• facebook
  • whatsapp
  • telegram

గణితశాస్త్ర చరిత్ర

1. ఆర్యభట్ట ప్రకారం  π విలువ ఎంత?

జ: 3.1416

2. దశాంశ పద్ధతిని, భారతీయుల అంకెలను కలిగిన మొదటి గ్రంథం?

జ: లీలావతి
 

3. కిందివాటిలో ఆర్యభట్టకు చెందిన విషయం

   i) త్రిభుజ, వృత్త వైశాల్యాలను కనుక్కుని సూత్రాలను తెలిపాడు.

   ii) అంకశ్రేఢిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలియజేశాడు.

   iii) సున్నాకు చెందిన నియమాలు రూపొందించాడు.

   iv) π  = 3.1255 అని తెలియజేశాడు.

జ: iii, iv

4. కిందివాటిలో భాస్కరాచార్యకు చెందిన విషయం

   i) సున్నాకు చెందిన నియమాలు రూపొందించాడు.

   ii) ప్రస్తారాలు - సంయోగాలు వివరించాడు.

   iii) సామాన్య గణనలకు   గా తీసుకోవచ్చని తెలియజేశాడు.

జ: i, ii
 

5. పాస్కల్ త్రిభుజంగా పిలిచే ద్విపద విస్తరణలో గుణకార విస్తరణను వివరించిన శాస్త్రవేత్త?

జ: భాస్కరాచార్య
 

6. భారతీయులు సున్నాను మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు?

జ: క్రీ.శ. 876
 

7. కిందివాటిలో రామానుజన్‌కు సంబంధించింది?

i) వింత చదరాలు

ii) మాక్ - తీటా ఫంక్షన్స్

iii) వితత భిన్నాలు

iv) వర్గమూలాల గూడు

జ: i, ii, iii, iv

8. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం కంప్యూటర్లకు ఎంతో అనువైన కుట్టకం అనే పద్ధతిని కునుక్కున్న శాస్త్రవేత్త?

జ: భాస్కరాచార్య
 

9. పంచసిద్ధాంతిక 1) Paulisa 2) Romaka 3) Vasista 4) Soura 5) Paitamala గ్రంథకర్త

జ: వరాహమిహిరుడు
 

10. కిందివాటిలో రామాజన్‌కు చెందిన అంశం?

i) గోల్డ్ బాక్ కన్‌జక్చర్ వివరణ

ii) 2తో ప్రారంభించి వరుస సంఖ్యల లబ్ధాలను రాశాడు

iii)  విలువకు అనేక సూత్రాలు

iv)  కాలగణిత ప్రాథమిక భావనను తెలియజేశాడు

జ: ii, iii, iv
 

11. 'సంఖ్యలు ఇతడి నేస్తాలు' అనే వాక్యం ఎవరికి చెందింది?

జ: రామానుజన్
 

12. 'మ్యాథమెటిక్స్' అని పద ప్రయోగం చేసిన శాస్త్రవేత్త

జ: పైథాగరస్
 

13. రామానుజన్‌కు లభించిన పురస్కారం

i) రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్

ii) ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ

iii) ఫెలో ఆఫ్ ది ట్రినిటి కాలేజ్

iv) డాక్టర్ ఆఫ్ లాస్

జ: ii, iii
 

14. కిందివాటిలో పైథాగరస్‌కు చెందిన విషయం

i) గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టడం

ii) పైథాగరియన్ త్రికాలు

iii) కరణీయ సంఖ్యలు

iv) సమతలాల్లో వృత్తం అందమైంది అనే భావన

జ: ii, iii
 

15. ఆర్కిమెడిస్‌కు చెందిన గ్రంథాలు

1) Centers of Plane Gravities; The Method 

2) Quadrature of Parabola; Sand counter 

3) Measurment of a Circle; Mensuration of a circle 

4) అన్నీ

జ: 4 (అన్నీ)
 

16. 'రేఖాగణిత' పితామహుడు

జ: యూక్లిడ్
 

17. 'బీజగణిత పితామహుడు' అనే గౌరవం పొందిన శాస్త్రవేత్త

జ: డయాఫాంటస్
 

18. 'సినాప్సిస్' గ్రంథ రచయిత

జ: కార్
 

19. త్రిభుజ భుజాలపై ఆధారపడిన త్రిభుజ వైశాల్యానికి సూత్రాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త?

జ: హెరాన్
 

20. 'డిస్‌కోర్స్ ఆన్ మెథడ్' గ్రంథ రచయిత

జ: రెనెడెకార్టే
 

21. 'ఇంట్రడక్టియో అర్థమెటికా' గ్రంథ రచయిత

జ: నికోమాకస్
 

22. సామాన్య గణనలకు   విలువను   గా తీసుకోవచ్చని ప్రతిపాదించినవారు

జ: భాస్కరాచార్య

23. 'సముద్రమంతటి గణిత శాస్త్రానికి అంతు ఎక్కడిది' అనే వాక్యం ఎవరికి చెందింది?

జ: భాస్కరాచార్య
 

24. 'గణితసారం అంతా దాని స్వేచ్ఛలోనే ఉంది' అనే వాక్యం ఎవరికి చెందుతుంది?

జ: జార్జ్ కాంటర్
 

25. 'న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ' అనే బిరుదు పొందినవారు

జ: ఆర్కిమెడిన్
 

26. ఏ గణిత శాస్త్రవేత్త అంకగణిత సమస్యలను సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్‌ను అనుసరించాడు?

జ: భాస్కరాచార్య
 

27. ax + by = c [a, b, c లు పూర్ణసంఖ్యలు] లాంటి సాధారణ సమీకరణాలను పల్వరైజర్ (కుట్టకం) అనే పద్ధతి ద్వారా సాధించిన శాస్త్రవేత్త

జ: ఆర్యభట్ట
 

28. ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్‌పై పరిశోధన చేసిన శాస్త్రవేత్త

జ: రామానుజన్
 

29. గణిత, భౌతిక శాస్త్ర ప్రారంభకులు అని ఎవరిని పిలుస్తారు?

i) రెనెడెకార్టే         ii) డెడికెంట్          iii) ఫెర్మా       iv) జార్జ్ కాంటర్

జ: i, iii
 

30. సమీకరణ సిద్ధాంతాన్ని విస్తరింపజేసి సాంకేతిక ప్రయోగాన్ని ప్రవేశపెట్టినవారు?

i) రెనెడెకార్టే         ii) ఫెర్మా         iii) జార్జ్ కాంటర్          iv) డెడికెంట్

జ: i, ii
 

31. కిందివాటిలో ఆర్యభట్ట గ్రంథం

1) సిద్ధాంత శిరోమణి         2) డేటా         3) ది ఎలిమెంట్స్       4) ఆర్యభట్టీయం

జ: 4 (ఆర్యభట్టీయం)
 

32. ఆర్యభట్టీయం గ్రంథంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?

జ:  121
 

33. ఒక రోజును 'అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకు' అని నిర్వచించిన గ్రంథం?

జ: ఆర్యభట్ట సిద్ధాంతం
 

34. జలఘటికా యంత్రాన్ని (కాల యంత్రం లేదా నీటి గడియారం) కనుక్కున్న శాస్త్రవేత్త

జ: భాస్కరాచార్య
 

35. రామానుజన్ పరిశోధనలు దేనికి చెందుతాయి?

జ: సంఖ్యావాదం
 

36. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని ఎప్పుడు స్థాపించారు?

జ: 1907
 

37. 'రామానుజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్‌'ను ఎప్పుడు స్థాపించారు?

జ: 1950
 

38. పైథాగరస్ అకాడమీ చిహ్నం

జ: అయిదు శీర్షాల నక్షత్రం
 

39. ఆధునిక గణిత భాషకు ఆద్యుడు

జ: రెనెడెకార్టే
 

40. ఆధునిక గణిత పితామహుడు

జ: రెనెడెకార్టే
 

41. కరణకుతూహలం గ్రంథ రచయిత

జ: భాస్కరాచార్య
 

42. 'డేటా' గ్రంథ రచయిత

జ: యూక్లిడ్
 

43. సమున్నత సంయుక్త సంఖ్య అనే భావనను ప్రవేశపెట్టినవారు

జ: రామానుజన్
 

44. 'వేదిక్ మ్యాథమెటిక్స్' గ్రంథ రచయిత
జ: భారతీకృష్ణ తీర్థ

 

45. కిందివాటిలో పైథాగరస్‌కు చెందిన విషయం
1) త్రిభుజాకార సంఖ్యలు       2) స్నేహ సంఖ్యలు        3) పరిపూర్ణ సంఖ్యలు       4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

46. 'థియరీ ఆఫ్ ఇన్‌ఫినైట్ సెట్' అనే సంచలనాత్మక వ్యాసాన్ని రాసినవారు?
జ: జార్జ్ కాంటర్

 

47. అంకగణిత సమస్యలకు ప్రాధాన్యాన్ని ఇచ్చిన 'సిద్ధాంత శిరోమణి'లోని భాగం
జ: లీలావతి

 

48. జార్జ్ కాంటర్ బిరుదు
జ: డాక్టర్ ఆఫ్ లాస్

 

49. π = 3.1416 అని ఎవరు పేర్కొన్నారు?
జ: ఆర్యభట్ట

50. π = 3.1255 అని ఎవరు పేర్కొన్నారు?
జ: భాస్కరాచార్య

51. కిందివాటిలో యూక్లిడ్‌కు చెందిన అంశం?
i) పైథాగరియన్ నిర్మాణాలు
ii) అనుపాతానికి సంబంధించిన యూడోక్సస్ (Eudoxus) వాదం
iii) అయిదు క్రమ ఘనాలను గోళంలో అంతర్లిఖించడం
జ: i, ii, iii

 

52. భారతదేశంలో ప్రయోగించిన మొదటి కృత్రిమ ఉపగ్రహం
జ: ఆర్యభట్ట

 

53. త్రిభుజాకార సంఖ్యలను పరిచయం చేసిన శాస్త్రవేత్త?
జ: పైథాగరస్

 

54. సంఖ్యలను బేసి, సరి సంఖ్యలుగా వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త?
జ: పైథాగరస్

 

55. గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయింపజేసిన దేశస్థులు?
జ: ఈజిప్షియన్లు

 

56. రామానుజన్ తన జీవిత చివరి దశలో పరిశోధన చేసిన అంశం?
జ: మాక్ - తీటా ఫంక్షన్స్

 

57. వర్గమూలాల గూడును కనుక్కున్న శాస్త్రవేత్త?
జ: రామానుజన్

 

58. 'ఒక చతురస్రంలోని కర్ణం దానికి రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే చతురస్ర భుజానికి సమానం' అని చెప్పిన శాస్త్రవేత్త?
జ: పైథాగరస్

 

59. పైథాగరస్ సిద్ధాంతానికి అనుభావిక స్వభావం కలిగిన ఉత్పత్తిని ఇచ్చిన భారతీయ గణిత శాస్త్రవేత్త?
జ: భాస్కరాచార్య - II

 

60.   విలువను కనుక్కోవడానికి అనేక సూత్రాలను ప్రతిపాదించినవారు?
జ: రామానుజన్

గత డీఎస్సీ, టెట్‌లో వచ్చిన ప్రశ్నలు

61. 'సిద్ధాంత శిరోమణి' గ్రంథ రచయిత
జ: భాస్కరాచార్య

 

62. 'గణితసార సంగ్రహం' గ్రంథ రచయిత
జ: మహావీర

 

63. 'ఎలిమెంట్స్' గ్రంథ రచయిత
జ: యూక్లిడ్

 

64. గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టినవారు?
జ: గ్రీకులు

 

65. 'రెండు కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం' అనే గోల్డ్ బాక్ కన్‌జక్చర్ వివరణను ఇచ్చిన గణిత శాస్త్రవేత్త?
జ: శ్రీనివాస రామానుజన్

 

66. 'పంచ సిద్ధాంతిక' గ్రంథకర్త
జ: వరాహమిహిరుడు

 

67. వృత్త వైశాల్యం = (వ్యాసం × 8/9)2 అని చెప్పినవారు?
జ: ఈజిప్షియన్లు

 

68. 'ది మెజర్‌మెంట్ ఆఫ్ ది సర్కిల్' గ్రంథ రచయిత
జ: ఆర్కిమెడిస్

 

69. కిందివాటిలో రామానుజన్ సంఖ్య ఏది?
1) 1729              2) 1297             3) 2971              4) 2179
జ: 1 (1729)

 

70. రేఖాగణితంపై యూక్లిడ్ సహజ బుద్ధికుశల శాస్త్రజ్ఞులైన అతడి పూర్వికుల రేఖా గణిత సంబంధాలన్నింటినీ సేకరించి ఒక క్రమపద్ధతిలో అమర్చిన అమూల్య గ్రంథం
జ: ది ఎలిమెంట్స్

Posted Date : 08-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌