• facebook
  • whatsapp
  • telegram

గణితంలో ప్రతిభావంతులకు, మంద అభ్యాసకులకు నిపుణతతో యుక్తమైన విధానాలను రూపొందించడం

 విద్యార్థుల వైఖరులు, అభ్యసనం, అలవాట్లు, ప్రత్యేక ఆసక్తులు, ఊహలు, శ్రమ, తెలివితేటలు లాంటివాటిలో విద్యార్థుల వైయక్తిక భేదాలు కనిపిస్తాయి. ఇవి విద్యాసాధనలో ఎక్కువగా ఉంటాయి.
* తరగతిలోని అతి ఎక్కువ స్థాయిలోని విద్యార్థి సాధన అతి తక్కువ సాధన గల విద్యార్థి కంటే 3 నుంచి 5 రెట్లు వరకు ఉంటుంది.
 

గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులు
* ఏ దిశలోనైనా ప్రజ్ఞ, సృజనాత్మక శక్తి ఉండి సాధారణ విద్యార్థుల కంటే ఎక్కువ ప్రతిభ చూపేవారిని 'ప్రతిభావంతులైన విద్యార్థులు' అంటారు.
* గణితంలో అత్యధిక ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ ఉంటారు. తమ స్థాయికి మించిన సమస్యలను పరిష్కరిస్తారు. గొప్ప మేధస్సును ఉపయోగించే విద్యార్థులే ప్రతిభావంతులు. వీరి ప్రజ్ఞాలబ్ధి 140, అంతకంటే ఎక్కువ.

గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడం
i) ముందు తరగతి ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరించడం
ii) ముందు తరగతిలో గణితంలో పొందిన మార్కులు
iii) సహజ సామర్థ్య పరీక్షల్లోని మార్కులు
iv) ముఖాముఖి చర్చల నివేదికలు
v) తయారుచేసిన ఇంటర్వ్యూ నివేదికలు
 

గణితంలో ప్రతిభావంతులైన (ప్రజ్ఞావంతులైన) విద్యార్థుల లక్షణాలు
i) త్వరితంగా, సులభంగా నేర్చుకుంటారు.
ii) క్లిష్టమైన, తెలివైన, ఆలోచించదగిన ప్రశ్నలు అడుగుతారు.
iii) ప్రశ్నలకు వేగంగా, చురుగ్గా, కచ్చితంగా సమాధానాలు ఇస్తారు.
iv) ఉపజ్ఞత, సృజనాత్మకత, స్వశక్తి, నూతనత్వాన్ని కలిగి ఉంటారు.
v) ప్రతి పరీక్షలోనూ అత్యధిక ప్రతిభను చూపుతారు.
vi) స్థాయికి మించిన సమస్యలను అర్థం చేసుకొని, పరిష్కరిస్తారు.
vii) ప్రజ్ఞాలబ్ధి 120 - 140 వరకు, ఆపైన కూడా ఉంటుంది.

బ్రాండీవీన్ ప్రకారం ప్రతిభావంతులైన విద్యార్థులను 3 రకాలుగా గుర్తించవచ్చు

గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు పుష్టీకరణ కార్యక్రమాలు
* ప్లేటో ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా కార్యక్రమాలను రూపొందించారు.
* గణితంలో పుష్టీకరణ కార్యక్రమాలు 2 విధాలుగా ఉంటాయి.
అవి: 1) నూతన విద్యా ప్రణాళికను రూపొందించడం
    2) ఉన్న విద్యా ప్రణాళికను పుష్టీకరించడం
* మొదటి విధానంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నూతన విద్యా ప్రణాళికను రూపొందించి పాఠ్యాంశాల్లో ఎక్కువ స్థాయి ఉన్న అంశాలను చేర్చాలి.
* రెండో విధానంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు వేరే 'కరికులం' ను రూపొందించకుండా ఉన్నదానిలోనే అభ్యసనావకాశాలు ఎక్కువగా చేర్చాలి.

ప్రతిభావంతులకు సంస్థాగత ఏర్పాట్లు
1) సమాన సామర్థ్య సమూహాల ఏర్పాట్లు
2) ప్రతిభావంతులకు గణితంలోని పాఠ్యాంశాలపై ప్రత్యేకంగా వేసవి తరగతులు నిర్వహించడం
* అంతర్జాతీయ గణిత పోటీ క్రీడోత్సవాల (IMO) కోసం జట్టును ఎంపికచేసి శిక్షణ ఇవ్వడం

3) గణిత క్లబ్: గణిత అధ్యయనాన్ని వృద్ధి చేయడానికి, ఉద్దీపించడానికి గణిత క్లబ్ ఒక భూమికగా ఉపయోగపడుతుంది.
4) గణిత ప్రతిభాన్వేషణ: గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించేందుకు, వారి విద్యాభ్యాసం నిరాటంకంగా కొనసాగడానికి గణిత ప్రతిభాన్వేషణ పథకాలను ఏర్పాటు చేయడం.
ఉదా: నేషనల్ టాలెంట్ సెర్చ్ (NTS)ను 1962 - 63 విద్యా సంవత్సరంలో ఎన్‌సీఈఆర్‌టీ (జాతీయ విద్యా శిక్షణా మండలి - దిల్లీ) రూపొందించింది.
* ఎన్‌టీఎస్ మొదట కేవలం విజ్ఞాన శాస్త్రం కోసం ఉద్దేశించిందైనా తర్వాత అన్ని సబ్జెక్టులకు దీని పరిధిని పెంచారు.
 

జాతీయ విద్యా శిక్షణా మండలి
ఉద్దేశం:
సెకండరీ విద్యాభ్యాసం ముగిసేలోపే గణితం, విజ్ఞాన శాస్త్రాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారికి +2 స్థాయి నుంచి పీహెచ్‌డీ స్థాయి వరకు ఉపకార వేతనాలు ఇవ్వడం.
ఉపకార వేతనాలకు అర్హులు: 1000 (ఎస్సీలు - 15%, ఎస్టీలు - 7.5%, వికలాంగులు - 3%)
అర్హులు: 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు
ఫీజు: రూ.100
పరీక్ష: రెండు స్థాయిల్లో ఉంటుంది
1) రాష్ట్ర స్థాయి
2) జాతీయ స్థాయి
మాధ్యమం: ఆంగ్లం, గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషల్లో ఉంటుంది.
సిలబస్: నిర్ణీత సిలబస్ ఉండదు. ప్రశ్నలు పదో తరగతి పరీక్షల స్థాయిలో ఉంటాయి.
* రాష్ట్ర స్థాయి పరీక్ష 2 భాగాలుగా ఉంటుంది.
1) మేధాశక్తి పరీక్ష
2) పాండిత్య ప్రతిభ పరీక్ష
 

మేధాశక్తి పరీక్ష:
* ఈ పరీక్ష కాల వ్యవధి 90 నిమిషాలు. మార్కులు 100.
* తార్కిక జ్ఞానం, హేతువాదన, విశ్లేషణ, సంశ్లేషణ సామర్థ్యాలను పరీక్షించేవి బహుళైచ్ఛిక ప్రశ్నలు.
* ఈ పరీక్ష అందరికీ తప్పనిసరిగా ఉంటుంది.
 

పాండిత్య ప్రతిభ పరీక్ష:
* ఈ పరీక్షలో పాఠశాల స్థాయి గణితం; భౌతిక, రసాయన, జీవ, ఆర్థిక, భౌగోళిక, చరిత్ర, పౌర శాస్త్రాలు ఉంటాయి. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. దీనిలో నాలుగు సబ్జెక్టులను ఎంపిక చేస్తారు. ఒక్కో సబ్జెక్టుకు 25 మార్కులు.
* రాష్ట్ర స్థాయి ప్రతిభా జాబితాను ఎన్‌సీఈఆర్‌టీ దిల్లీకి పంపుతుంది.
* జాతీయ స్థాయి పరీక్షను మే 2వ ఆదివారం నిర్వహిస్తారు. ఈ పరీక్షలు కూడా రెండు భాగాలుగా ఉంటాయి. జులైలో ఇంటర్వ్యూను నిర్వహిస్తారు.
 

గణిత ఒలంపియాడ్:
* గణితంలో ప్రతిభావంతులైన వారిని గుర్తించే ఉద్దేశంతో APAMT (హైదరాబాద్) ప్రతి ఏడాది మనరాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 500 కేంద్రాల్లో దీన్ని నిర్వహిస్తున్నారు.
* ఈ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు మాత్రమే ఇండియన్ నేషనల్ మ్యాథమెటికల్ ఒలంపియాడ్‌లో పాల్గొనడానికి అర్హులు. ఈ పరీక్ష వ్యవధి 3 గంటలు.
 

ఈ పరీక్ష నాలుగు స్థాయిల్లో జరుగుతుంది.
1) హైస్కూల్ విద్యార్థుల స్థాయి
2) ఇంటర్మీడియట్ విద్యార్థుల స్థాయి
3) డిగ్రీ స్థాయి
4) పీజీ స్థాయి
* హైస్కూల్, ఇంటర్ స్థాయిలకు ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిషు, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో ముద్రిస్తారు.
* డిగ్రీ, పీజీ స్థాయి వారికి ఇంగ్లిషులోనే ముద్రిస్తారు.
పరీక్షాంశాలు: అంతరదృష్టి, తార్కిక వివేచన, విమర్శనాత్మక దృక్పథం, స్థాయికి తగిన పరిపక్వత, సమస్యను సాధించడంలో జ్ఞానాన్ని వినియోగించే శక్తిని పరీక్షించే అంశాలు ఉంటాయి.
* ఈ పరీక్షలో అర్హులైన మొదటి 20 మంది మాత్రమే ఇండియన్ నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో పాల్గొంటారు.
* నేషనల్ మ్యాథమెటిక్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్‌ను విజయవాడలో నిర్వహిస్తున్నారు. (గణిత విజ్ఞాన శాస్త్రాల సంఘం, విజయవాడ)
* సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్స్‌ను 1988 - 89 నుంచి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. (డాక్టర్ ఎ.ఎన్.రావు అవార్డు కౌన్సిల్, హైదరాబాద్)
5) గణిత పోటీలు: క్రీ.శ.1400 సంవత్సరాల కిందటే భారతీయులు పరీక్షల  ప్రాముఖ్యాన్ని గుర్తించారు.
* 16వ శతాబ్దంలో టర్టాగ్లీయా అనే గణిత శాస్త్రవేత్త గణిత సమస్యలు, ప్రహేళికలను భోజనానంతరం వినోదానికి ఉపయోగించారని తెలిపారు.
* రాత పూర్వకమైన గణిత పోటీ పరీక్షను మొదటిసారిగా 1894లో హంగేరి భౌతిక శాస్త్రాల సంఘానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త లోరాండ్ ఎటోవ్స్ గౌరవార్థం నిర్వహించారు.
 

గణిత పోటీ పరీక్షలను నిర్వహించే సంస్థలు
1. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్ (APAMT, Hyderabad)
2. అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా (AMTI, Chennai)
3. దిల్లీ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్ (DAMI, Delhi)
 

ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్ విజేతలకు ఇచ్చే బంగారు పతకాలు
* ఆచార్య మీనాక్షి సుందరం జ్ఞాపకార్థం (పదోతరగతి స్థాయి)
* ఆచార్య పి.ఎల్. భట్నాగర్ జ్ఞాపకార్థం (ఇంటర్మీడియట్ స్థాయి)
* రామానుజన్ జ్ఞాపకార్థం (డిగ్రీ స్థాయి)
* ఆర్యభట్ట జ్ఞాపకార్థం (పీజీ స్థాయి)
6. అనుబంధ పాఠ్య సామగ్రి: గణిత ఒలంపియాడ్ ఐఐటీ ప్రవేశ పరీక్షలు, జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షల్లోని గణితాంశాలను సాధన చేయించడం.
7. బోధనలో సహాయకులు
 

గణితంలో మంద అభ్యాసకులు:
* 'ఒక విద్యార్థి తరగతిలోని తోటివారిలో సమాన స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలో జ్ఞానాన్ని కలిగి ఉండటం'   - సర్ సిరిలోబర్ట్
* 85 కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉన్నవారు, సాధారణంగా అధ్యయనంలో తగినంత శక్తి సామర్థ్యాలు లేనివారు మంద అభ్యాసకులు.  - ఎఫ్.జె. షాని
* విద్యాపరంగా నిర్వచిస్తే విద్యార్థి తన తరగతిలోని తోటివారి కంటే తక్కువ స్థాయిలో గణిత జ్ఞానాన్ని కలిగి ఉండటాన్ని 'వెనుకబడినతనం' అంటారు.
* ఏ విద్యార్థి అయినా తన సమవయస్కుల కంటే తక్కువ విద్యార్జన కలిగి ఉంటే వారిని 'వెనుకబడిన విద్యార్థి' అంటారు.
 

గణితంలో మంద అభ్యాసకుల లక్షణం:
* ప్రజ్ఞాలబ్ధి 70 - 90 మధ్య ఉంటుంది.
* జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంటుంది.
* తప్పు - ఒప్పులు కనుక్కోలేరు.
* అమూర్త భావనలతో ఇబ్బందిపడతారు.
* పఠనాశక్తి ఉండదు.
* తాత్కాలిక, స్వల్పకాలిక శ్రద్ధతో ఉంటారు.
* తార్కిక ఆలోచన, ఊహాశక్తి లేకపోవడం వల్ల వారు చేసే తప్పులను కనుక్కోలేరు.
 

గణితంలో విద్యార్థి వెనుకబడటానికి కారణాలు:
1) శారీరక వైకల్యం
2) తెలివితక్కువతనం
3) గణిత సామర్థ్యం లేకపోవడం
4) అనుచితమైన బోధనా విధానం
5) క్రమరహితమైన హాజరు
6) బదిలీ సమస్య
7) అనుకూలంగా లేని ఇంటి వాతావరణం
గణితంలో మంద అభ్యాసకుల నిష్పాదన, సాధనను అభివృద్ధిపరిచే విధానాలు:
* మంద అభ్యాసకులకు 'చేయడం ద్వారా అభ్యసనం' అనే సూత్రాన్ని అనుసరించి బోధిస్తే సులభంగా గ్రహిస్తారు.
* తరగతి చాలా చిన్నదిగా ఉండాలి (విద్యార్థులు 20 - 30)
* బోధన వీలైనంత వరకు వ్యక్తిగతంగా ఉంటే బాగుంటుంది.
* గణితాన్ని విద్యార్థుల నిత్య జీవితానికి అన్వయించాలి.
* 'రోగి రోగం నయమవకుంటే, వైద్యం చేసిన విధానాన్ని తప్పుపట్టే బదులు రోగిని తప్పుపట్టడం ఒక పాఠశాలలోనే జరుగుతుంది'.  - షుల్ట్జ్

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌