• facebook
  • whatsapp
  • telegram

కళలు - కళాకారులు

1. అమ్మవార్లను తాంత్రిక పద్ధతిలో పూజించేవారు?

జ‌: ఆసాదులు


2. కిందివాటిలో రాత్రి పూట మాత్రమే ప్రదర్శించే కళారూపం?

జ‌: గంటె భాగవతం


3. కిందివారిలో యాదవ కులానికి చెందిన కళాకారులు ఎవరు?

1) మందెచ్చు కళాకారులు   2) విప్ర వినోదులు

3) బుడగ జంగాలు       4) శారదకాండ్రు

జ‌: మందెచ్చు కళాకారులు


4. ‘గంగ-గౌరి’ కళను చెప్పేవారు ఎవరు?

జ‌: భిక్షుక కుంట్లు        


5. ఏ కళను కోస్తా, రాయలసీమలో తప్పెటగుళ్లు అని పిలుస్తారు?

జ‌:  కప్ప పెళ్లి


6. స్త్రీలు పాల్గొనే చుట్టకాముడు ఆటకు దగ్గరగా ఉన్న కళారూపం?

జ‌: ధులా నృత్యం     


7. మిద్దెరాములు కింది ఏ కళలో ప్రపంచ ప్రసిద్ధి చెందారు?

జ‌: ఒగ్గు కథ    


8. ఎల్లమ్మ కథను గానం చేసే కళాకారులు?

జ‌: ఆసాదులు      


9. ‘బవనీలు’ అని ఎవరిని పిలుస్తారు?

జ‌: జముకుల వారు    


10. తెలంగాణలో పెళ్లిళ్లు, హోళీ, ఏరువాక సందర్భాల్లో బంజారాలు ప్రదర్శించే నృత్యం?

జ‌:  లంబాడి నృత్యం   


11. జ్యోతిషం చెబుతూ, తాయెత్తులు కడుతూ యాచక వృత్తిని చేసే కళాకారులు?

జ‌: బుడబుక్కల వారు    


12. ముకెబర్ల జంగాలను ఎవరి కాలంలో శైవులుగా పేర్కొన్నారు?

జ‌:  కాకతీయులు       


13. ‘బుడ్డర్‌ ఖాన్‌’ పాత్ర ఎందులో ముఖ్యమైంది?

జ‌:  చిందు భాగవతం   

Posted Date : 05-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌