• facebook
  • whatsapp
  • telegram

శతకాలు

1. సాధారణంగా శతకంలో ఎన్ని పద్యాలు ఉంటాయి?

1) 101  2) 108  3) 110  4) 142

2. శతకాల్లో పద్యం చివర ఉండే సంబోధన పదాన్ని ఏమంటారు?

1) సజాతీయత     2) ముక్తకం 

3) మకుటం     4) స్వతంత్రత

3. కిందివాటిలో ద్విపాదమకుటం ఉన్న శతకం?

1) వృషాధిప శతకం   2) సుమతీ శతకం 

3) వేమన శతకం   4) ఆంధ్రనాయక శతకం

4. యథావాక్కుల అన్నమయ్య రాసిన శతకం ఏది?

1) మల్లభూపాలీయ శతకం 2) చిత్త శతకం 

3) సర్వేశ్వర శతకం 4) నరసింహ శతకం

5. భర్తృహరి ఏ శతాబ్దానికి చెందిన కవి?

1) 3వ   2) 7వ   3) 9వ   4) 13వ 

6. విశ్వకర్మ శతకాన్ని రచించింది ఎవరు?

1) ఉత్పల సత్యనారాయణాచార్య 

2) వేంకటరావు పంతులు 

3) పండిత రామసింహ కవి 

4) డా.టి.వి.నారాయణ

7. నగ్న సత్యాల శతకం రాసిన శతక కవి?

1) రావికంటి రామయ గుప్త 

2) పురుషోత్తమాచార్యులు 

3) పండిత రామసింహ కవి 

4) ఇమ్మడిజెట్టి చంద్రయ్య

8. ‘‘గురుపాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు సిరిలేకపోయినా ప్రకాశిస్తాడు’’ అని చెప్పిన కవి?

1) కాకుత్థ్సం శేషప్ప కవి 

2) యథావాక్కుల అన్నమయ్య 

3) నంబి శ్రీధరరావు 

4) ఎలకూచి బాలసరస్వతి

9. ‘భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పంబుగా’ అన్నమయ్య దేన్ని చెప్పాడు?

1) సత్యం     2) దయాగుణం 

3) దాన గుణం     4) ధ్యానం

10. భర్తృహరి నీతిశతకాన్ని ఏనుగు లక్ష్మణ కవి ఏ పేరుతో అనువదించారు?

1) నీతి శతక త్రయం    2) సుభాషిత త్రిశతి 

3) సుభాషిత రత్నావళి    4) త్రయీ శతకం

11. ప్రతిపద్యంలోని మొదటి పాదంలో ఒక నీతిని చెప్పి తర్వాతి పాదాల్లో దాన్ని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఏ శతకంలోని ప్రత్యేకత?

1) భాస్కర శతకం     2) నరసింహ శతకం 

3) సర్వేశ్వర శతకం 

4) లొంక రామేశ్వర శతకం

12. ‘విద్వత్‌ కవి’గా ప్రసిద్ధి చెందింది?

1) గడిగె భీమ కవి 

2) ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు 

3) పండిత రామసింహ కవి 

4) వేంకటరావు పంతులు


13. ‘సతతా చారము సూనృతంబు కృపయున్‌ సత్యంబునున్‌ శీలమున్‌’ అనే పద్యం ఏ శతకం లోనిది?

1) వేణుగోపాల శతకం 

2) నరసింహ శతకం 

3) చిత్త శతకం     4) నారాయణ శతకం

14. కిందివాటిలో ద్విపాద మకుటం లేని శతకాన్ని గుర్తించండి.

1) ఆంధ్ర నాయక శతకం 

2) నరసింహ శతకం   

3) విశ్వకర్మ శతకం 

4) బాకవరాంజనేయ శతకం

15. ‘‘దేశ జననీ ప్రాశస్త్యమున్‌ పంచునో అనిదంపూర్వ యశస్వి యాతడగునన్నా! విశ్వనాథేశ్వరా!’’ అన్న కవి?

1) పక్కి అప్పల నరసయ్య 

2) గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ 

3) కూచిమంచి తిమ్మకవి 

4) మారద వెంకయ్య

16. శ్రీపతి భాస్కర కవి రాసిన శతకం ఏది?

1) భాస్కర శతకం 

2) లొంక రామేశ్వర శతకం 

3) చిత్త శతకం     4) విశ్వకర్మ శతకం

17. కిందివారిలో రాజాశ్రయాన్ని నిరసించిన కవి?

1) ధూర్జటి  2) యథావాక్కుల అన్నమయ్య 

3) మారద వెంకయ్య 

4) కాకుత్థ్సం శేషప్ప కవి

18. ‘‘పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్భోధించు మిత్రుండు’’ అన్న కవి ఎవరు?

1) గడిగె భీమకవి  2) నంబి శ్రీధరరావు 

3) ఎలకూచి బాలసరస్వతి    4) ధూర్జటి

19. ‘నారాయణా!’ అన్న మకుటంతో పద్యాలు రాసిన కవి?

1) బమ్మెర పోతన 

2) యథావాక్కుల అన్నమయ్య 

3) కంచర్ల గోపన్న 4) కాకుత్థ్సం శేషప్ప కవి

20. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన తొలి కవి?

1) ఏనుగు లక్ష్మణ కవి 

2) ఎలకూచి బాలసరస్వతి 

3) సురభి మల్లుడు  4) పుష్పగిరి తిమ్మన

21. ధూర్జటి ఏ శతాబ్దానికి చెందిన వారు?

1) 12వ  2) 13వ  3) 14వ  4) 16వ

22. ‘అశు కవితా కేసరి’ అనే బిరుదు ఎవరిది?

1) గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ 

2) నంబి శ్రీధరరావు  3) గడిగె భీమ కవి 

4) యథావాక్కుల అన్నమయ్య

23. కిందివాటిలో సీస పద్యాల్లో రాసిన శతకాన్ని గుర్తించండి.

1) ఉత్పలమాల శతకం 

2) చంద్రమౌళీశ్వర శతకం 

3) విశ్వకర్మ శతకం  4) చిత్త శతకం

24. కిందివారిలో శతక కవిత్రయంలో లేని కవి?

1) యథావాక్కుల అన్నమయ్య 

2) పాల్కురికి సోమన 

3) మల్లికార్జున పండితుడు  4) ధూర్జటి

25. ‘కవిరాజ’ బిరుదు పొందిన శతక కవి?

1) యథావాక్కుల అన్నమయ్య 

2) నంబి శ్రీధరరావు 

3) ఎలకూచి బాలసరస్వతి 

4) గువ్వల చెన్నడు

26. ‘‘కూతురు చందాన కోడలిన్‌ చూచిన మండునే ఘోరముల్‌ మందిరమున?’’ అని ప్రశ్నించిన శతకం?

1) నరసింహ శతకం 

2) నింబగిరి నరసింహ శతకం 

3) వేణుగోపాల శతకం  

4) ఆంధ్ర నాయక శతకం

27. ‘‘....అన్నియు పరద్రవ్యంబు నాశించి యాశ్రీ తానెన్ని యుగంబులుండగలదో...’’ అన్న కవి?

1) ధూర్జటి     2) పోతన 

3) అన్నమయ్య   4) కాకుత్థ్సం శేషప్ప కవి

28. ‘వేపాకు పసరెంత సేపు గాచిన గాని తేనెతో సమముగ తియ్యబడునె’’ అన్న కవి?

1) బద్దెన          2) ధూర్జటి 

3) కాకుత్థ్సం శేషప్ప కవి  4) వేమన

29. శ్రీభర్గ శతకాన్ని రచించింది ఎవరు?

1) తాళ్లపాక పెదతిరుమలాచార్యులు 

2) గువ్వల చెన్నడు  3) ఏనుగు లక్ష్మణ కవి 

4) కూచిమంచి తిమ్మకవి

30. తెలుగులో మొదటి త్య్రర్థి కావ్యం ఏది?

1) యాదవ పాండవీయం 

2) రాఘవ యాదవ పాండవీయం 

3) రాఘవ పాండవీయం 

4) పాండవ వనవాసం

31. జటప్రోలు సురభిమాధవరాయల ఆస్థానంలో ఉన్న కవి?

1) కూచిమంచి తిమ్మకవి 

2) ఏనుగు లక్ష్మణ కవి 

3) ఎలకూచి బాలసర్వతి 

4) పక్కి అప్పలనరసయ్య

32. ‘‘శ్రీ లొంక రామేశ్వరా’’ అనే మకుటంతో పద్యాలు రాసిన శతక కవి?

1) నీలకంఠ దీక్షితులు 

2) కొండూరు వీరరాఘవాచార్యులు 

3) వడ్డాది సుబ్బరాయకవి 

4) నంబి శ్రీధరరావు

33. ‘‘చెవులకు శాస్త్ర పాండిత్యమే అందం, చేతులకు దానమే అందం, శరీరానికి పరోపకారమే ఆభరణం’’ అన్న కవి?

1) ఎలకూచి బాలసరస్వతి 

2) బమ్మెర పోతన 

3) మారద వెంకయ్య 

4) యథావాక్కుల అన్నమయ్య 

34. శతక ప్రక్రియ సంస్కృతం నుంచి తెలుగులోకి దిగుమతి అయ్యిందని అభిప్రాయపడింది ఎవరు?

1) జి.నాగయ్య  2) కె.గోపాల కృష్ణారావు 

3) కె.వి.ఆర్‌. నరసింహం 

4) పింగళి లక్ష్మీకాంతం

35. తెలుగునాట ఏ శతాబ్దంలో శతక ప్రక్రియ ఆవిర్భవించింది?

1) 10వ  2) 11వ  3) 12వ   4) 13వ 

36. తెలుగులో దృష్టాంతాలంకారాలతో మిక్కిలి ప్రసిద్ధి గాంచిన శతకం?

1) భాస్కర శతకం  2) సుమతీ శతకం 

3) వేమన శతకం 

4) శ్రీకాళహస్తీశ్వర శతకం

37. శతక పద్యాల్లో ప్రత్యేక భావం లేకపోవడం ఏ లక్షణం?

1) సంఖ్యానియమ లక్షణం 

2) ముక్తక లక్షణం     3) మకుట లక్షణం 

4) ఆత్మాశ్రయ లక్షణం

38. ‘తెలుగు పూలు’ శతకం ఎవరిది?

1) ఏనుగు లక్ష్మణ కవి 

2) నార్ల వేంకటేశ్వర రావు 

3) నార్ల చిరంజీవి      4) వసురాయకవి

39. కవిత్రయంలో శతకం రాసిన కవి ఎవరు?

1) నన్నయ     2) తిక్కన 

3) ఎర్రన     4) సోమన

40. వ్యాజస్తుతి రూపంలో వెలసిన శతకం?

1) నరసింహ శతకం 

2) ఆంధ్ర నాయక శతకం 

3) వేణుగోపాల శతకం  4) శ్రీభర్గ శతకం

41. వృషాధిప శతకంలోని పద్యాలు ఏవి?

1) చంపకమాల, శార్దూలాలు 

2) ఉత్పలమాల, మత్తేభాలు 

3) శార్దూల, మత్తేభాలు 

4) చంపకోత్పలమాలలు

42. విసనకర్ర శతకాన్ని రాసింది ఎవరు?

1) హరిహర బ్రహ్మేశ్వర కవులు

2) గణపవరపు వేంకట కవి

3) పిసుపాటి చిదంబరశాస్త్రి

4) గోగులపాటి కూర్మనాథ కవి

43. ‘‘శతకము దేశికవితా శాఖకు పూచిన పూవు కాదు’’ అని పేర్కొంది ఎవరు?

1) వంగూరి సుబ్బారావు 

2) నిడదవోలు వెంకటరావు 

3) కె.గోపాలకృష్ణారావు 

4) రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ

44. కిందివాటిలో ఏ శతకాన్ని కన్నడ భాషలోకి అనువదించారు?

1) సుమతీ శతకం     2) భాస్కర శతకం 

3) నారసింహ శతకం 

4) ఆంధ్రనాయక శతకం

45. ‘శతేన శతకం ప్రోక్తమ్‌’ అని శతకాన్ని నిర్వచించినది ఎవరు?

1) పిసుపాటి చిదంబరశాస్త్రి 

2) అమృతానందయోగి 

3) అప్పయ్య దీక్షితులు 

4) ఆనందామాత్యుడు

46. తెలుగు శతకాలకు బీజ ప్రాయమైన పద్యాలు రాసిన కవి?

1) నన్నయ     2) తిక్కన 

3) ఎర్రన     4) శ్రీనాథుడు

సమాధానాలు

1 - 2   2 - 3   3 - 4   4 - 3   5 - 2   6 - 3   7 - 1   8 - 4   9 - 1  10 - 3  11 - 1  12 - 2   13 - 4  14 - 4  15 - 2  16 - 3  17 - 1  18 - 2  19 - 1  20 - 2   21 - 4  22 - 1   23 - 3  24 - 4  25 - 2  26 - 2  27 - 1  28 - 3  29 - 4  30 - 2 31 - 3  32 - 4   33 - 1  34 - 2  35 - 3  36 - 1  37 - 2  38 - 3  39 - 2  40 - 2   41 - 4  42 - 1   43 - 3  44 - 1  45 - 2  46 - 1  

శతక లక్షణాలు

* సంఖ్యా నియమం ఉంటుంది.

* మకుట నియమం ఉంటుంది.

* ఆత్మాశ్రేయ నియమం ఉంటుంది.

* ముక్తక నియమం ఉంటుంది.

కందపద్య శతకాలు

* సుమతీ శతకం

* కుమార శతకం

* కుమారీ శతకం

* గాంధీ తాత శతకం

* ప్రభు తనయ శతకం

సీసపద్య శతకాలు

* నరసింహ శతకం

* వేణుగోపాల శతకం

* నింబగిరి నరసింహ శతకం

* విశ్వకర్మ శతకం

* ఆంధ్రనాయక శతకం

ఆటవెలది శతకాలు

* వేమన శతకం

* భవ్యచరిత శతకం

* బాలనృసింహ శతకం

* నగ్నసత్యాల శతకం

* శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం 

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌