• facebook
  • whatsapp
  • telegram

త్రిభుజాలు

1. త్రిభుజంలోని ఉన్నతుల మిళిత బిందువు ......
జ: లంబకేంద్రం
 

2. ఒక త్రిభుజ వైశాల్యం 30 చ.సెం.మీ. త్రిభుజ ఉన్నతి దాని ఆధార భుజం కంటే 7 సెం.మీ. ఎక్కువైతే ఆధార భుజం పొడవు (సెం.మీ.లలో) .....
జ: 5
 

3. కింది ఏ త్రిభుజ కోణాలు అల్పకోణ త్రిభుజాన్ని సూచిస్తాయి?
1) 43o, 63o, 73o   2)  44o, 62o, 73o   3) 44o, 63o, 73o  4) 44o, 63o, 74o
జ: 44o, 63o, 73o
 

4. కింది ఏ త్రిభుజ కోణాలు అధిక కోణ త్రిభుజాన్ని సూచిస్తాయి?
1) 116o, 36o, 64o     2) 16o, 64o, 100o   3) 36o, 64o, 100o  4) 16o, 96o, 100o
జ: 16o, 64o, 100o


 

6. ఒక త్రిభుజంలోని కోణాలు 1 : 1 : 2 నిష్పత్తిలో ఉంటే ఆ త్రిభుజం .....
జ: లంబకోణ సమద్విబాహు త్రిభుజం
 

7. ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణం ఉన్న భుజాలు 8 సెం.మీ. 12 సెం.మీ అయితే దాని వైశాల్యం ఎంత?
జ: 48 చ.సెం.మీ.
 

8. త్రిభుజంలో మధ్యగత రేఖల మిళిత బిందువుని ఏమంటారు?

జ: గురుత్వ కేంద్రం
 

9. ఒక త్రిభుజ వైశాల్యం 88 చ.సెం.మీ. దాని భూమి ఎత్తు కంటే 5 సెం.మీ. తక్కువ అయితే ఆ త్రిభుజ ఎత్తు ఎంత?
జ: 16 సెం.మీ.
 

10. ఒక త్రిభుజంలోని కోణాలు 1 : 2 : 3 నిష్పత్తిలో ఉంటే వాటికి ఎదురుగా ఉన్న భుజాల నిష్పత్తి.....

11. కిందివాటిలో సమద్విబాహు త్రిభుజానికి చెందిన కొలతలు ఏవి?
1) 1 సెం.మీ., 1 సెం.మీ., 6 సెం.మీ.            2) 2 సెం.మీ., 2 సెం.మీ., 6 సెం.మీ.
3) 3 సెం.మీ., 3 సెం.మీ., 6 సెం.మీ.           4) 4 సెం.మీ., 4 సెం.మీ., 6 సెం.మీ.
జ: 4 సెం.మీ., 4 సెం.మీ., 6 సెం.మీ.
 

12. ఒక త్రిభుజంలోని భూమి, ఎత్తు సమానం. ఆ త్రిభుజ వైశాల్యం 50 చ.సెం.మీ అయితే దాని ఎత్తు ఎంత? (సెం.మీ.లలో)
జ: 10
 

13. ΔPQR లో PR అనేది కర్ణం అయితే లంబకోణం ఉన్న శీర్షం ఏది?
జ: Q
 

14. ఒక త్రిభుజం భుజాలు 5 సెం.మీ., 12 సెం.మీ., 13 సెం.మీ., అయితే ఆ త్రిభుజ వైశాల్యం ఎంత?
జ: 30 చ.సెం.మీ. 
 

15. ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణం ఉన్న భుజాలు 30 సెం.మీ., 40 సెం.మీ. అయితే ఆ త్రిభుజ కర్ణం పొడవు ఎంత?
జ: 50 సెం.మీ.
 

16. ఒక లంబకోణ త్రిభుజంలో రెండు భుజాలు ప్రధాన సంఖ్యలు, వాటి భేదం 50. అయితే మూడో భుజం విలువ?
జ: 60

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌