• facebook
  • whatsapp
  • telegram

విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలు

1. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో మంచి నీటి సరఫరా చేసే నీటి వనరులను సూచించే వృత్తరేఖా చిత్రాన్ని చూసి విద్యార్థి వ్యాఖ్యానిస్తే అతడు సాధించిన లక్ష్యం-

జ: అవగాహన
 

2. కిందివాటిలో ప్రవర్తన మార్పును సూచించే రంగాలు, వాటి లక్షణాంశాలకు సంబంధించి సరిగా జతపరిచింది ఏది?

i) జ్ఞానాత్మక రంగం                      a) అంతర్ వృద్ధి

ii) భావావేశ రంగం                       b) సమన్వయీకరణ

iii) మానసిక చలనాత్మక రంగం            c) సరళత నుంచి క్లిష్టత

జ: బి(i-c, ii-a, iii-b)
 

3. గాలికి పీడనం ఉందనే ప్రయోగ నిర్వహణానంతరం విద్యార్థి అనుమతులను రాబడితే అతడు సాధించిన లక్ష్యం-

జ: వినియోగం
 

4. ప్రణవ్ అనే విద్యార్థి శాస్త్ర అధ్యయనానంతరం ప్లాస్టిక్ పర్యావరణానికి హాని కలుగజేస్తుందని తెలుసుకుని తిరిగి వస్త్రంతో తయారుచేసిన సంచులను ఉపయోగిస్తుంటే అతడిలో పెంపొందిన శాస్త్ర విలువ-

జ: సాంస్కృతిక విలువ
 

5. సాంఘికశాస్త్ర బోధన ముఖ్య ఉద్దేశం ఈ విలువలను పెంపొందింప చేయడమే-

జ: సాంస్కృతిక విలువ
 

6. కిందివాటిలో గణిత విలువలకు సంబంధించి సరిగా జతపరచనిది?

ఎ) ప్రకృతి అంతా గణితమయమే - ప్రయోజన విలువ

బి) పరిసరాల్లో గణితం - సాంస్కృతిక విలువ

సి) ప్రకృతి అంతా గణితమయమే - సాంస్కృతిక విలువ

డి) ప్రకృతి నియమాల - సాంస్కృతిక విలువ

జ: సి( ప్రకృతి అంతా గణితమయమే - సాంస్కృతిక విలువ)
 

7. ప్రజ్ఞకు సంబంధించని ఏకైక లక్ష్యం-

జ: జ్ఞానం
 

8. వినియోగ లక్ష్య స్పష్టీకరణం కానిది-

ఎ) పరికల్పనలు చేయడం              బి) ప్రాగుక్తీకరణ చేయడం

సి) ఫలితాలను తెలపడం               డి) ఫలితాలను అంచనా వేయడం

జ: డి(ఫలితాలను అంచనా వేయడం)
 

9. గుణశ్రీ అనే విద్యార్థిని రబ్బరు గొట్టం, విక్స్ మూతను ఉపయెగించి స్టెతస్కోప్ తయారు చేసింది. ఆమెలోని నైపుణ్యం-

జ: హస్తలాఘవ నైపుణ్యం
 

10. సముద్రపు నీరు నీలి రంగులోనే ఎందుకు ఉంటుందన్న సౌందర్యోపాసనే రామన్ ఎఫెక్ట్‌ను కనుక్కోవడానికి కారణమైతే ఇది ఏ విలువ?

జ: సౌందర్య విలువ
 

11. ఆవశ్యక పర్యవసానాలను ఉపయోగించి ఆశించిన ఫలితాన్ని పొందడం-

జ: విశ్లేషణ
 

12. మోహిత్ అనే విద్యార్థి ఇచ్చిన పటంలో కోరిన భాగాన్ని గుర్తించాడు. అతడిలో ఉన్న నైపుణ్యం-

జ: పరిశీలనా నైపుణ్యం
 

13. విద్యార్థి 52 × 5-3 × 54  అనే ఘాతాంక సమీకరణాన్ని సూక్ష్మీకరించాడు. అతడు సాధించిన లక్ష్యం ఏది?

జ: అవగాహన
 

14. అవగాహన లక్ష్య స్పష్టీకరణం కానిది-

ఎ) సంబంధాలను గుర్తిస్తాడు              బి) సంబంధాలను స్థాపిస్తాడు

సి) భేదాలు, తేడాలు తెలుపుతాడు          డి) ఉదాహరణలిస్తాడు

జ: బి( సంబంధాలను స్థాపిస్తాడు)
 

15. 'నీటి ఊర్ధ్వ పీడనం వస్తువులను కిందికి నెడుతుంది' అనే వాక్యంలో తప్పును గుర్తించి పైకి నెడుతుందని సరిచేసిన విద్యార్థి సాధించిన లక్ష్యం?

జ: అవగాహన
 

16. 'భారతదేశం - రాజ్యాంగం' పాఠ్య బోధనానంతరం విద్యార్థి జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం నేర్చుకున్నాడు. అతడు సాధించిన లక్ష్యం-

జ: వైఖరి
 

17. మోక్షిత అనే విద్యార్థిని తన జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగే వైజ్ఞానిక ప్రదర్శనలకు తరచూ హాజరవుతుంటే ఆమె సాధించిన లక్ష్యం-

జ: ఆసక్తి
 

18. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం-

జ: అనుకరణ హస్తలాఘవం సునిశితత్వం సమన్వయం సహజీకరణం
 

19. ఉద్దేశాలు, లక్ష్యాలు, గమ్యాలు అనే వాటిని అవి సాధించే కాలపరిమితి ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చితే సరైన క్రమం ఏది?

జ: లక్ష్యాలు ఉద్దేశాలు గమ్యాలు
 

20. ఉద్దేశాలు, లక్ష్యాలకు సంబంధించి సరికాని అంశం-
ఎ) ఉద్దేశాలు దీర్ఘ కాలికం, లక్ష్యాలు స్వల్ప కాలికం
బి) ఉద్దేశాలు మార్గదర్శకాలు, లక్ష్యాలు ఉద్దేశాలను అనుసరిస్తాయి.
సి) ఉద్దేశాలు సాధించవచ్చు లేదా సాధించలేకపోవచ్చు. కానీ లక్ష్యాలను తప్పక సాధించాలి.
డి) లక్ష్యాలు సాధించవచ్చు లేదా సాధించలేక పోవచ్చు కానీ ఉద్దేశాలను తప్పక సాధించాలి.
జ: డి (లక్ష్యాలు సాధించవచ్చు లేదా సాధించలేక పోవచ్చు కానీ ఉద్దేశాలను తప్పక సాధించాలి.)

 

21. వ్యక్తిలో నైపుణ్యాలు శిఖరాగ్ర స్థాయిలో అతడు సాధించిన లక్ష్యం-
జ: సహజీకరణం

 

22. నైపుణ్యాలను ఆర్జించడంలో ప్రముఖ పాత్ర వహించే అంశం-
జ: అనుకరణ

 

23. ఒక ఉపకరణాన్ని వీలైనన్ని ఎక్కువ విధాలుగా ఉపయోగిస్తే విద్యార్థి సాధించిన లక్ష్యం-
జ: కౌశలం

 

24. ఉల్కలు భూమి ఆవరణంలోకి రాగానే మండిపోవడానికి ఉన్న కారణాలను తెలియజేసిన విద్యార్థి సాధించిన లక్ష్యం-
జ: వినియోగం

 

25. ఉపాధ్యాయుడి బోధన విజయానికి కారణమయ్యే నైపుణ్యం
జ: అభివ్యంజన నైపుణ్యం

 

26. ఆసక్తి, వైఖరిగా పిలిచే భావావేశ రంగ లక్ష్యాలు వరుసగా-
జ: ప్రతిస్పందించడం, విలువ కట్టడం

 

27. శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమించి 'ఈ సూత్రం లేదా సిద్ధాంతం కనుక్కుంటే నాకేమొస్తుంది' అనే స్వలాభాపేక్షతో పనిచేయరని విద్యార్థులకు వివరిస్తే వారిలో పెంపొందే శాస్త్ర విలువ-
జ: నైతిక విలువ

 

28. గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని పాటించాలనుకోవడం-
జ: శీలస్థాపనం

 

29. కుమారి అనే విద్యార్థి ప్రతిరోజు దినపత్రిక చదువుతూ ఎప్పటికప్పుడు బంగారం విలువ తెలుసుకుంటుంది. గణితానికి ఉన్న ఏ విలువ వల్ల అది సాధ్యమైందని చెప్పవచ్చు?
జ: సమాచార విలువ

 

30. పటంలోని భాగాలను సాపేక్షత లేదా సౌష్ఠవంగా గీసిన విద్యార్థిలో ఉన్న నైపుణ్యం-
జ: చిత్రలేఖన నైపుణ్యం

 

31. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణకు సంబంధించి సరికాని అంశం-
ఎ) ప్రాధాన్యతలో మార్పు    బి) పదజాలంలో మార్పు    సి) నిర్మాణంలో మార్పు    డి) నిర్వహణలో మార్పు
జ: సి(నిర్మాణంలో మార్పు )

 

32. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో అత్యున్నత లక్ష్యం-
జ: సృష్టి/ ఉత్పత్తి చేయడం

 

33. నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు విలువల విద్య ఎంతో అవసరం అని పేర్కొంది?
జ: కొఠారి కమిషన్

 

34. విద్యార్థి అనేక జంతువులను పరిశీలించిన తర్వాత 'చెవులు బయటకు ఉండి, చర్మంపై వెంట్రుకలు ఉన్న ఏ జంతువైనా శిశోత్పాదకం' అనే విషయ నిర్థారణకు వస్తే, దాన్ని ఇలా పిలవరు?
జ: నిగమన హేతువాదం

 

35. విశ్లేషణకు సంబంధించి సరికానిది.
ఎ) మూర్తత్వం - అమూర్తత్వం            బి) సారాంశం నుంచి దత్తాంశం
సి) తెలియని అంశం - తెలిసిన అంశం      డి) అమూర్తత్వం - మూర్తత్వం
జ: ఎ(మూర్తత్వం - అమూర్తత్వం)

 

36. జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాల్లోని లక్ష్యాల సంఖ్య వరుసగా-
జ: 6, 5, 5

 

37. విలువను ఒక భావన ఏర్పరచుకునే భావావేశ రంగ లక్ష్యం-
జ: వ్యవస్థాపనం

 

38. బ్యాంకులో పనిచేస్తున్న నగదు అధికారి (Cashier) వినియోగదారుడితో మాట్లాడుతూనే డబ్బును వేగంగా కచ్చితంగా లెక్కపెడితే, అతడు మానసిక చలనాత్మక రంగంలో ఏ లక్ష్యాన్ని సాధించాడని చెప్పవచ్చు?
జ: సహజీకరణం

 

39. విద్యార్థి అనేక జతల సరి సంఖ్యల మొత్తాలను కనుక్కుని ఏ రెండు సరి సంఖ్యల మొత్తమైనా సరి సంఖ్యేనని సాధారణీకరిస్తే అతడు సాధించిన లక్ష్యం-
జ: వినియోగం

 

40. ఆగమన, నిగమన పద్ధతుల్లో కార్యాచరణ చింతన చేస్తే విద్యార్థి సాధించిన లక్ష్యం-
జ: వినియోగం

 

41. హరి అనే విద్యార్థి ప్రయోగశాల్లో ఆక్సిజన్ తయారీకి కావలసిన పరికరాలను, రసాయనాలను ఎన్నుకుంటే అతడు సాధించిన లక్ష్యం-
జ: అవగాహన

 

42. వండి తినే ఆహార పదార్థాలకు విద్యార్థి ఉదాహరణలు ఇస్తే అతడు సాధించిన లక్ష్యం-
జ: అవగాహన

 

43. జ్ఞానాత్మక రంగ లక్ష్యం కానిది-
ఎ) విశ్లేషణ         బి) వినియోగం     సి) సంశ్లేషణ           డి) అనుకరణ
జ: డి(అనుకరణ)

 

44. మేథోపరమైన ఆలోచనలకు కేంద్ర బిందువైన రంగం-
జ: జ్ఞానాత్మక రంగం

 

45. 'లవం తక్కువగా, హారం ఎక్కువగా ఉన్న భిన్నాలను క్రమభిన్నాలు అంటారు' అని విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకుంటే అతడు సాధించిన లక్ష్యం-
జ: జ్ఞానం

 


జ: అవగాహన

 

47. శాస్త్రీయ పరిశీలనలను వ్యాఖ్యానించిన విద్యార్థి సాధించిన లక్ష్యం-
జ: వినియోగం

 

48. భూమిపై ఆక్సిజన్ అంతరించిపోతే ఏం జరుగుతుందో విద్యార్థి ఊహిస్తే, అతడు సాధించిన లక్ష్యం-
జ: వినియోగం

Posted Date : 15-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌