• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వెయిటేజీకి తగ్గట్టే ప్రణాళిక 

సీఎంఏ ఫైనల్‌ పరీక్షలు త్వరలోనే జరగబోతున్నాయి. ఈ తరుణంలో అభ్యర్థులు ఏ సబ్జెక్టుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మెలకువలు పాటించాలి? 
 

డిసెంబరు 2019 పరీక్షలకు సంబంధించి సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ వారు సీఎంఏ ఫైనల్‌ సబ్జెక్టుల అదనపు స్టడీ మెటీరియల్‌ను కొత్తగా విడుదల చేశారు. ఎక్కువ మార్కుల సాధనకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. 
 

సిలబస్‌ అంశాలపై పూర్తి అవగాహన కల్పించుకోవాలి. ప్రతి చాప్టర్‌ వెయిటేజీ చూసుకోవాలి. ప్రశ్నపత్రంలో వెయిటేజీకి ప్రాధాన్యమిస్తారు. దానికి అనుగుణంగానే సన్నద్ధత ప్రణాళిక వేసుకోవాలి.
 

సబ్జెక్టులకు సంబంధించి సొంతంగా ఫాస్ట్‌ ట్రాక్‌ నోట్స్‌ సిద్ధం చేసుకోవడం మేలు. ఫార్ములాలన్నింటికీ ఒక నోట్స్‌ పెట్టుకోవాలి.
 

గత పరీక్షల ప్రశ్నపత్రాలు కనీసం రెండేళ్లవి చూసుకోవాలి. ఆ ప్రశ్నల ఆధారంగా సన్నద్ధమవ్వాలి. 
 

స్కానర్‌ విశ్లేషణకు సమయం కేటాయించుకోవాలి.
 

‣ ఆర్‌టీపీ (రివిజన్‌ టెస్ట్‌ పేపర్‌)-2 అటెంప్ట్స్, ఎంటీపీ (మాక్‌ టెస్ట్‌ పేపర్‌)- 3 అటెంప్ట్స్, వర్క్‌బుక్‌ తప్పకుండా పునశ్చరణ చేసుకోవాలి. వీటి ద్వారా 60% మార్కులను ఆశించవచ్చు. ప్రశ్నపత్రాలు అధికారిక వెబ్‌సైట్‌ https://icmai.in/icmai/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
 

ప్రతి అంశానికీ ప్రాధాన్యమివ్వాలి. పునశ్చరణలో అన్నింటికీ ప్రాధాన్యమిచ్చారో లేదో చూసుకోవాలి.
 

స్టడీమెటీరియల్‌తోపాటు ఇతర రచయితల పుస్తకాలూ చదవాలి.
 

పేపర్‌-13: కార్పొరేట్‌ లాస్‌ అండ్‌ కంప్లైన్స్‌ (100 మార్కులు)
కంపెనీస్‌ యాక్ట్‌ 2013కి సంబంధించిన నిబంధనలను చూసుకోవాలి. పరీక్షకు ముందు 6 నెలల వరకు చేసిన సవరణలు పరీక్షలో వచ్చే వీలుంది. 
ప్రాక్టికల్‌ తరహా ప్రశ్నలు, ప్రొసీజర్‌ అండ్‌ కంప్లైన్స్‌ ఇష్యూలపై ఎక్కువ దృష్టిపెట్టాలి 
కేస్‌స్టడీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే అనాలిసిస్‌ ఆఫ్‌ ప్రొవిజన్‌ చేయాలి.
 

పేపర్‌-14: స్ట్రాటజిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (100 మార్కులు)
సెక్యూరిటీ అనాలిసిస్‌ అండ్‌ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్‌ డెసిషన్స్‌ చాలా సులువైన అధ్యాయాలు. వీటి నుంచి ఎక్కువ మార్కులకు ప్రశ్నలు వచ్చే వీలుంది.
 

పేపర్‌-15: స్ట్రాటజిక్‌ కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డెసిషన్‌ మేకింగ్‌ (100 మార్కులు)
రెండు విభాగాలకూ సమప్రాధాన్యం ఇవ్వాలి. డెసిషన్‌ మేకింగ్‌లో అప్లికేషన్‌ ఆఫ్‌ స్టాటిస్టికల్‌ టెక్నిక్స్‌ ఇన్‌ బిజినెస్‌ డెసిషన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. స్ట్రాటజిక్‌ కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో థియరీ, సమస్యలు రెండూ పాక్షికంగా ఉంటాయి. స్కానర్‌లోని ప్రాబ్లమ్స్‌ను సాధన చేయాలి.
 

పేపర్‌-16: డైరెక్ట్‌ టాక్స్‌ లాస్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ టాక్సేషన్‌ (100 మార్కులు)
ఎక్కువ సిలబస్‌ ఉంటుంది. ప్రణాళికబద్ధంగా సన్నద్ధమవ్వాలి. 
ఇంటర్నేషనల్‌ టాక్సేషన్‌లో అసెస్‌మెంట్‌ ఆఫ్‌ వేరియస్‌ పర్సన్స్, కేస్‌స్టడీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. క్యాపిటల్‌ గెయిన్స్, పీజీబీపీ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. 
ఫైనాన్స్‌ యాక్ట్‌ 2019 వర్తిస్తుంది. మే 31, 2020 వరకు విడుదల చేసిన నోటిఫికేషన్లు, సర్క్యులర్లు వర్తిస్తాయి.
 

పేపర్‌-17: కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ (100 మార్కులు)
దీనిలో 5 విభాగాలుంటాయి (ఎ. అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ జనరల్లీ యాక్సెప్టెడ్‌ అకౌంటింగ్‌ ప్రిన్సిపుల్స్‌- 20 మార్కులు; బి. అకౌంటింగ్‌ ఆఫ్‌ బిజినెస్‌ కాంబినేషన్స్‌ అండ్‌ రీస్ట్రక్చరింగ్‌- 20 మార్కులు, సి. గ్రూప్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌- 20 మార్కులు; డి. డెవలప్‌మెంట్స్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌- 25 మార్కులు; ఇ. గవర్నమెంట్‌ అకౌంటింగ్‌). అశ్రద్ధ చేయకుండా చదవాలి. 
సెక్షన్‌- డి, ఇ, ఎ.. క్రమంలో సన్నద్ధత ప్రారంభించాలి. సెక్షన్‌ సి నుంచి 10/ 15 మార్కుల ప్రశ్న ఆశించవచ్చు. దీనిలో చిన్న కాన్సెప్టులనూ వదిలేయొద్దు. 
ఈసారి కొత్తగా 5 ఇండ్‌ అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌ను చేర్చారు. వీటిపైనా దృష్టిపెట్టాలి.
 

పేపర్‌-18: కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆడిట్‌ (100 మార్కులు)
కాన్సెప్టులు, విధానాలు అర్థం చేసుకోవాలి. స్టడీమెటీరియల్‌లోని ప్రశ్నలను అధ్యయనం చేయాలి. 
సమస్యాపూరిత ప్రశ్నలకు వర్తించే చట్టాలను సమాధానంలో రాయాలి. 
‣ 2020 పరీక్షలకు ఫైనాన్స్‌ యాక్ట్‌ 2019 వర్తిస్తుంది. మే 31, 2020 వరకు విడుదల చేసిన నోటిఫికేషన్లు, సర్క్యులర్లు వర్తిస్తాయి. 
జీఎస్‌టీలో ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్, లెవీ అండ్‌ కలెక్షన్‌ అంశాలూ; కస్టమ్స్‌ డ్యూటీలోని ప్రాబ్లమ్స్‌తోపాటు కొత్త సవరణలు, కేస్‌స్టడీస్‌ చూసుకోవాలి.
 

పేపర్‌-19: కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆడిట్‌ (100 మార్కులు)
కొద్దిగా కఠినమైన సబ్జెక్టు. కాస్ట్‌ అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌పై దృష్టిపెట్టాలి. 
స్కానర్‌లోని ప్రశ్నలను బాగా అధ్యయనం చేయాలి. 
ఆపరేషనల్‌ ఆడిట్, మేనేజ్‌మెంట్‌ ఆడిట్‌ విషయాలపై కాన్సెప్చువల్‌ ఐడియా అవసరం. 
చాప్టర్‌ చివర్లో ఇచ్చే సారాంశంపై దృష్టిపెట్టాలి. సెక్షన్‌ సి నుంచి 20 మార్కులకుపైగా కేస్‌స్టడీ ప్రశ్నను ఆశించవచ్చు. 
‣ మే 31, 2020 వరకు కంపెనీ రూల్స్, 2014లో వచ్చిన ప్రతి సవరణ ఈ పరీక్షకు వర్తిస్తుంది. 
 

పేపర్‌-20: స్ట్రాటజిక్‌ పర్‌ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బిజినెస్‌ వాల్యుయేషన్‌  (100 మార్కులు)
రెండు అంశాలకూ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. 
బిజినెస్‌ వాల్యుయేషన్‌లో వాల్యుయేషన్‌ ఇన్‌మర్జెర్స్‌ అండ్‌ అక్విజిషన్స్, వాల్యుయేషన్‌ ఆఫ్‌ అసెట్స్‌ అండ్‌ లయబిలిటీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. దీనిలో థియరీ ప్రశ్నలు తక్కువ, ప్రాబ్లమ్స్‌ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మార్కులకు ఆస్కారం ఉంటుంది.
స్ట్రాటజిక్‌ పర్‌ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌లో పర్‌ఫార్మెన్స్‌ ఇవాల్యూషన్‌ అండ్‌ ఇంపార్టెన్స్‌ టూల్స్, ఎంటర్‌ప్రైజ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ అంశాలపై దృష్టిపెట్టాలి.

Posted Date : 16-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌