• facebook
  • whatsapp
  • telegram

గణితశాస్త్ర విద్యాప్రణాళిక, గణిత పాఠ్యపుస్తకాలు

1. కరికులమ్ (Curriculum) అంటే ఏమిటి?

జ: విద్యాప్రణాళిక
 

2. 'కురికులమ్' అనే పదం 'కరిరే' నుంచి వచ్చింది. 'కరిరే' ఏ భాషా పదం?

జ: లాటిన్
 

3. ''బాగా ఆలోచించి విద్యార్థులకు అందించే విద్యానుభవాల సముదాయమే విద్యాప్రణాళిక" అని నిర్వచించినవారు

జ: 10 సంవత్సరాల పాఠశాల విద్యాప్రణాళిక నిర్దేశాకృతి
 

4. ''పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తులన్నీ కలిపి విద్యా ప్రణాళిక అవుతుంది" అని ఎవరు  నిర్వచించారు? 

జ: ఆల్‌బర్టీ
 

5. జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం 2005 ప్రకారం విద్యా ప్రణాళిక అనేది

1) శిశుకేంద్రీకృత విధానాలకు అవకాశం కల్పించాలి.

2) విద్యార్థులు స్వయంగా, సహజంగా అభ్యసించే విధంగా ఉండాలి.

3) విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి దోహదపడాలి.

4) పైవన్నీ.

జ: 4 (పైవన్నీ.)
 

6. విద్యా ప్రణాళిక తయారీ దశలు ఎన్ని?

జ: 2
 

7. 10 సంవత్సరాల లక్ష్యాలను చేరుకోవడానికి కావాల్సిన పాఠ్య విషయాలు, అభ్యసన అనుభవాలు, వివిధ వ్యాసక్తుల ఎంపికను ఏమంటారు?

జ: కరికులం నిర్మాణం
 

8. ఎన్నుకున్న పాఠ్య విషయాలను, వ్యాసక్తులను 10 తరగతులుగా 10 సంవత్సరాల బోధనకు అనువుగా విడగొట్టడాన్ని ఏమంటారు?

1) కరికులం నిర్మాణం       2) విద్యాప్రణాళిక నిర్వహణ       3) విద్యాప్రణాళిక వ్యవస్థాపన          4) 2, 3

జ: 4 (2, 3)
 

9. కిందివాటిలో కరికులమ్ నిర్మాణ సూత్రం ఏది?

1) ప్రయోజన విలువ, సన్నాహ విలువ              2) క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ

3) వ్యాసక్తి, శిశుకేంద్రీకృతం                      4) పైవన్నీ

జ: 4 (పైవన్నీ)

10. శీర్షికా పద్ధతికి మరో పేరు ఏమిటి?

1) అంశాల పద్ధతి     2) ప్రకరణాల పద్ధతి     3) పాఠ్య విభాగ పద్ధతి       4) పైవన్నీ

జ: 4 (పైవన్నీ)
 

11. విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత నిర్మాణాలపై ఆధారపడిన పద్ధతి ఏది?
జ: శీర్షికా పద్ధతి

 

12. 'అమర్చే పద్ధతి' అని ఏ పద్ధతిని అంటారు?
జ: ఏకకేంద్ర పద్ధతి

 

13. 'కుంతల ఉపగమనం' అని ఏ పద్ధతిని పిలుస్తారు?
జ: సర్పిల పద్ధతి


14. ఏ పద్ధతిలో విద్యార్థులు ఒక శీర్షికకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానాన్ని పొందవచ్చు?
జ: శీర్షికా పద్ధతి


15. ఏ పద్ధతిలో బోధించాల్సిన శీర్షికను కొన్ని భాగాలుగా విడగొట్టి కాఠిన్యత, విద్యార్థుల మానసిక పరిపక్వతకు అనుగుణంగా వివిధ తరగతులకు విభజిస్తారు?
జ: సర్పిల పద్ధతి

 

16. సర్పిల పద్ధతికి సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
1) శ్రేణీకృత పద్ధతి అని కూడా పిలుస్తారు.
2) బోధించాల్సిన భాగాన్ని తగిన దశలో ప్రవేశపెడతారు.
3) రెండో భాగం బోధించేటప్పుడు ముందు భాగాన్ని పునర్విమర్శ చేస్తారు.
4) పైవన్నీ.
జ: 4 (పైవన్నీ)

 

17. ఒక భాగానికి మరో భాగానికి మధ్య కాలవ్యవధి 3 లేదా 4 నెలలు ఉండే పద్ధతి
జ: సర్పిల పద్ధతి

 

18. శీర్షికా పద్ధతికి చెందిన దోషం
1) మనోవైజ్ఞానిక సూత్రాలకు, శిశుకేంద్ర పద్ధతికి వ్యతిరేకం.
2) ముందు నేర్చుకున్న అంశాలను పునర్విమర్శ చేయడానికి వీలుండదు.
3) ముందు నేర్చుకున్న అంశాలను మరిచిపోయే అవకాశం ఉంది.
4) పైవన్నీ.
జ: 4 (పైవన్నీ)

19. కిందివాటిలో శీర్షికా పద్ధతికి చెందిన ప్రయోజనాన్ని గుర్తించండి.
1) ఒక శీర్షికకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతారు.
2) విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత సూత్రంపై ఆధారపడి ఉంటుంది.
3) విషయాలు నేర్చుకోవడంలో తార్కిక క్రమం ఉంటుంది.
4) పైవన్నీ.
జ: 4 (పైవన్నీ)

 

20. కిందివాటిలో ఏకకేంద్ర పద్ధతికి చెందిన లక్షణాన్ని గుర్తించండి.
1) మనోవిజ్ఞాన శాస్త్రాధారం.                                          2) శిశుకేంద్రీకృత విధానం.
3) పై తరగతుల్లో నేర్చుకోబోయే విషయానికి ప్రేరణ కల్పిస్తుంది.         4) పైవన్నీ.
జ: 4 (పైవన్నీ)

 

21. కిందివాటిలో ఏకకేంద్ర పద్ధతికి చెందిన దోషాన్ని గుర్తించండి.
1) విద్యార్థులకు ఒక అంశాన్ని పూర్తిగా నేర్చుకున్నామన్న తృప్తి ఏ తరగతిలోనూ కలగదు.
2) పునర్విమర్శ చేయడానికి వీలుండదు.
3) ముందు నేర్చుకున్న అంశాలను మరచిపోయే అవకాశం ఉంది.
4) పైవన్నీ.
జ: 1 (విద్యార్థులకు ఒక అంశాన్ని పూర్తిగా నేర్చుకున్నామన్న తృప్తి ఏ తరగతిలోనూ కలగదు.)

22. ప్రస్తుతం తరగతి గది బోధనలో ఎక్కువగా ఉపయోగపడే బోధనోపకరణం ఏది?
జ: పాఠ్యపుస్తకం

 

23. విద్యాప్రణాళికను సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పునర్ వ్యవస్థీకరిస్తారు?
జ: 10

 

24. రాష్ట్రస్థాయిలో పాఠ్యపుస్తకాల అభివృద్ధి ఎవరి ఆధ్వర్యంలో జరగుతుంది?
జ: ఎస్‌సీఈఆర్‌టీ

 

25. ''తరగతి గది ఉపయోగానికి బోధన సామగ్రితో జాగ్రత్తగా ఆ రంగంలో నిపుణుడు తయారుచేసిన పుస్తకమే పాఠ్యపుస్తకం" అని నిర్వచించినవారు
జ: బేకన్ పాసిల్

Posted Date : 28-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌