• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పీజీ ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష

ఏపీ పీజీసెట్‌-2021 ప్రవేశ ప్రకటన విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీజీసెట్‌)-2021 ప్రకటన వెలువడింది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షను యోగి వేమన యూనివర్సిటీ, కడప నిర్వహించనుంది. ఈ పరీక్ష వల్ల విద్యార్థులు ప్రతి విశ్వవిద్యాలయానికీ వేర్వేరుగా దరఖాస్తు చేసుకుని, వివిధ యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. ఈ ఉమ్మడి పరీక్షతో విద్యార్థుల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి!

ఏపీ పీజీ సెట్‌లో సాధించిన స్కోరుతో ఆంధ్రా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున, శ్రీవేంకటేశ్వరా, శ్రీకృష్ణదేవరాయ, విక్రమ సింహపురి, యోగి వేమన యూనివర్సిటీ, రాయలసీమ, కృష్టా, ద్రవిడియన్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ, డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ, క్లస్టర్‌ యూనివర్సిటీ, శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రవేశాలకు స్థానిక రిజర్వేషన్లు, ప్రతిభను ప్రాతిపదికగా తీసుకుంటారు.

ఏ కోర్సులు? 

ఎంఏ: ఇంగ్లిష్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్, లింగ్విస్టిక్స్, తెలుగు, తెలుగు లాంగ్వేజ్, లిటరేచర్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్, కార్పొరేట్‌ తెలుగు, కంపారెటివ్‌ ద్రవిడియన్‌ లిటరేచర్, సాన్‌స్క్రిట్, హిందీ, ఉర్దూ, తమిళ్, కన్నడ, ఫోక్‌లోర్, కూచిపూడి క్లాసికల్‌ డాన్స్, కర్ణాటిక్‌ క్లాసికల్‌ మ్యూజిక్, పర్ఫామింగ్‌ ఆర్ట్స్, మ్యూజిక్‌ (వీణ), మ్యూజిక్‌ (వయోలిన్‌), మ్యూజిక్‌ (వోకల్‌), డాన్స్‌ (భరతనాట్యం), మ్యూజిక్‌ (భరతనాట్యం), మహాయాన్‌ బుద్ధిష్ట్‌ స్టడీస్, హిస్టరీ (సౌత్‌ ఈస్ట్‌ యేసియన్‌ అండ్‌ పసిఫిక్‌ స్టడీస్‌), ఏన్షియంట్‌ ఇండియన్‌ హిస్టరీ, కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ, ఏన్షియంట్‌ హిస్టరీ అండ్‌ ఆర్కియాలజీ, హిస్టరీ అండ్‌ ఆర్కియాలజీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, ఫిలాసఫీ, ఆంత్రొపాలజీ, సోషల్‌వర్క్, సైకాలజీ, కౌన్సెలింగ్‌ సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, యోగా అండ్‌ కాన్షియస్‌నెస్, హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్, అప్లైడ్‌ ఎకనామిక్స్, ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ డ్యూటీస్, లైబ్రరీ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్, పాపులేషన్‌ స్టడీస్, జెండర్‌ స్టడీస్, రూరల్‌ డెవలప్‌మెంట్, టూరిజం, టూరిజం మేనేజ్‌మెంట్, ఉమెన్‌ స్టడీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌.

ఎంఎఫ్‌ఏ: స్కల్ప్‌చర్, పెయింటింగ్, ప్రింట్‌ మేకింగ్‌.

ఎంకాం: అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్, ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్, ప్రొఫెషనల్, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్, (రిటైల్‌ మార్కెటింగ్, అకౌంటింగ్‌ అండ్‌ ట్యాలీ కోర్సులను కొత్తగా ప్రారంభించనున్నారు)

ఎమ్మెస్సీ: బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ (ఇమ్యూనాలజీ), నానో బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్, ఒకేషనల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ సైన్సెస్, హోమ్‌సైన్స్‌ (ఫుడ్స్, న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌), హోమ్‌సైన్స్‌ (ఎంఎస్‌ ఫుడ్‌ అండ్‌ టెక్నాలజీ), క్లినికల్‌ న్యూట్రిషన్, బోటనీ, సెరికల్చర్, హ్యూమన్‌ జెనెటిక్స్, మెరైన్‌ బయాలజీ అండ్‌ ఫిషరీస్, కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ మెరైన్‌ బయో టెక్నాలజీ, మెరైన్‌ బయోటక్నాలజీ, మెరైన్‌ బయాలజీ, ఆక్వాకల్చర్, ఒకేషనల్‌ ఇన్‌ హార్టీకల్చర్‌ అండ్‌ లాండ్‌స్కేప్‌ గార్డెనింగ్, జువాలజీ, యానిమల్‌ బయోటెక్నాలజీ, వైరాలజీ, మైక్రో బయాలజీ, ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ, అల్లైడ్‌ మైక్రోబయాలజీ, జెనెటిక్స్‌ అండ్‌ జెనోమిక్స్, హోమ్‌ సైన్స్‌ (హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫ్యామిలీ స్టడీస్‌), ఫ్యాషన్‌ టెక్నాలజీ అండ్‌ అపారల్‌ డిజైనింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్, క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ సైన్స్, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ సైన్స్, కమ్యూనిటీ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్, క్లినికల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్, ఫిజిక్స్, న్యూక్లియర్‌ ఫిజిక్స్, జియో ఫిజిక్స్, మెరైన్‌ జియోఫిజిక్స్, ఫిజికల్‌ ఓషనోగ్రఫీ, మీటియొరాలజీ, మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ నానో టెక్నాలజీ, నానో టెక్నాలజీ (లేటరల్‌ ఎంట్రీ), ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌), ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, అప్లైడ్‌ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్, కంప్యూటర్‌ డేటా సైన్స్, కెమిస్ట్రీ, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ, ఇన్‌ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ అండ్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ ఫుడ్స్, డ్రగ్స్‌ అండ్‌ వాటర్, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఫోరెన్సిక్‌ సైన్సెస్, ఫిజికల్‌ కెమిస్ట్రీ, అప్లైడ్‌ కెమిస్ట్రీ, హెర్బల్‌ సైన్స్, హ్యూమన్‌ న్యూట్రిషన్‌ అండ్‌ న్యూట్రాటికల్‌ కెమిస్ట్రీ, పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆయిల్, ఫ్యాట్స్‌ అండ్‌ పెట్రో ప్రాడక్ట్స్, జియాలజీ, టెక్‌ అప్లైడ్‌ జియాలజీ, సైకాలజీ, కౌన్సెలింగ్‌ సైకాలజీ, క్లినికల్‌ సైకాలజీ, యోగా ఫర్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్, జాగ్రఫీ (బీఏ స్ట్రీమ్‌), జాగ్రఫీ (బీఎస్సీ స్ట్రీమ్‌). 

అర్హత: అన్ని పీజీ కోర్సులకూ యూజీలో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. కొన్ని జనరల్‌ కోర్సులకు యూజీ అన్ని విభాగాలవారూ అర్హులే. కొన్ని పీజీ కోర్సులకు మాత్రం యూజీలో సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్టును చదివివుండడం తప్పనిసరి. 

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారు.

రిజిస్ట్రేషన్‌ ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.850, బీసీ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.650. 

పరీక్ష విధానం: ప్రవేశ పరీక్షలో అన్ని సబ్జెక్టులకు కలిపి 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్‌ మార్కులుండవు. ఎనాలజీ, క్లాసిఫికేషన్, మ్యాచింగ్, కాంప్రహెన్షన్‌ ఆఫ్‌ ఎ రిసెర్చ్‌ స్టడీ/ ఎక్సపర్‌మెంట్‌/ థియరిటికల్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూ.. మొదలైన అంశాలుంటాయి. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. 

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ: 15.09.2021 నుంచి ప్రారంభమైంది. 

అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులకు చివరి తేది: 06.10.2021

పరీక్ష తేదీ: 22.10.2021 నుంచి 

వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కెరియర్‌ మెరిసే‘లా’!

‣ మనసు తెలిసి... కలిసి మెలిసి!

Posted Date : 29-09-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌