• facebook
  • whatsapp
  • telegram

వ్యుత్పత్యర్థాలు

* కమలాకరం - కమలాలకు ఆకరమైంది - కొలను

* తటాకం - జలంతో (కొట్టబడింది) నిండింది - చెరువు

* పద్మాకరం - పద్మాలకు నెలవైంది - కొలను

* వసుధ - వసువును (బంగారం) ధరించేది - భూమి

* రమానాథుడు - రమకు (లక్ష్మికి) భర్త అయినవాడు - విష్ణువు

* పయోనిధి - నీటికి/ పయస్సుకు నిధి వంటిది - సముద్రం

* అంధకారం - చూపును పనిచేయకుండా చేసేది - చీకటి

* కామారి - మన్మథుడి శత్రువు - శివుడు

* కైమోడ్పు - చేతులు జోడించి చేసేది - నమస్కారం

* పక్షి - పక్షాలు కలది - పక్షి

* పుత్రుడు - పున్నామ నరకం నుంచి రక్షించేవాడు - కొడుకు

* పౌరులు - పురంలో నివసించేవారు - ప్రజలు

* వేత్త - బాగా తెలిసినవాడు - జ్ఞాని

* సంయమి - యమ నియమాదులను పాటించేవాడు - రుషి

* సైరికుడు - సీరముతో (నాగలి) నేలను దున్నేవాడు - రైతు

* సోమార్థధరుడు - చంద్రవంకను శిరస్సుపై ధరించినవాడు - శివుడు

* హాలికుడు - హలంతో (నాగలి) నేలను దున్నేవాడు - రైతు

* అధ్యక్షుడు - చర్యలను కనిపెట్టి చూసేవాడు

* గురువు - అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు - ఉపాధ్యాయుడు

* జలధి - జలమును ధరించేది - సముద్రం

* త్రివిక్రముడు - మూడడుగులతో ముల్లోకాలను కొలిచినవాడు - విష్ణువు

* నీరజభవుడు - విష్ణువు నాభికమలం నుంచి పుట్టినవాడు - బ్రహ్మ

* పారాశర్యుడు - పరాశర మహర్షి కుమారుడు - వ్యాసుడు

* భాగీరథి - భగీరథుడు తీసుకువచ్చింది - గంగ

* విశ్వంభరుడు - విశ్వమును భరించేవాడు - విష్ణువు

* విష్ణువు - విశ్వమంతటా వ్యాపించి ఉండే వాడు

* వేదవ్యాసుడు - వేదాలను విభజించినవాడు - పరాశర పుత్రుడు

* భాష - భాషించేది

* అచ్యుతుడు - నాశము లేనివాడు - విష్ణువు

* అదృష్టం - చూడబడనిది - భాగ్యం 

* అసూయ - గుణములయందు దోషారోపణం చేయడం

* అక్షతలు - క్షతం లేనివి, నాశనం లేనివి

* అక్షరం - నాశనం పొందనిది

* ఇతిహాసం - పూర్వరాజుల చరిత్ర కలది

* కాకోదరం - వంకరలు తిరిగే పొట్ట గలది - పాము

* ఖలుడు - ధర్మం తప్పినవాడు - దుష్టుడు

* జ్వాల - జ్వలించేది, మండేది - అగ్నిశిఖ

* తనూజుడు - తన శరీరం నుంచి పుట్టినవాడు - కొడుకు

* ద్రవ్యం - పొందదగినది - ధనం

* ధర్మతనూజుడు - యమధర్మరాజు వరం వల్ల జన్మించినవాడు  - ధర్మరాజు

* ధ్వాంక్షము - మాంసాన్ని కాంక్షించేది - కాకి

* ధేనువు - దూడకు పాలుకుడిపేది - ఆవు

* నృపాలుడు - నరులను పాలించేవాడు - రాజు

* పంచాస్యము - విస్తీర్ణమైన ముఖం కలది - సింహం

* పాషండుడు - సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రాన్ని వాడుకునేవాడు 

* బలిపుష్టము - బలిగా ఇచ్చిన ఆహారంతో పోషించుకునేది - కాకి

* భాస్కరుడు - ప్రకాశమును కలిగించేవాడు - సూర్యుడు 

* మానవులు - మనువు సంతతికి చెందినవారు

* మున్నీరు - సృష్టి యాది నుంచి ఉన్న నీరు - సముద్రం

* రూపాయి - రౌప్యం నుంచి వచ్చిన నాణెం

* వసుమతి - బంగారాన్ని గర్భంలో కలిగి ఉన్నది - భూమి

* విసపు మేతరి - హాలాహలాన్ని మింగినవాడు - శివుడు

* సింహాసనం - సింహాకృతి కలిగిన రాజపీఠం

* సహోదరులు - తోడబుట్టినవారు - అన్నదమ్ములు

* సాగరం - సగరులు తవ్వినది - సముద్రం

* హృదయం - హరింపబడేది


అభ్యాస ప్రశ్నలు

1.  ‘దీని చేత జ్ఞాన యుక్తులగుదురు’ అనే వ్యుత్పత్తి గల పదం? 

1) పుస్తకం        2) భాష      3) గ్రంథాలయం        4) మనసు 


2. ‘హాలాహలాన్ని మింగినవాడు’ అనే వ్యుత్పత్తి గల పదం?

1) నీలకంఠుడు      2) విసపు మేకరి        3) గరళకంఠుడు      4) పన్నగ శయనుడు


3. ‘విష్ణువు’ అనే పదానికి వ్యుత్పత్తి ఏది?

1) విశ్వమంతటా వ్యాపించి ఉండేవాడు      2) లక్ష్మిని ఆశ్రయించినవాడు

3) మూడడుగులతో ముల్లోకాలను ఆక్రమించినవాడు 

4) విశ్వమును భరించేవాడు


4. ‘చర్యలను కనిపెట్టి చూసేవాడు’ అనే వ్యుత్పత్తి గల పదం? 

1) విశ్వకర్ముడు     2) కర్మసాక్షి    3) అధ్యక్షుడు     4) వ్యగ్రుడు


5. ‘అన్ని ప్రాణులయందు సమభావన కలవాడు’ అనే వ్యుత్పత్తి గల పదం

1) సూర్యుడు      2) మిత్రుడు     3) చంద్రుడు     4) సూర్యచంద్రులు


6. యమనియమాదులను పాటించేవాడు?

1) సంయమి     2) మౌని     3) రుషి     4) సన్యాసి


7. ‘రూపాయి’కి వ్యుత్పత్తి ఏమిటి?

1) ఒక రూపాన్ని పొందింది     2) కాసుల నుంచి వచ్చింది

3) రూకలతో సంబంధం ఉన్నది    4) రౌప్యం నుంచి వచ్చింది


8. ‘నీరజ భవుడు’కి వ్యుత్పత్యర్థం ఏది?

1) విష్ణువు నాభి కమలం నుంచి పుట్టిన వాడు 

2) నీటి నుంచి పుట్టినవాడు

3) పద్మము నాభి యందు కలవాడు

4) నీరము అంటే నీరు పుట్టుకగా గలవాడు


9. ‘పొందదగింది’ అనే వ్యుత్పత్యర్థం గల పదం     

1) కార్యశీలుడు      2) పొదుపరి     3) ద్రవ్యం      4) కార్యావర్తనం


10. ‘జలంతో (కొట్టబడింది) నిండింది’ అనే వ్యుత్పత్తి గల పదం

1) తటాకం      2) చెరువు       3) జలనిధి      4) జలచరం


11. సింహాకృతి గల రాజపీఠం అంటే...

1) ఆసనం      2) సింహాసనం       3) కుర్చీ      4) ఉన్నతాసనం


12. ‘బలిగా ఇచ్చిన ఆహారంతో పోషించుకునేది’ అనే వ్యుత్పత్తి అర్థం గల పదం

1) వాయసం     2) కాకి      3) బలిపుష్టం      4) బలియుతుడు


13. ‘నాశనం లేనివాడు’ ఎవరు?

1) విష్ణువు      2) అచ్యుతుడు     3) శ్రీకృష్ణుడు      4) జలధి శయనుడు


14. ‘పూర్వరాజుల చరిత్రం గలది’ ఏది?

1) శతకం      2) ప్రబంధం       3) పురాణం      4) ఇతిహాసం


15. ‘చూపును పనిచేయకుండా చేసేది’ ఏది?

1) తామసం      2) చీకటి      3) అంధకారం      4) తామసి


16. ‘ధర్మం నుంచి తప్పినవాడు’ ఎవరు?

1) ఖలుడు      2) శఠుడు        3) కుమతి      4) విషయలోలుడు


17. ‘బ్రహ్మ’కు వ్యుత్పత్తి అర్థం ఏది?

1) ప్రజలను వర్థిల్లజేసేవాడు       2) నాలుగు ముఖములు ఉన్నవాడు

3) సరస్వతి దేవి భార్యగా గలవాడు      4) నిరంతరం వేదాలను పఠించేవాడు


18. ‘మన్మథుడి శత్రువు’ అనే వ్యుత్పత్తి గల పదం

1) పరమేశ్వరుడు        2) శివుడు        3) కామారి         4) విషధరుడు


19. ‘సీరముతో నేలను దున్నేవాడు’ అనే వ్యుత్పత్తి గల పదం

1) సీర మేపరి         2) సిరధరుడు       3) సైరా         4) సైరికుడు


20. ‘వేత్త’ అనే పదానికి వ్యుత్పత్తి

1) బాగా తెలిసినవాడు      2) వేదం చదివినవాడు     3) వేగం గలవాడు   4) శీఘ్రగామి


21. ‘సత్పురుషుల యందు స్థిరంగా ఉండేది’ అనే వ్యుత్పత్తి గల పదం?

1) నిజం     2) సత్యం     3) వాస్తవం     4) యథార్థం


22. ‘విస్తీర్ణమైన ముఖం గలది’ అనే వ్యుత్పత్త్యర్థం గల పదం? 

1) గజవదనుడు        2) నగు మోమరి      3) పంచాస్యం        4) గజాననుడు


23. ‘వంకరలు తిరిగే పొట్ట గలది’ అనే వ్యుత్పత్తి గల పదం?

1) కాకోదరం        2) వృకోదరుడు      3) శాతోదరి         4) జలోదరం


24. మూడు లోకాలనూ, మూడడుగులుగా కొలిచే రూపాన్ని ధరించినవాడు - అనే వ్యుత్పత్తి గల పదం?

1) త్రిపురాంతకుడు      2) త్రయంబకుడు      3) త్రివిక్రముడు     4) త్రియామాచరుడు


25. ‘ప్రజలను రంజింపజేసేవాడు’ అనే వ్యుత్పత్తి గల పదం?

1) ధరాధినాథుడు      2) క్ష్మాపాలుడు       3) ప్రభువు         4) రాజు


26. ‘మాంసాన్ని కాంక్షించేది’ అనే వ్యుత్పత్తి గల పదం? 

1) పలాశి        2) ధ్వాంక్షము       3) వాయసం        4) ఏకాక్షి


27. ‘సృష్టి యాది నుంచి ఉన్న నీరు’ అనే వ్యుత్పత్తి గల పదం?

1) మున్నీరు        2) నీరాకరం      3) అర్ణవం        4) సాగరం


28. ‘బంగారాన్ని గర్భంలో కలిగింది’ అనే వ్యుత్పత్యర్థం గల పదం?

1) అచల        2) భూమి       3) వసుమతి        4) కుంభిని


29. ‘చేతులు జోడించి చేసేది’ అనే వ్యుత్పత్తి గల పదం?

1) కైమోడ్పు         2) నమస్కారం      3) వందనం         4) జోతలు


30. ‘మరణం పొందింపనిది’ అనే వ్యుత్పత్తి గల పదం?

1) ఒప్పరము         2) అవకీలం      3) అరవిందిని         4) అమృతం


31. ‘సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రాన్ని వాడుకునేవాడు’ ఎవరు?

1) పాషండుడు       2) పారిపంథుడు     3) పారలౌకికుడు       4) పాఱుబోతు


32. ‘అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు’ ఎవరు?

1) ఆచార్యుడు        2) ఉపాధ్యాయుడు     3) గురువు        4) ఒజ్జ


సమాధానాలు

1- 4;   2- 2;   3- 1;   4- 3;   5- 2;   6- 1;   7- 4;   8- 1;   9- 3;  10- 1;  11- 2;  12- 3;   13- 2;  14- 4;  15- 3;  16- 1;  17- 1;  18- 3;  19- 4;  20- 1;  21- 2;  22- 3;   23- 1;  24- 3;  25- 4;  26- 2;  27- 1;  28- 3;  29- 1;  30- 4;  31- 1;  32- 3

Posted Date : 05-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌