పమనడం.
* మార్కెట్‌లోని వివిధ వస్తువుల ధరలను కనుక్కుని, ధరల పట్టికను తయారుచేయమనడం.
* క్యాలెండరులో పండగలను గుర్తించమనడం.
* తరగతిలో విద్యార్థుల బరువు, వయసుల దత్తాంశాన్ని తీసుకుని పటాలను గీయమనడం.
* పరిసరాల నుంచి వివిధ ఆకారాల వస్తువులను సేకరించమనడం.

పరీక్షలు
పాండిత్యరంగంలో ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలను 3 రకాలుగా విభజించారు.
1) రాతపూర్వక పరీక్షలు (Written Examinations)
2) మౌఖిక పరీక్షలు (Oral Examinations)
3) ప్రయోగ పరీక్షలు (Practical Examinations)

 

1) రాతపూర్వక పరీక్షలు
  ఇవి నాలుగు రకాలు
 i) వ్యాసరూప ప్రశ్నలు (Essay Questions)
 ii) సంక్షిప్త సమాధాన ప్రశ్నలు (SAQ)
 ii) లఘుసమాధాన ప్రశ్నలు (VSAQ)
 iv) విషయనిష్ఠ ప్రశ్నలు (Objective Questions)

 

i) వ్యాసరూప ప్రశ్నలు (స్వేచ్ఛాయుత సమాధానాలు కోరే ప్రశ్నలు):
* పరీక్షా పత్రాలను దిద్దేటప్పుడు మార్కులు ఇవ్వడంలో ఒక ఎగ్జామినర్‌కి, మరో ఎగ్జామినర్‌కి మధ్య తేడాలు వచ్చే ప్రశ్నలు.
* 3 లేదా 4 కంటే ఎక్కువ సోపానాలు ఉండే ప్రశ్నలు.
* విద్యార్థుల భాషా నైపుణ్యాలను, విషయాన్ని క్రమపద్ధతిలో తర్కబద్ధంగా, హేతుబద్ధంగా వ్యవస్థీకరించే సామర్థ్యాలను పరీక్షించే ప్రశ్నలు.
* విద్యార్థుల భావస్వేచ్ఛకు అవకాశం కల్పించే ప్రశ్నలు.
* విద్యార్థుల భావ ప్రకటన, వారి ఆలోచనా విధానం, ఊహాత్మక ఆలోచనలు, సృజనాత్మకతను ప్రదర్శించడానికి అవకాశం కల్పించే ప్రశ్నలు.
* ఉన్నత బౌద్ధిక ప్రక్రియ (అనుప్రయుక్తం, విశ్లేషణ, మూల్యాంకనం) లను పరీక్షించే ప్రశ్నలు.
* అమూర్త భావాలను వివరించడానికి తోడ్పడే ప్రశ్నలు.

 

ii) సంక్షిప్త సమాధాన ప్రశ్నలు (SAQ):
* 3, 4 సోపానాలు ఉండే ప్రశ్నలు.
* సిలబస్‌లోని ఎక్కువ అంశాలను పరీక్షించడానికి వీలయ్యే ప్రశ్నలు.
* సమాధానాలు స్పష్టంగా, సూటిగా, సంక్షిప్తంగా చెప్పడానికి అవకాశం ఉండే ప్రశ్నలు.
* ఎక్కువ 'విశ్వసనీయత' ఉండే ప్రశ్నలు.
* అన్ని లక్ష్యాలను పరీక్షించడానికి ఉపయోగపడే ప్రశ్నలు.
* ఆలోచనలు రేకెత్తించే ప్రశ్నలు.

 

iii) లఘు సమాధాన ప్రశ్నలు (VSAQ):
* ఒకటి లేదా రెండు మాటల్లో లేదా ఒక వాక్యంలో సమాధానం రాబట్టే ప్రశ్నలు.
* మూల్యాంకనానికి విషయనిష్ఠత, విశ్వసనీయత ఉండే ప్రశ్నలు.
  ఇవి 4 రకాలు.
   ఎ) ప్రశ్నల రూపం (Question form)
   బి) పూరణం (Completion form)
   సి) సంసర్గం (Association form)
   డి) సాదృశ్య రూపం (Analogy type)
* ప్రశ్నలో ఒక ఉమ్మడి ధర్మాన్ని లేదా సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చే ప్రశ్నలు - సంసర్గరూప ప్రశ్నలు.
* రెండు పదాలు లేదా రాశుల మధ్య సంబంధాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చిన జతల్లో ఖాళీగా ఉండే రెండో రాశిని తెలుసుకునే ప్రశ్నలు - సాదృశ్యరూప ప్రశ్నలు.
ఉదా: 'దీర్ఘచతురస్రం : 2 (పొడవు + వెడల్పు) :: చతురస్రం : .......... 'ఇది ఏ రకం లఘు సమాధాన ప్రశ్న? - సాదృశ్య రూపం.

 

iv) విషయనిష్ఠ ప్రశ్నలు: ఇవి 5 రకాలు.
       ఎ) ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు (సత్యం/ అసత్యం)
       బి) బహుళైచ్ఛిక ప్రశ్నలు
       సి) జతపరచడం
       డి) వర్గీకరణ రూపం
       ఇ) మాస్టర్ లిస్ట్
 సమాధానం ప్రకారం ప్రశ్నలు 2 రకాలు

         

2. మౌఖిక పరీక్షలు (Oral Examinations)
 ఉపాధ్యాయుడు తరగతిలో తరచుగా విషయానికి చెందిన ప్రశ్నలను అడిగి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టడం ద్వారా వారి ప్రగతిని అంచనా వేసే పరీక్షలు.
 మౌఖిక పరీక్షలో ప్రశ్నల ద్వారా జ్ఞానానికి సంబంధించిన అంశాలను, మనోగణనను పరీక్షించడానికి వీలవుతుంది.
3. ప్రయోగ పరీక్షలు (Practical Examinations)
 విద్యార్థుల కౌశలాలను, అనుప్రయుక్తానికి సంబంధించిన లక్ష్యాలను మాపనం చేయడానికి సాధ్యపడే పరీక్షలు.
ప్రాజెక్టులు (Projects)

పిల్లలు సహజ వాతావరణంలో తమంతట తాముగా అన్వేషించి, పరిశోధించి అవసరమయ్యే సమాచారాన్ని సేకరించి ఒక విషయం పట్ల లేదా అంశం పట్ల అవగాహన ఏర్పరచుకుని నిర్ధారణకు రావడానికి దోహదపడే కృత్యాలు.

ఉదా: 1. దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల విస్తీర్ణం, జనాభా వివరాలను సేకరించడం, ఆ సంఖ్యను అక్షరాల్లో రాయడం.
2. పాఠశాలల్లోని వివిధ తరగతుల విద్యార్థుల సంఖ్యను సేకరించడం, ఆ దత్తాంశాన్ని కమ్మీ రేఖా చిత్రంలో చూపించడం.
3. నమూనా గడియారం తయారుచేయడం.

 

సాధన పరీక్షలు
* ఒక నిర్దిష్టమైన క్రమానుసార అంశాల బోధన మూలంగా విద్యార్థి ఆర్జించిన సామర్థ్యాలను వ్యక్తిగతంగా మాపనం చేసే ప్రయత్నమే సాధన పరీక్ష.
* ఒక పాఠ్యాంశం లేదా అధ్యాయాన్ని బోధించిన వెంటనే నిర్వహించే పరీక్ష.
సాధన నికషలు 2 రకాలు.
                1. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు
                2. ప్రామాణిక పరీక్షలు
* యూనిట్‌ను ప్రాతిపదికగా చేసుకుని నిర్మించే పరీక్ష - యూనిట్ పరీక్ష.
*ఒ క యూనిట్ బోధన అనంతరం అందులోని లక్ష్యాలను ఎంతవరకు సాధించామో మాపనం చేసుకోవడానికి ఉపాధ్యాయుడు తయారుచేసే పరీక్ష - యూనిట్ పరీక్ష.
సాధన పరీక్షల ఉపయోగం
* విద్యార్థుల అభ్యసన అవసరాలను నిర్ధారణ చేయడానికి
* వారి బలాబలాలను గుర్తించడానికి
* వారి ప్రగతిని అధ్యయనం చేయడానికి
* సాధనకు అనుగుణంగా గ్రేడ్‌లు ఇవ్వడానికి
* కొత్త అంశాలను అధ్యయనం చేసే ముందు విద్యార్థులను ప్రేరేపించడానికి
* తగిన బోధనా కార్యక్రమాలను రూపొందించుకోవడానికి

 

యూనిట్ పరీక్షను రూపొందించడంలో సోపానాలు
        1. నికష పథక నిర్మాణం
        2. బ్లూప్రింటు ఆధారంగా పరీక్షాపత్రాలు తయారుచేయడం
        3. ప్రశ్నపత్ర సవరణ
        4. గణనసూచీ, గణన స్కీమ్ తయారుచేయడం
        5. ప్రశ్నలవారీగా విశ్లేషణ చేయడం

 

లక్ష్యాలు - భారత్వం
        1. జ్ఞానం - 20%
        2. అవగాహన - 28%
        3. అనుప్రయుక్తం - 40% 
        4. కౌశలాలు - 12%

 

ప్రశ్నల రకం - భారత్వం
        1. వ్యాసరూప ప్రశ్నలు - 40%
        2. సంక్షిప్త సమాధాన ప్రశ్నలు - 24% 
        3. లఘుసమాధాన ప్రశ్నలు - 16%
        4. విషయనిష్ఠ ప్రశ్నలు - 20%

 

కఠిన స్థాయి - భారత్వం
        1. కఠినం - 24%
        2. సామాన్యం - 48%
        3. సులభం - 28%

 

పాండిత్య సాధన నికషను రికార్డు చేయడానికి పొందుపరిచే అంశాలు: 
        1. విషయసూచిక 
        2. రికార్డు ఉద్దేశాలు 
        3. పరిచయం 
        4. పిల్లల స్థాయి
        5. పిల్లల సామర్థ్యాలను మూల్యాంకనం చేసే పద్ధతులు 
        6. మూల్యాంకన పత్రం రూపొందించడం
        7. పరీక్ష నిర్వహణ విధానం
        8. జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం 
        9. సాధించిన సామర్థ్యాల ఆధారంగా విశ్లేషణ పట్టికలను రూపొందించడం 
        10. పట్టికల ఆధారంగా చేసిన విశ్లేషణ, నిర్ధారణ 
        11. నిర్ధారణల ఆధారంగా తర్వాత చేపట్టాల్సిన చర్యలు
        12. ముగింపు

Posted Date : 01-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌