• facebook
  • twitter
  • whatsapp
  • telegram

bel: బెల్‌లో ప్రాజెక్టు ఇంజినీర్‌ పోస్టులు

 

 

దేశరక్షణకు అవసరమైన పరికరాలను రూపొందించే భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఒప్పంద ప్రాతిపదికన 49 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. హైదరాబాద్‌ యూనిట్‌ కోసం నియామకం చేపట్టినా ఎంపికైన అభ్యర్థులను ఇతర యూనిట్లకు పంపే అవకాశమూ ఉంది.  

 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెల్‌... ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌లకు ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉత్పత్తి చేస్తోంది. ఉపగ్రహ నిర్మాణంలోనూ తన ప్రత్యేకతను చాటుతోంది. ఈ-వెహికల్‌ చార్జింగ్‌ స్టేషన్లు, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్లు, టెలికమ్, చీకట్లో చూడగలిగే ఉపకరణాలు, మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను రూపొందిస్తోంది. త్రివిధ దళాలకు అవసరమైన పరికరాలను తయారుచేస్తూ రక్షణ రంగంలో ప్రత్యేకంగా నిలిచిందీ సంస్థ. 

 

ఏయే పోస్టులు?

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-1 (ఎలక్ట్రానిక్స్‌)-36, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-1 (మెకానికల్‌)-8, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-1 (కంప్యూటర్‌ సైన్స్‌)-4, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌-1 (హ్యూమన్‌ రిసోర్సెస్‌) ఖాళీలున్నాయి. 

 

ప్రాజెక్టు ఇంజినీరు విషయంలో పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) పాసైవుండాలి. ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (హెచ్‌ఆర్‌) పోస్టుకు ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ఎంహెచ్‌ఆర్‌ఎం/ ఎంఏ (హెచ్‌ఆర్‌ స్పెషలైజేషన్‌) ఉత్తీర్ణత అవసరం. వయసు 01.08.2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వయః పరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్‌బీఐ చలాన్‌ ద్వారా ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.  

 

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-1, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌-1 పోస్టులకు తప్పనిసరిగా రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌)కు మైక్రోవేవ్‌ సబ్‌సిస్టమ్స్‌ లేదా రాడార్స్, కమ్యూనికేషన్స్‌ సిస్టమ్స్, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి. ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సబ్‌సిస్టమ్స్‌ను పరీక్షించడంలో అనుభవం ఉండాలి. నెట్‌వర్క్‌ ఎనలైజర్, స్పెక్ట్రమ్‌ ఎనలైజర్, సిగ్నల్‌ జనరేటర్, ఆర్‌ఎఫ్‌ పవర్‌ మీటర్, డిజిటల్‌ స్టోరేజ్, ఆక్సిలోస్కోప్, చిప్‌స్కోప్, లాజిక్‌ ఎనలైజర్, సిగ్నల్‌ ఎనలైజర్‌లను వినియోగించడం తెలిసుండాలి. యాంటెనా పారామీటర్స్‌ పరిజ్ఞానం, యాంటెనా టెస్టింగ్‌లో అనుభవం ఉండాలి. టెక్నికల్‌ టీమ్‌ల నిర్వహణ, ప్రాజెక్ట్‌ ప్రజెంటేషన్లను రూపొందించడం, వర్క్‌ ప్లానింగ్, షెడ్యూలింగ్‌ అవగాహనను అదనపు అర్హతగా పరిగణిస్తారు. విధి నిర్వహణలో భాగంగా అభ్యర్థులు వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది. 

 

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని వివరాలను నమోదు చేసిన దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకసారి దరఖాస్తును పూర్తిచేసిన తర్వాత ఎలాంటి మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదు. భవిష్యత్‌ కరస్పాండెన్స్‌ కోసం అభ్యర్థుల ఈమెయిల్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రభుత్వ/ పబ్లిక్‌ అండర్‌టేకింగ్‌ సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాల్సి ఉంటుంది. 

 

విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల పేర్ల జాబితాను సంస్థ వెబ్సైట్‌లో ఉంచుతారు. ఈ-మెయిల్‌ ద్వారా అభ్యర్థులకు ఈ విషయాన్ని తెలియజేస్తారు. వీడియో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా ఈ-మెయిల్‌ (hydhrgen@bel.co.inz) ద్వారా సంప్రదించవచ్చు. ఫోన్‌కాల్స్, ఫాక్స్‌ మెసేజ్‌లను అనుమతించరు

 

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 04, 2021

 

వెబ్‌సైట్‌: https://bel-india.in/
 

Posted Date : 27-07-2021 .

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌