• facebook
  • whatsapp
  • telegram

గణితంలో ప్రతిభావంతులకు, మంద అభ్యాసకులకు నిపుణతతో యుక్తమైన విధానాలను రూపొందించడం

1. సామూహిక బోధనా సమూహానికి అనుగుణంగా రూపొందించడంలో కిందివాటిలో వేటిని నిర్లక్ష్యం చేయవచ్చు?
1) వ్యక్తిగత భేదాలు (వైయక్తిక భేదాలు)            2) పాఠ్యాంశాలు
3) యూనిట్‌లు                            4) విద్యా ప్రణాళిక
జ: 1 (వ్యక్తిగత భేదాలు (వైయక్తిక భేదాలు))

 

2. విద్యార్థులను దేని ఆధారంగా సమూహాలుగా విభజిస్తారు?
జ: అభ్యసన స్థాయి

 

3. గణితంలో అత్యధిక ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ ప్రతి విషయంలోనూ అందరికంటే ముందుగా తన స్థాయికి మించిన సమస్యలను పరిష్కరించే విద్యార్థులు?
జ: ప్రతిభావంతులు

 

4. ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి?
జ: 120 - 140, అంతకంటే ఎక్కువ

 

5. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల లక్షణం?
1) సునిశిత పరిశీలనా దృష్టి       2) ఏకాగ్రత        3) అవధానం ఉండటం          4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

6. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించే కార్యక్రమం?
1) జన్యుకారకాలు       2) ప్రశ్నించే స్థాయి      3) చురుగ్గా స్పందించే లక్షణాలు         4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

7. ప్రతిభావంతుల పుష్టీకరణ కార్యకమ్రం.
1) నూతన విద్యా ప్రణాళికలను ఏర్పాటుచేయడం      2) ఉన్నత విద్యా ప్రణాళికను పుష్టీకరించడం 
3) 1, 2                            4) ఏదీకాదు
జ: 3 (1, 2)

 

8. కిందివారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండే విద్యార్థులు?
1) సగటు స్థాయి విద్యార్థులు    2) ప్రతిభావంతులు      3) మంద అభ్యాసకులు      4) అందరూ
జ: 2 (ప్రతిభావంతులు)

9. గణిత క్లబ్‌లు, ప్రదర్శనలు, ఫెయిర్స్ లాంటి కార్యక్రమాలను నిర్వహించే బాధ్యత ఎవరికి అప్పగించాలి?
జ: ప్రతిభావంతులు

 

10. ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) అంటే?
జ: జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి

 

11. జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి (NCERT) ఎక్కడ ఉంది?
జ: దిల్లీ

 

12. ఎన్‌సీఈఆర్‌టీ ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడానికి గణిత ప్రతిభాన్వేషణ పథకాలను ఎప్పుడు ప్రారంభించింది?
జ: 1962 - 63

 

13. ఎన్‌టీఎస్ అంటే?
జ: నేషనల్ టాలెంట్ సెర్చ్

 

14. ఎన్‌టీఎస్ పరీక్ష రాయడానికి ఏ తరగతి చదివేవారు అర్హులు?
జ: 10వ

 

15. ఐఎమ్‌వో అంటే?
జ: ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలంపియాడ్

 

16. ఎన్‌టీఎస్ పరీక్షలో ప్రశ్నలు ఏ తరగతి స్థాయిలో ఉంటాయి?
జ: 10వ

 

17. ఎన్‌టీఎస్ పరీక్షలో ఏ తరగతి వరకు సిలబస్ ఉంటుంది?
జ: నిర్ణీత సిలబస్ ఉండదు

 

18. ఎన్‌టీఎస్ పరీక్షలో రాష్ట్ర స్థాయి పరీక్షలో ఉండే భాగం?
జ: మేథాశక్తి, పాండిత్య ప్రతిభ పరీక్షలు

 

19. ఎన్‌టీఎస్ జాతీయ స్థాయి పరీక్షకు ఎవరు అర్హులు?
జ: రాష్ట్ర స్థాయి పరీక్షలో ఎంపికైనవారు

 

20. జాతీయ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారు?
జ: మే రెండో ఆదివారం

 

21. కిందివాటిలో ఎన్‌టీఎస్ పరీక్షకు సంబంధించింది?
1) రాష్ట్ర స్థాయి పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి    2) జాతీయ స్థాయి పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి
3) మౌఖిక పరీక్ష ఉంటుంది                        4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

22. గణితంలో ప్రతిభావంతులైన వారిని గుర్తించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్ సంస్థ (APAMT) నిర్వహించే పరీక్ష ఏది?
జ: మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్

 

23. రాష్ట్ర స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్ పరీక్ష ఎన్ని స్థాయిల్లో జరుగుతుంది?
జ: 4

 

24. కింది ఏ పరీక్షకు ప్రత్యేకమైన సిలబస్ లేదు?
1) ఎన్‌టీఎస్                  2) మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్ 
3) ఎన్‌టీఎస్, మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్      4) ఏదీకాదు
జ: 3 (ఎన్‌టీఎస్, మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్)

 

25. ఏపీఏఎమ్‌టీ (APAMT) అంటే?
జ: ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్

 

26. ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్‌లో పాల్గొనే విద్యార్థి అర్హతలు?
జ: రాష్ట్రస్థాయి మ్యాథమెటిక్స్

 

27. గణిత పోటీ పరీక్షల ప్రాముఖ్యాన్ని భారతీయులు ఎన్ని సంవత్సరాల కిందట గుర్తించారు?
జ: క్రీ.శ.1400

 

28. 16వ శతాబ్దంలో ఏ గణిత శాస్త్రవేత్త గణిత సమస్యలను, ప్రహేళికలను భోజనానంతరం వినోదానికి ఉపయోగించారు?
జ: టార్టాగ్లియా

 

29. మొదటిసారి రాతపూర్వక గణిత పోటీ పరీక్షను లోరాండ్ ఎటోవ్స్ గౌరవార్థం ఎప్పుడు నిర్వహించారు?
జ: 1894

 

30. 'తన తరగతిలోని తోటివారితో సమాన స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలో ఉండేవారు' మంద అభ్యాసకులు అని నిర్వచించింది?
జ: సర్ సిరిలోబర్ట్

 

31. '85 కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉన్నవారు, సాధారణంగా అధ్యయనంలో తగినంత శక్తి సామర్థ్యాలు లేనివారు మందకొడి విద్యార్థులని' తెలియజేసింది?
జ: ఎఫ్.జె. షానె

 

32. గణితంలో మంద అభ్యాసకుల లక్షణం?
1) ఆలోచనాశక్తి, ఊహాశక్తి, పఠనాశక్తి, ఏకాగ్రత తక్కువ      2) జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంటుంది
3) ప్రజ్ఞాలబ్ధి 70 - 90 మధ్య ఉంటుంది            4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

33. గణితంలో విద్యార్థి వెనుకబడటానికి కారణం?
1) శారీరక అంగవైకల్యం, తెలివితక్కువతనం            2) గణితంలో సామర్థ్యం లేకపోవడం 
3) క్రమరహితమైన హాజరు, ఉద్యోగ విషమయోజనం       4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

34. 'ఇండియన్ నేషనల్ ఒలంపియాడ్‌'లో పాల్గొనడానికి రాష్ట్ర స్థాయి పరీక్షలో ఎంతమంది అర్హులు?
జ: 20

 

35. మందకొడి విద్యార్థులు వెనుకబడటానికి ప్రధాన కారణం ఏమిటి?
జ: ప్రజ్ఞాలోపం

 

36. AMIT ఎక్కడ ఉంది?
జ: చెన్నై

 

37. DAMT ఎక్కడ ఉంది?
జ: దిల్లీ

 

38. రాతపూర్వకమైన గణిత పోటీ పరీక్షను మొదటిసారిగా నిర్వహించింది?
జ: హంగేరి భౌతిక శాస్త్రాల సంఘం

 

39. గణితంలో ప్రతిభావంతులైన వారిని గుర్తించే రాష్ట్ర స్థాయి పరీక్ష 'మ్యాథమెటిక్ ఒలంపియాడ్‌'కు సంబంధించింది?
1) పరీక్ష వ్యవధి మూడు గంటలు        2) పరీక్ష నాలుగు స్థాయిల్లో జరుగుతుంది
3) ప్రత్యేకమైన సిలబస్ ఉండదు         4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

40. కిందివాటిలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడానికి ఉపయోగించే కారకం కానిది?
1) జన్యుకారకం            2) ప్రశ్నించే స్థాయి
3) చురుగ్గా స్పందించే లక్షణం       4) ఏదీకాదు
జ: 4 (ఏదీకాదు)

Posted Date : 09-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌