• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మెరిట్‌తో నేరుగా నేవీలోకి..

210 పోస్టుల భర్తీకి ఆహ్వానం   

రాత పరీక్ష లేదు

మంచి జీతభత్యాలు, సమాజంలో గౌరవం తదితరాల వల్ల రక్షణ రంగంలో ఉద్యోగాల పట్ల యువతలో తరగని ఆకర్షణ ఉంది. మంచి మార్కులు పొంది ఉన్న అభ్యర్థులకు ఇప్పుడు నేరుగా భారత నౌకాదళంలోకి ప్రవేశించే అద్భుత అవకాశం  వచ్చింది. కరోనా కారణంగా రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించి ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. రక్షణలో భాగస్వాములై, దేశ సేవ చేయాలనుకునేవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ వివిధ బ్రాంచుల్లోని పర్మనెంట్ కమిషన్ (పీసీ), షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఇవిగో వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 210

బ్రాంచీలవారీ ఖాళీలు: 

1) ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఎస్ ఎస్ సీ): 122 పోస్టులు

2) టెక్నికల్(ఎస్ ఎస్ సీ): 70 పోస్టులు

3) ఎడ్యుకేషన్ బ్రాంచ్: 18 పోస్టులు

ఖాళీలున్న విభాగాలు: పైలట్, అబ్జర్వర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్ట‌రేట్‌ కేడర్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నికల్ (ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రికల్).

శిక్షణ ఇచ్చే కోర్సులు:

షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ ఎస్ సీ) ద్వారా సంబంధిత విద్యార్హతలు కలిగిన అవివాహిత పురుషులు, మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. విద్యార్హతను బట్టి ఎంపికయ్యే అభ్యర్థులను మూడు కోర్సుల్లోని ఏదైనా ఒక కోర్సుకు ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు.

1) ఎక్స్టెండెడ్ నేవల్ ఓరియెంటేషన్ కోర్సు: జనరల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్)

2) నేవల్ ఓరియెంటేషన్ కోర్సు (ఎన్ఓసీ) రెగ్యులర్: నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్ట‌రేట్‌ కేడర్\అబ్జర్వర్\పైలట్\లాజిస్టిక్స్\టెక్నికల్(ఇంజినీరింగ్&ఎలక్ట్రికల్)ఎడ్యుకేషన్.

3) స్పెషన్ ఎన్ఓసీ: ఎస్ ఎస్ సీ (ఎగ్జిక్యూటివ్\ఇన్పర్మేషన్ టెక్నాలజీ)

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, బీఎస్సీ, బీకాం బీఎస్సీ (ఐటీ), పీజీ డిప్లొమా/ ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ (ఐటీ), డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

ఎంపిక విధానం

కొవిడ్-19 కారణంగా ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించకుండా అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్లిస్టింగ్ చేస్తారు. షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు సర్వీస్ సెలెక్షన్ బోర్డు(ఎస్ ఎస్ బీ) ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఉంటుంది.  

అభ్యర్థులు డిగ్రీలో పొందిన మార్కులను క్రోడీకరించి ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. 

ఎంసీఏ, ఎంబీఏ, ఎమ్మెస్సీ, బీఎస్సీ, బీకాం విద్యార్హత కలిగిన అభ్యర్థుల అన్ని మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మిగతా డిగ్రీలు కలిగిన వారి సెమిస్టర్ మార్కులతోపాటు ప్రీ-ఫైనల్ మార్కులనూ పరిశీలిస్తారు.

మెరిట్ లిస్టులో చోటు సంపాదించాలనుకునే అభ్యర్థులు  కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించినట్లు స‌ర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

ప్రమాణాలు పాటించడంలో విఫలమైన అభ్యర్థులను అకాడమీలో చేరడానికి అనుమతించరు.

కనీసం 8,300 మందిని ఇంటర్య్వూకి ఎంపిక చేయనున్నారు. 

ఇంటర్వ్యూలు బెంగళూరు\భోపాల్\విశాఖపట్నం\కోల్‌క‌తాలో నిర్వహిస్తారు.

పైలట్\అబ్జర్వర్ పోస్టులకు ఇంటర్వ్యూ బెంగళూరులోనే ఉంటుంది.

ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎమ్మెస్ ద్వారా సమాచారమిస్తారు.

ఎస్ ఎస్ బీ ఎంపిక ఎలా ఉంటుందంటే?

సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ ఎస్ బీ) ఎంపికలు  రెండు దశల్లో జరుగుతాయి.  అభ్యర్థుల ప్రణాళిక, నిర్వహణ సామర్థ్యాలు, సామాజిక స్పృహ మొదలైన అంశాలను ఇందులో పరిశీలిస్తారు. 

స్టేజ్ 1: ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ & డిస్కషన్ టెస్ట్

స్టేజ్ 2: సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్ & ఇంటర్వ్యూ

ఎస్ ఎస్ బీ ఇంటర్వ్యూ షెడ్యూల్: ఫిబ్రవరి 21, 2021 నుంచి.

కోర్సు ప్రారంభం: జూన్ 2021

శిక్షణ కేంద్రం: ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎజిమల, కేరళ.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో పంపాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరితేది: 31.12.2020

వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/
 

Posted Date : 19-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌