• facebook
  • whatsapp
  • telegram

పెరుగుదల - వికాసం 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. మల్లీశ్వరికి ఎన్ని పద్ధతుల్లో చెప్పినా దగ్గర, దూరం లాంటి స్థాన సంబంధమైన అంశాలను నేర్చుకోలేకపోతుంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి దేనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్రం ఎక్కువగా తోడ్పడుతుంది?

జ: వికాస దశలు

2. ఏ సూత్రం ప్రకారం వికాసం సంపూర్ణం నుంచి విడిభాగాల వైపు, విడి భాగాల నుంచి సంపూర్ణం వైపు సాగుతుంది?

జ: వికాస నిర్దేశక సూత్రం

3. 'సత్యమునే పలుకుము' లేదా 'సత్యమేవ జయతే' అనే సూక్తులు ఏ వికాస అంశానికి చెందినవి?

జ: నైతిక వికాసం

4. కిల్‌పాట్రిక్ ప్రతిపాదించిన ప్రకల్పన పద్ధతిలో విద్యార్థుల వైయక్తిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు బోధించాలి అని చెప్పే నియమం ఏది?

జ: వైయక్తిక భేదాలు

5. ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ ఉన్న అమ్మాయి అని అనిపించుకోవడానికి అంజలి ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది. అయితే అంజలి కోల్‌బర్గ్ నైతిక వికాసంలోని ఏ సంప్రదాయ స్థితికి చెందుతుంది?

జ: సంప్రదాయ స్థితి

6. కవలలు గురించి కింద ఇచ్చిన వివరణల్లో ఏది సరైంది?

ఎ) కవలలు ఫలదీకరణ చెందిన అండం నుంచి జన్మిస్తారు.

బి) వేర్వేరుగా ఫలదీకరణ చెందిన రెండు అండాల నుంచి జన్మిస్తారు.

సి) ఒకే అండం నుంచి జన్మించవచ్చు లేదా వేర్వేరు అండాల నుంచి జన్మించవచ్చు.

డి) పైవన్నీ

జ: డి (పైవన్నీ)

7. శ్రీనివాస్ అనే విద్యార్థికి 'అక్షరాలు' దిద్దడానికి తప్పకుండా కావాల్సింది.

జ: పరిపక్వత

8. రాజు తన తాతపేరు చెప్పగలడు కానీ తన తాతకు గల మనవడి పేరు చెప్పలేడు. పియాజే ప్రకారం అతడు ఏ దశలో ఉన్నాడు?

జ: ఏకమితి భావన - పూర్వ ప్రచాలక దశ

9. కోల్‌బర్గ్ ప్రకారం శిశువు ఏది మంచి, ఏది చెడు అనేది వాటి పరిమాణాలను బట్టి ఆలోచించే దశ

జ: పూర్వ సంప్రదాయ స్థాయి

10. ఒక కిలో దూది బరువా? ఇనుము బరువా అంటే దూది బరువు ఎక్కువ అనే దశ

జ: పూర్వ ప్రచాలక దశ

11. కోల్‌బర్గ్ నైతిక వికాసంలో 3వ సంప్రదాయ స్థితిని, ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మూర్తిమత్వ నిర్మాణంలోని దేంతో పోల్చవచ్చు?

జ: అధ్యహం

12. నవజాత శిశువు సాధారణ ఉత్తేజం నుంచి ఆర్తి, ఆహ్లాదం, ప్రతిస్పందనగా విడిపోవడాన్ని ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు?

జ: వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు సాగుతుంది

13. రెండు చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు తర్వాత వేళ్లతో బొమ్మను పట్టుకోవడం

జ: సాధారణం నుంచి నిర్దిష్టం

14. రెండు సంవత్సరాల వయసు ఉన్న అజయ్ అనే శిశువు ప్రస్తుత ఎత్తును ఆధారంగా చేసుకుని 20 సంవత్సరాల తర్వాత అతడు ఉండబోయే ఎత్తును అంచనా వేయవచ్చు అని తెలిపే వికాస నియమం?

జ: వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు

15. తండ్రి కోప్పడతాడని తనకు ఇష్టం లేకపోయినా ఉదయం పూట లేచి చదువుకోవడం ఏ దశలో ఉన్న విద్యార్థి ప్రవర్తిస్తాడు?

జ: పూర్వ సంప్రదాయ స్థాయి

16. ఉపాధ్యాయుడు మందలించిన అనిల్ అనే విద్యార్థి ఆ బాధను మర్చిపోవడానికి క్రీడలో నిమగ్నమయ్యాడు. ఈ లక్షణాన్ని ఏ పేరుతో పిలుస్తారు?

జ: ఉద్వేగ కెథార్సిస్

17. పండితులకు పామరులు జన్మించడం

జ: ప్రతిగమన నియమం

18. విద్యార్థులకు ఉపాధ్యాయుడు ముందుగా గుణకారం, భాగాహారం నేర్పించిన తర్వాతనే తీసివేత, కూడిక అనే భావనను నేర్పించాడు. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు పాటించని నియమం?

జ: వికాసం క్రమానుగత నియమం
 

19. కిందివాటిలో పరిణతికి సంబంధించి వాస్తవం కానిది?

ఎ) దీనికి శిక్షణ అవసరం లేదు         బి) ఇది ఉంటేనే సంసిద్ధత వస్తుంది

సి) ఇది గుణాత్మకమైంది                 డి) దీన్ని మాపనం చేయవచ్చు

జ: డి (దీన్ని మాపనం చేయవచ్చు)
 

20. 'హుద్ హుద్' తుపాను బాధితులకు సహాయం చేయడం అనేది ఒక పౌరుడిగా తన బాధ్యత అని గుర్తించిన సుమంత్ అనే ఉపాధ్యాయుడు తన సహాయ సహాకారాలను అందిస్తే కోల్‌బర్గ్ నియమం ప్రకారం ఏ దశకు చెందుతాడు?

జ: అధికారం, సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి

21. లాస్య, జైదీప్ అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు. వీరిని ఏ వికాస దశకు చెందినవారుగా చెప్పవచ్చు?

జ: తొలి బాల్యదశ
 

22. మోహిత్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి 'ముఠా'గా ఏర్పడి సాంఘిక కృత్యాల్లో పాల్గొంటుంటే ఈ విద్యార్థి ఏ దశకు చెందిన వాడై ఉంటాడు?

జ: ఉత్తర బాల్యదశ
 

23. ఒక విద్యార్థి 'గుర్తింపు' కోసం నిరంతరం శోధిస్తూ అధిక ఒత్తిడిలో ఉన్నట్లయితే ఈ పరిస్థితిని ఏ దశ లక్షణంగా చెప్పవచ్చు?

జ: కౌమార దశ
 

24. కిందివాటిలో ఒక బాలుడి వికాస దశకు సంబంధించి సరికాని వాక్యమేది?

ఎ) పూర్వ బాల్యదశ - ఆత్మభావన ఏర్పడే దశ  

బి) ఉత్తర బాల్యదశ - సాంఘిక వికాసానికి తొలిమెట్టు

సి) కౌమార దశ - భిన్న లైంగిక ఆసక్తి          

డి) యవ్వనారంభ దశ - అలైంగిక జీవి లైంగికంగా మారడం

జ: బి (ఉత్తర బాల్యదశ - సాంఘిక వికాసానికి తొలిమెట్టు)
 

25. శిశువు తనలోని ఉద్వేగ పరిస్థితులను అనుసరించి తనను తాను ప్రేమించుకునే గుణమైన నార్సిజంను ప్రదర్శించే దశ

జ: శైశవ దశ

26. ప్రతిరోజు గుడికి వెళితే దేవుడు డీఎస్సీలో పాస్ చేస్తాడని 'సోము' అనే విద్యార్థి అంతర్గతంగా ప్రేరేపితమయ్యాడు. కోల్‌బర్గ్ ప్రకారం ఈ విద్యార్థి ఏ స్థాయికి చెందుతాడు?

జ: పూర్వ సంప్రదాయ స్థాయి
 

27. కోల్‌బర్గ్ నైతిక స్థాయిలో ఒక వ్యక్తి బాగా అభివృద్ది చెందితే సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ నిర్మాణ క్రమంలో ఏ గుణాన్ని కలిగి ఉంటాడు?

జ: అధ్యహం
 

28. కిందివాటిలో సరికాని జత ఏది?

ఎ) పియాజే - సర్వాత్మవాదం            బి) కార్ల్ రోజర్స్ - ఆత్మభావన

సి) కోల్‌బర్గ్ - అవిపర్యాత్మక భావన        డి) నోమ్ ఛోమ్‌స్కీ - అనుకరణ

జ: సి (కోల్‌బర్గ్ - అవిపర్యాత్మక భావన)
 

29. భారతదేశానికి రాజధాని న్యూదిల్లీ అని చెప్పిన తర్వాత న్యూదిల్లీ ఏ దేశ రాజధాని అని అడిగితే సమాధానం చెప్పలేని మోహిత్ ఏ దశలో ఉన్న విద్యార్థి?

జ: పూర్వ ప్రచాలక దశ
 

30. పుట్టినప్పుడు తలను నిలపలేని శిశువు 4 నెలల వయసు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతున్నాడు. అయితే ఆ శిశువు 4 నెలల్లో తల నిలపడం అనేది దేన్ని తెలియజేస్తుంది?

జ: పరిపక్వత

31. అశ్విని తన చెల్లెలు స్నేహిత హోమ్‌వర్క్ చేయడంలో సహకరిస్తుంది. అయితే అశ్విని ఏ దశకు చెందిందిగా చెప్పవచ్చు?

జ: ఉత్తర బాల్యదశ
 

32. ప్రేమ్ అనే విద్యార్థి తెలుగులోని భూత, భవిష్యత్, వర్తమాన కాలాల మధ్య వ్యత్యాసాలను గుర్తించగలుగుతున్నాడు. అయితే అతడు ఏ దశకు చెందినవాడిగా గుర్తించవచ్చు?

జ: ఉత్తర బాల్యదశ
 

33. వర్షిత్ అనే విద్యార్థి తరచుగా తనకంటే పెద్దవారితో వాదిస్తుంటాడు. తను అనుకున్నది, చేసింది మాత్రమే సరైందని నిరూపించాలనుకుంటాడు. అయితే అతడు వికాస పరిణామంలో ఏ దశలో ఉన్నట్లు?

జ: కౌమార దశ
 

34. ఒక ఉపాధ్యాయుడు పూర్వ బాల్యదశలో ఉన్న విద్యార్థులకు బోధనోపకరణాలు ఉపయోగిస్తూ బోధిస్తున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడికి వేటి పట్ల అవగాహన ఉన్నట్లుగా చెప్పవచ్చు?

జ: వికాస దశలు
 

35. పాఠ్యప్రణాళికలో పొందుపరిచిన 'హక్కులు - విధులు' అనే పాఠ్యాంశం ద్వారా విద్యావేత్తలు విద్యార్థుల నుంచి ఆశించే వికాసం

జ: సాంఘిక వికాసం

36. ఒకటో తరగతి చదువుతున్న జ్యోత్న్స ఒకే పరిమాణంలో ఉన్న ద్రాక్ష పళ్లలో గుత్తిగా ఉన్న ద్రాక్ష పళ్లకంటే విడివిడిగా ఉన్న ద్రాక్ష పళ్లు ఎక్కువగా ఉన్నాయని చెబితే పియాజే ప్రకారం ఆ అమ్మాయి ఏ దశకు చెందిందిగా చెప్పవచ్చు?
జ: పూర్వ ప్రచాలక దశ

 

37. స్నేహితుడు చూడని సమయంలో తన బ్యాగ్‌లోని కలాన్ని దొంగిలించిన విద్యార్థి కోల్‌బర్గ్ ప్రకారం ఏ దశకు చెందినవాడిగా చెప్పవచ్చు?
జ: పూర్వ సంప్రదాయ

 

38. టండ్రా ప్రాంతాల్లో నివసించే లాపులు, ఎస్కిమోలకు జన్మించే సంతానం కూడా వారి మాదిరి పొట్టిగా ఉండటం ఏ సూత్రానికి సంబంధించినది?
జ: సారూప్య సూత్రం

 

39. వ్యక్తి తన కుటుంబంతోనూ, సమాజంతోనూ సర్దుబాటు చేసుకోగలుగుతున్నాడు. ఈ రకమైన పరిణతిని ఏ వికాసంగా చెప్పవచ్చు?
జ: సాంఘిక వికాసం

 

40. అభ్యాస, చలన కౌశలా వికాసానికి సంబంధించి తప్పుగా పేర్కొన్న వాక్యమేది?
ఎ) ప్రయోగ పరికరాలు అమర్చడం       బి) వయసుతోపాటు ఎత్తు పెరగడం
సి) సైకిల్ తొక్కడం                    డి) ఈత కొట్టడం
జ: బి (వయసుతోపాటు ఎత్తు పెరగడం)

41. ఒక బంకమట్టి ముద్దను సాగదీస్తే మునుపటి స్థితి కంటే సాగదీసిన మట్టిముద్ద పెద్దదని గ్రహించిన శిశువు ఏ భావనను అర్థం చేసుకోలేదు?
జ: కన్జర్వేషన్

 

42. కిందివాటిలో సరైన జత ఏది?
ఎ) శాశ్వత దంతాలు - పూర్వబాల్యం      బి) నార్సిజం - శైశవం
సి) ఉద్వేగ అస్థిరత - కౌమారం           డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

43. కుటుంబంలోని పిల్లవాడు పెద్దతరహాగా ప్రవర్తించలేక, చిన్న పిల్లవాడిలా ఉండలేక సందిగ్ధాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇది ఏ దశ లక్షణం?
జ: కౌమార దశ

 

44. ఒక బాలుడు తాను ఆడుకున్న ఒక ఆట వస్తువును చివరగా దాచిపెట్టి ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించాడు. అయితే పియాజే ప్రకారం ఈ భావనను ఎలా తెలియజేయవచ్చు?
జ: వస్తు స్థిరత్వ భావన

 

45. కిందివాటిలో విభిన్న కవలల గురించి అసత్యం కాని అంశం
ఎ) వేర్వేరు సంయుక్త భేదాలు             బి) వైయక్తిక భేదాలుంటాయి
సి) లైంగిక భేదం ఉండొచ్చు, ఉండకపోవచ్చు     డి) అన్నీ
జ: డి (అన్నీ)

46. ఒక విద్యార్థి సినిమాను చూసి సంతృప్తిని చెంది ఇంటికి వచ్చి తన చేతిని తుపాకీగా భావించి అందరినీ భయపెడుతున్నట్లుగా ఆడుకుంటుంటే పియాజే ప్రకారం అది ఏ రకమైన భావన?
జ: ప్రతిభావాత్మక ఆలోచన

 

47. 'Developmental Psychology' గ్రంథ రచయిత ఎవరు?
జ: ఎలిజబెత్ హర్లాక్

 

48. 5వ తరగతికి చెందిన రాము ఒక ఉపాధ్యాయుడికి అత్యంత ప్రీతి పాత్రుడు. ఈ ఉపాధ్యాయుడు రాములోని ఏ భావనను కొలవగలడు?
జ: పెరుగుదల

 

49. 'Growth of Logical Thinking' గ్రంథం మానవుడిలో మానసిక వికాసం ఎలా అభివృద్ధి చెందుతుంది, దాని క్రమాన్ని గురించి వివరిస్తుంది. ఈ గ్రంథ రచయిత ఎవరు?
జ: జీన్ పియాజే

 

50. నైతిక వికాసాన్ని ప్రభావితం చేసే వికాసాలేవి?
ఎ) సామాజిక, సాంస్కృతిక వికాసం         బి) ఉద్వేగ వికాసం
సి) సంజ్ఞానాత్మక వికాసం              డి) అన్నీ
జ: డి (అన్నీ)

Posted Date : 13-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌