• facebook
  • whatsapp
  • telegram

రేఖాగణితం

1. కిందివాటిలో నిర్దిష్టమైన పొడవును కలిగి ఉండేది

1) రేఖాఖండం          2) కిరణం            3) సరళరేఖ         4) బిందువు

సమాధానం: 1 (రేఖాఖండం)
 

2. కిందివాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి.

i) ఒక సరళరేఖకు తుది బిందువులు ఉండవు.

(ii) రేఖలో కిరణం ఒక భాగం.

(iii) రేఖాఖండం నిర్దిష్టమైన పొడవును కలిగి ఉండదు.

(iv) ఒక బిందువు నుంచి ఎన్ని రేఖలైనా గీయవచ్చు.

1) i, ii, iii            2) i, ii, iv           3) iii, iv            4) పైవన్నీ

సమాధానం: 2 (i, ii, iv)

3. వృత్తం మొత్తం పొడవును ఏమంటారు?

సమాధానం: వృత్త పరిధి
 

4. వృత్త వ్యాసం వ్యాసార్ధానికి ఎన్ని రెట్లు ఉంటుంది?

సమాధానం: 2

5. సరళ కోణం విలువ .............

సమాధానం: 180º
 

6. కిందివాటిలో ఏది సత్యం?

(i) లంబకోణం కంటే తక్కువైన కోణం అల్పకోణం

(ii) 180º కోణం లంబకోణం

(iii) 180º కంటే పెద్దదైన కోణం పరావర్తన కోణం

(iv) సంపూర్ణ కోణం అంటే 360º

1) i, ii, iii           2) ii, iii, iv          3) i, iii, iv          4) పైవన్నీ

సమాధానం: 3 (i, iii iv)
 

7.   

పటంలో l, m లు సమాంతర రేఖలు; n తిర్యగ్రేఖ అయితే సదృశ కోణాలు (అనురూప కోణాలు) ఏవి?

సమాధానం: 

8. రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండిస్తే, తిర్యగ్రేఖకు ఒకేవైపు ఉండే అంతర కోణాల మొత్తం
సమాధానం: 180º

 

9.  

 

పటంలో l, m లు సమాంతర రేఖలు; n తిర్యగ్రేఖ.  = 60º అయితే   = ?

సమాధానం: 60º

 

10. మూడు భుజాల పొడవులు సమానంగా ఉండే త్రిభుజాన్ని ఏమంటారు?
సమాధానం: సమబాహు త్రిభుజం

 

11. ఒక కోణం అధిక కోణంగా ఉండే త్రిభుజాన్ని ఏమంటారు?
సమాధానం: అధిక కోణ త్రిభుజం

 

12. త్రిభుజంలో ఒక శీర్షం నుంచి దాని ఎదుటి భుజం మధ్య బిందువుకు గీసిన రేఖాఖండాన్ని ఏమంటారు?
సమాధానం: మధ్యగత రేఖ

 

13.  లో  

 = 3,   = 2 అయితే   విలువలు వరుసగా
సమధానం: 30º, 60º

14. లో C వద్ద లంబకోణం ఉంది. CD   AB,  

 = 45º అయితే   = ...........
సమాధానం: 45º

15. ఒక త్రిభుజంలోని మూడు కోణాలు 3 : 5 : 10 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ త్రిభుజంలోని కోణాలు వరుసగా .............
సమాధానం: 30º, 50º, 100º

 

16. ఒక త్రిభుజంలోని మూడు కోణాలు 1 : 3 : 8 నిష్పత్తిలో ఉన్నాయి. అతి చిన్న, అతి పెద్ద కోణాల మొత్తం
సమాధానం: 135º

 

17. ఒక లంబకోణ త్రిభుజంలో రెండు అల్ప కోణాలు 1 : 4 నిష్పత్తిలో ఉంటే, ఆ రెండు కోణాలు
సమాధానం: 18º, 72º

 

18. ఒక త్రిభుజంలో రెండు కోణాలు 126º, 30º అయితే మూడో కోణం విలువ
సమాధానం: 24º

 

19. కిందివాటిలో ఏది సత్యం?
1) ఒక త్రిభుజంలోని బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి రెట్టింపు ఉంటుంది.
2) ఒక త్రిభుజంలోని బాహ్యకోణం విలువ సంపూరక కోణానికి సమానం.
3) ఒక త్రిభుజంలోని బాహ్యకోణం విలువ దాని అంతరాభిముఖ కోణాల మొత్తంలో సగం ఉంటుంది.
4) ఒక త్రిభుజంలోని బాహ్యకోణం విలువ దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం.
సమాధానం: 4 (ఒక త్రిభుజంలోని బాహ్యకోణం విలువ దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం.)

20. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాల మొత్తం
సమాధానం: 360º

 

21.    అయితే  

 = ..............

సమాధానం: 111º

22. ఒక త్రిభుజం యొక్క ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం విలువ 108º. దాని అంతరాభిముఖ కోణాలు 4 : 5 నిష్పత్తిలో ఉంటే, ఆ కోణాలు
సమాధానం: 48º, 60º

 

23.   పక్క పటంలో   +   +   +   +   = ?

సమాధానం: 180º

24.  

 పక్క పటంలో ,  విలువలు వరుసగా

సమాధానం: 50º, 50º

25. కిందివాటిలో ఏది సత్యం?
1) త్రిభుజంలో ఏ రెండు భుజాల పొడవుల మొత్తమైనా మూడో భుజం కంటే తక్కువ.
2) త్రిభుజంలో ఏ రెండు భుజాల పొడవుల మొత్తమైనా మూడో భుజానికి సమానం.
3) త్రిభుజంలో ఏ రెండు భుజాల పొడవుల మొత్తమైనా మూడో భుజానికి రెట్టింపు ఉంటుంది.
4) త్రిభుజంలో ఏ రెండు భుజాల పొడవుల మొత్తమైనా మూడో భుజం కంటే ఎక్కువ.
సమాధానం: 4 (త్రిభుజంలో ఏ రెండు భుజాల పొడవుల మొత్తమైనా మూడో భుజం కంటే ఎక్కువ.)

Posted Date : 29-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌