• facebook
  • whatsapp
  • telegram

రసాయన సమీకరణాలు - రసాయన చర్యలు 

1. ఆమ్ల ద్రావణాల్లో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు-

జ: ఎరుపు

2. క్షారద్రావణాల్లో ఫినాఫ్తలీన్ సూచిక రంగు-

జ: గులాబి

3. క్షారస్థితిలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు-

జ: ఆకుపచ్చ

4. ఒక ద్రావణం ఎరుపు లిట్మస్‌ను నీలిరంగులోకి మార్చింది దాని pH విలువ-

జ: 10

5. ఒక ద్రావణం పగిలిన కోడిగుడ్డు పొట్టుతో చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు సున్నపు తేటను పాలలా మార్చింది. ఆ ద్రావణం దేన్ని కలిగి ఉంటుంది?

జ: HCl

6. నీటిలో కరిగే క్షారాలను ఏమని పిలుస్తారు?

జ: క్షారయుత

7. హైడ్రోక్లోరిక్ ఆమ్లం సార్వత్రిక pH సూచికతో ఏర్పడే రంగు (pH = 1)

జ: ఎరుపు

8. కిందివాటిలో ఏ మందును అజీర్ణానికి ఉపయోగిస్తారు?

    ఎ) యాంటీబయోటిక్     బి) ఎనాల్జిటిక్      సి) యాంటాసిడ్     డి) యాంటీసెప్టిక్

జ: సి (యాంటాసిడ్)

9. మెగ్నీషియం లోహం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మధ్య చర్య వల్ల ఏర్పడే వాయువు -

జ: హైడ్రోజన్

10. జీర్ణాశయంలో ఏర్పడే ఆమ్లం

జ: HCl

11. చాలా లవణాలు వాతావరణం నుంచి నీటిని శోషిస్తాయి. ఈ పద్ధతిని ఏమంటారు?

జ: హైడ్రేషన్

12. కిందివాటిలో విరంజనకారిగా దేన్ని ఉపయోగిస్తారు?

    ఎ) CaOCl2     బి) Na2S2O3    సి) Na2SO4     డి) CuSO4

జ: ఎ (CaOCl2)

13. H2O + .....   H3O+

జ: H+

14. తటస్థీకరణంలో నీటితోపాటు ..... ఏర్పడుతుంది.

జ: లవణం

15. చింతపండులో ఉండే ఆమ్లం -

జ: టార్టారిక్ ఆమ్లం

16. సిరా మరకలను తొలగించడానికి కిందివాటిలో దేన్ని వాడతారు?

    ఎ) ఆగ్జాలిక్ ఆమ్లం     బి) కార్బొనిక్ ఆమ్లం    సి) సిట్రిక్ ఆమ్లం     డి) ఎసిటిక్ ఆమ్లం

జ: ఎ (ఆగ్జాలిక్ ఆమ్లం)

17. బేకింగ్ సోడా ఫార్ములా -

జ: NaHCO3

18. వాతావరణంలోని ఆమ్ల వర్షానికి ప్రత్యక్షంగా కారణమయ్యే వాయువు -

జ: SO3

19. పాలు పుల్లవైనప్పుడు ఉత్పత్తి అయ్యే ఆమ్లం ఏది?

జ: లాక్టిక్ ఆమ్లం

20. ఆమ్లాలు రుచికి .....గా ఉంటాయి.

జ: పుల్లగా

21. వెనిగర్ అంటే .....

జ: CH3COOH

22. pH విలువ 5.5 కంటే తక్కువైనప్పుడు ..... వస్తుంది.

జ: దంత క్షయం

23. తేలు కుట్టినప్పుడు బాధను తగ్గించడానికి ....... వాడతారు.

జ: దుష్టిపాకు

24. కిందివాటిలో సహజ సూచిక కానిది -

    ఎ) మందారపూలు     బి) బీట్‌రూట్    సి) మామిడి ఆకులు     డి) లిట్మస్

జ: డి (లిట్మస్)

25. టూత్‌పేస్ట్ ..... లక్షణాన్ని కలిగి ఉంటుంది.

జ: క్షార

Posted Date : 09-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌