• facebook
  • whatsapp
  • telegram

ప్ర‌పంచీక‌ర‌ణ‌

20వ శతాబ్దం చివర్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన పరిణామాల్లో ప్రపంచీకరణ ఒకటి.

* రాజకీయ, సాంస్కృతిక - ఆర్థిక కోణాలు ప్రపంచీకరణకు ముఖ్య కారణాలు.

* అంతర్జాతీయ ఆర్థిక మార్పిడుల్లో మూడు ముఖ్యమైన ప్రవాహాలు ఉన్నాయి. అవి:

1. వస్తు-సేవల ప్రవాహం

2. శ్రమ ప్రవాహం (ఉపాధి కోసం ప్రజలు వలస వెళ్లడం) 

3. పెట్టుబడుల ప్రవాహం (స్వల్పకాల, దీర్ఘకాల ప్రయోజనాల కోసం దూర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడం.)

* ప్రపంచీకరణను మూడు అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి: 1. శాస్త్ర సాంకేతిక ప్రభావం (S&T)

2. ప్రపంచ పరిపాలన సంస్థలు

3. విదేశీ వాణిజ్యం, పెట్టుబడి విధానాల సరళీకరణ.

* ప్రపంచీకరణ అనే పదాన్ని తొలిసారిగా 1961లో పీటర్‌ డ్రక్కర్‌ అనే ఆర్థికవేత్త ఉపయోగించారు.

నిర్వచనాలు

* ఒక దేశ ఆర్థిక వ్యవస్థను మరొక దేశ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడాన్ని ప్రపంచీకరణ అంటారు (లేదా) ప్రపంచానికి దేశ ఆర్థిక వ్యవస్థకు మధ్య తలుపులు తెరవడం (లేదా) ప్రపంచంలోని దేశాలు తమ సరిహద్దులు దాటి వస్తుసేవల అంతర్జాతీయ మూలధన ప్రభావం, అంతర్జాతీయ వ్యాపార పరిమాణాన్ని పెంపొందించుకోవడం అని అర్థం.

* వివిధ దేశాల మధ్య ఏవిధమైన హద్దులు లేని స్వేచ్ఛాయుత వ్యాపారాన్ని ప్రపంచీకరణ అంటారు. 

ఉదా: భారత్‌ - కజకిస్థాన్, భారత్‌ - రష్యా, భారత్‌ - అమెరికా

ప్రపంచీకరణతో దేశాల మధ్య తొలగే ప్రధాన అడ్డంకులు:

* వస్తుసేవల ప్రభావం. ఉదా: చైనాలో తయారైన వివిధ రకాల వస్తువులను మనం ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం.

* మూలధన ప్రవాహాలు (లేదా) పెట్టుబడులు.

ఉదా: జపాన్‌కు చెందిన జైకా సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టడం. అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్‌ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం.

* శాస్త్ర సాంకేతిక సంస్థల స్వేచ్ఛా ప్రభావం.

* శ్రామికుల అంతర్జాతీయ ప్రవాహం.

ఉదా: ఏపీ, తెలంగాణ, కేరళ నుంచి కార్మికులు ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లడం.

* వివిధ దేశాల మధ్య నిర్బంధం లేని మూలధన వస్తువుల ప్రవాహం.

* వివిధ దేశాల మధ్య బంగారం వ్యాపారం స్వేచ్ఛగా జరగడం.

లాభాలు:

* విదేశీ పెట్టుబడులు (FDI) పెరుగుతాయి.

* కొత్త ఉపాధి అవకాశాలు అధికం అవుతాయి.

* వస్తువుల లభ్యత పెరుగుతుంది.

* తక్కువ ధరలకు వివిధ రకాల వస్తువులు లభిస్తాయి.

* స్వదేశీ బ్యాంకింగ్‌ సామర్థ్యం, ఫైనాన్స్‌ రంగం పనితీరు మెరుగుపడుతుంది.

* అన్ని రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది.

* ప్రజల ఆయుఃప్రమాణం పెరుగుతుంది.

* భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.

ప్రతికూలతలు:

* అనేక స్వదేశీ సంస్థలు మూతపడతాయి.

* నిరుద్యోగిత పెరుగుతుంది.

* జాతీయ భావన తగ్గుతుంది.

* మూలధన సాంకేతిక పద్ధతులు పెరుగుతాయి.

* సహజవనరుల దోపిడీ అధికమవుతుంది.

* రాజకీయ శక్తి పునర్విభజనకు దారితీస్తుంది.

* దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు అన్ని రంగాలపై విదేశీ అధిపత్యం పెరుగుతుంది. 

* ప్రపంచీకరణ వల్ల దేశాల మధ్య అంతరాలు మరింత పెరగొచ్చు.

ఉదా: భారత్‌-పాకిస్థాన్, భారత్‌-చైనా,

    రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఉత్తర కొరియా.

ముఖ్యాంశాలు

* అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలకు ప్రపంచీకరణ చాలా ఉపయోగకరం. ఉదా: అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్‌

* సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ది చెందడమే ప్రపంచీకరణకు ముఖ్య కారణం.

* భారత్‌లో ఇది చిన్న ఉత్పత్తిదారులపై వ్యతిరేక ప్రభావం చూపగా, పట్టణ వినియోగదారులు దీనివల్ల ఎక్కువగా ప్రయోజనం పొందారు.

* ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల మధ్య వర్తక, వాణిజ్య విషయాల్లో అవరోధాలు తగ్గించి, ఆర్థిక సంస్కరణలు చేపడుతుంది.

వాణిజ్య అవరోధం: దిగుమతులను తగ్గించడానికి ప్రభుత్వం పన్ను పెంచడాన్ని వాణిజ్య అవరోధం అంటారు. ఉదా: క్రూడ్‌ ఆయిల్, ఎలక్ట్రికల్‌ గూడ్స్‌

ఆర్థిక సరళీకరణ: ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించడాన్ని ఆర్థిక సరళీకరణ అంటారు.

బహుళ జాతీయ సంస్థలు (MNCs)

* ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తి చేయడం లేదా ఉత్పత్తిని నియంత్రించే సంస్థలను బహుళ జాతీయ సంస్థలు అంటారు.

ఉదా: కార్గిల్‌ ఫుడ్‌ కంపెనీ (అమెరికా), ఫారెక్‌ ఫుడ్‌ కంపెనీ (భారత్‌)

బహుళ జాతీయ సంస్థలు పని ప్రదేశాలను ఎంచుకోవడానికి ఉపయోగపడే సూచికలు:

* మార్కెట్స్‌కు దగ్గరగా ఉండటం.

* తక్కువ ఖర్చులో నైపుణ్యం ఉన్న లేదా నైపుణ్యం లేని శ్రామికులు లభించడం.

* తమ ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వ విధానాలు.

* బహుళ జాతి సంస్థలు తెచ్చే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల వల్ల స్థానిక కంపెనీలు ప్రయోజనం పొందుతాయి.

గమనిక: కొన్ని సందర్భాల్లో బహుళజాతి సంస్థలు స్థానిక కంపెనీలను కొనుగోలు చేసి తమ ఉత్పత్తులను పెంచుకుంటాయి.

ఉదా: అమెరికాలోని కార్గిల్‌ఫుడ్‌ కంపెనీ భారత్‌లోని ఫారెక్‌ఫుడ్‌ కంపెనీని కొనడం. దీని ద్వారా భారత్‌లో అతిపెద్ద నూనెల తయారీ కంపెనీగా ‘కార్గిల్‌ ఫుడ్‌’ అవతరించింది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI)

* MNCలు వివిధ రకాలుగా అంటే భూమి, భవనాలు, యంత్రాలు మొదలైన ఇతర పరికరాల కోసం ఖర్చు పెట్టే మొత్తాన్ని FDI అంటారు.

Posted Date : 05-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌