• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డిజిటల్‌ టెక్నిక్స్‌లో బీటెక్‌  

బీటెక్‌లో సరికొత్త మల్టీ డిసిప్లినరీ కోర్సు ‘డిజిటల్‌ టెక్నిక్స్‌ అండ్‌ డిజైన్‌’ (డీటీడీ). ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్‌     వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో, తెలంగాణలో     జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీలో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. పోటీ తక్కువున్న ఈ కోర్సు ద్వారా ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయి!  

మల్టీ డిసిప్లినరీ ప్రొఫెషనల్‌ కోర్సు అయిన డీటీడీ అత్యాధునిక టెక్నాలజీ విభాగానికి సంబంధించినది. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల్లో డిజిటల్‌ టెక్నిక్స్‌ ప్రాముఖ్యం పెరుగుతోంది. వర్తమాన ప్రపంచంలో ప్రతి పనీ (ఉదాహరణకు ట్రావెల్, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, జీపీఎస్‌ అండ్‌ మ్యాపింగ్, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్, సోషల్‌ మీడియా.. ఇంకా మరెన్నో) డిజిటల్‌ టెక్నాలజీతోనే నడుస్తోందని తెలిసిందే. ఈ కోర్సు చదివిన విద్యార్థులు ఆర్కిటెక్చర్, ప్లానింగ్, డిజైనింగ్, యానిమేషన్, కన్‌స్ట్రక్షన్‌ పరిశ్రమలకు సంబంధించిన ఏ పనినైనా సులభంగా డిజిటలైజ్‌ చేయగలరు.  

ఏం నేర్చుకుంటారు?: డీటీడీ కోర్సు ద్వారా నాలుగు డిసిప్లిన్స్‌కు సంబంధించిన టెక్నాలజీలను (ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్, జియోగ్రాఫికల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్, మల్టీ మీడియా) నేర్చుకుంటారు. ఇందులో ఐటీకి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ అయిన పైతాన్, సీ‡, జావా, యూనిక్స్‌ అండ్‌ షెల్, డిజైన్‌కు సంబంధించిన డిజిటల్‌ గ్రాఫిక్స్, 2డీ…, 3డీ… గ్రాఫికల్‌ సిస్టమ్స్, సైబర్‌ లాస్, వెబ్‌ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, మల్టీ మీడియాకు సంబంధించిన సాఫ్ట్‌వేర్లు అయిన మాయ, మల్టీ మీడియా ప్లేయర్, మల్టీ మీడియా ప్రొడక్షన్‌ టెక్నిక్స్, జీఐఎస్‌కి సంబంధించిన వెబ్‌ జీఐఎస్, జియో ఇన్ఫర్మాటిక్స్, డిజిటల్‌ జీపీఎస్, డిజైన్‌కు సంబంధించిన డ్రాయింగ్, ప్లానింగ్, సిములేషన్, డిజిటల్‌ డిజైన్‌ అనే వివిధ నైపుణ్యాల్లో పట్టు సాధిస్తారు

ఉద్యోగావకాశాలు: ఈ కోర్సులో డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్‌ టెస్టర్‌గా, ప్లానింగ్‌ రంగంలో సీఏడీ అండ్‌ జీఐఎస్‌ ఇంజినీర్‌గా, డిజైన్‌లో ఆర్కిటెక్చరల్‌ ఇంజినీర్, ప్రొడక్ట్‌ డిజైన్‌ ఇంజినీర్, గ్రాఫిక్‌ డిజైన్‌ ఇంజినీర్‌గా, నిర్మాణ రంగంలో డిజైన్‌ విజువలైజర్స్‌గా, మీడియాలో ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా వెబ్‌ డిజైన్‌ కొలువులు, ఫిలిం పరిశ్రమలో యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్‌ గ్రాఫిక్స్‌ ఉద్యోగాలు సాధించవచ్చు.

 అర్హత: ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు 10+2 (ఎంపీసీ)/ 10+3 మ్యాథమేటికల్‌ నేపథ్యం ఉండాలి. 

ప్రవేశ పరీక్ష: ఇంటర్‌ విద్యార్థులు, డిప్లొమా విద్యార్థులు: ఈఏపీసెట్‌/ ఎంసెట్‌

ఉన్నత విద్యావకాశాలు: పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (ఎంటెక్‌/ ఎంఎస్‌)లో యానిమేషన్, ఐటీ, నానో టెక్నాలజీ, జీఐఎస్, రిమోట్‌ సెన్సింగ్‌ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ జియోమేట్రిక్స్, జియో ఇన్‌ఫర్మాటిక్స్‌లు చదవటానికి స్వదేశంలోనైనా విదేశాల్లోనైనా అవకాశాలు ఉంటాయి.  
 

Posted Date : 16-09-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.