• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐఐటీలో డ్యూయల్‌ డిగ్రీ

కంప్యూటర్‌ సైన్స్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ కోర్సులకు పేరొందిన సంస్థ ఐఐఐటీ-హెచ్‌. బీటెక్, ఎంఎస్‌ అయిదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ; జనరల్‌ బీటెక్, లేటరల్‌ ఎంట్రీ విధానంలో బీటెక్, ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ సంస్థ ప్రకటన విడుదలచేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో ప్రవేశాలు లభిస్తాయి.  

హైదరాబాద్‌ ఐఐఐటీలో డ్యూయల్‌ డిగ్రీకి సంబంధించి మొత్తం 5 రకాల కోర్సులున్నాయి. 

ఈసీడీ: ఈ విభాగంలో చేరినవారు బీటెక్‌ పాటు ఎంఎస్‌లో ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ చదువుకుంటారు. 25 సీట్లు ఉన్నాయి. 

సీఎస్‌డీ:  కోర్సులో భాగంగా అయిదేళ్లూ బీటెక్, ఎంఎస్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విద్య అభ్యసిస్తారు. 35 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

సీఎల్‌డీ: బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ ఎంఎస్‌లో కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌ గురించి నేర్చుకుంటారు. ఈ విభాగంలో 15 సీట్లు కేటాయించారు. 

సీఎన్‌డీ: బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ ఎంఎస్‌లో కంప్యుటేషనల్‌ నేచురల్‌ సైన్సెస్‌ ఉంటాయి. ఇందులో 15 సీట్లు ఉన్నాయి.

సీహెచ్‌డీ: ఈ విభాగంలో చేరినవారు బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ ఎంఎస్‌లో కంప్యూటింగ్‌ అండ్‌ హ్యూమన్‌ సైన్సెస్‌ అభ్యసిస్తారు. మొత్తం 10 సీట్లు ఉన్నాయి.  

ప్రవేశం: అభ్యర్థులను అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (యూజీఈఈ) ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో సబ్జెక్టు ప్రొఫిషియన్సీ టెస్టు, రీజనింగ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఉంటాయి. సబ్జెక్టు ప్రొఫిషియన్సీ గంట, రీజరింగ్‌ ఆప్టిట్యూడ్‌ వ్యవధి రెండు గంటలు. ప్రశ్నలు ఇంటర్మీడియట్‌ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ఉంటాయి. రీజనింగ్‌ విభాగంలో అభ్యర్థుల్లోని క్లిష్టతా నైపుణ్యాలు, సృజనాత్మక సామర్థ్యం పరిశీలిస్తారు. నమూనా ప్రశ్నలు, మాక్‌ టెస్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.  

అర్హత: ఎంపీసీ గ్రూప్‌లో ఇంటర్‌ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ద్వితీయ సంవత్సరం కోర్సు చదువుతున్న విద్యార్థులూ అర్హులే. 

స్పెషల్‌ చానెల్‌ అడ్మిషన్‌

ఈ విధానంలో బీటెక్‌ సీఎస్‌ఈ, ఈసీఈ కోర్సులు చదువుకోవచ్చు. ఒక్కో విభాగంలో పదేసి చొప్పున సీట్లు ఉన్నాయి. ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు అర్హులు. ఈ కోర్సుల్లో చేరడానికి ఉడాన్‌ స్కీమ్‌లో ఎంపికవ్వాలి లేదా పదో తరగతి తర్వాత ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ నాలుగో సెమిస్టర్‌ చదువుతున్నవారై ఉండాలి. లేదా 11, 12 తరగతులు జవహర్‌ నవోదయ విద్యాలయల్లో చదివినవారై ఉండాలి. గంట వ్యవధితో సబ్జెక్టు ప్రొఫిషియన్సీ ఆన్‌లైన్‌ టెస్టు నిర్వహించి అర్హులకు ఇంటర్వ్యూ జరుపుతారు. 

లేటరల్‌ ఎంట్రీ

ఈ విధానంలో ప్రస్తుతం బీటెక్‌ ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఎంపికైనవారు నాలుగేళ్లపాటు బీటెక్, ఎంఎస్‌ కోర్సులు చదువుకుంటారు. సీఎస్‌ఈ, ఈసీఈ విభాగాల్లో అవకాశం ఉంది. ఈసీఈలో 15, సీఎస్‌ఈలో 20 సీట్లు ఉన్నాయి. జులై, 2021 నాటికి ద్వితీయ సంవత్సరం కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఇందులో చేరవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి బీటెక్‌ సీఎస్‌ఈ లేదా ఐటీ ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో ప్రవేశాలకు బీటెక్‌ ఈసీఈ/ ఈటీఈ/ ఈఐఈ/ ఈఈఈ ద్వితీయ సంవత్సర విద్యార్థులు అర్హులు. ఈ రెండు కోర్సుల్లోనూ ప్రవేశాలకు మూడో సెమిస్టర్‌ వరకు 80 శాతం మార్కులు లేదా 8 సీజీపీఏ తప్పనిసరి. పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒలింపియాడ్, కేవీపీవై విజేతలకు డ్యూయల్‌ డిగ్రీలో ప్రత్యేకంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. వీరిని ఇంటర్వ్యూతో కోర్సుల్లోకి తీసుకుంటారు. 

కోర్సు ఫీజు 

అభ్యర్థులు ఏ విభాగం ద్వారా చేరినప్పటికీ తొలి సంవత్సరం కోర్సు ఫీజు రూ.3 లక్షలు ఉంటుంది. సీటు పొందినవారు ఎలాంటి హామీ లేకుండా ఎస్‌బీఐ నుంచి రుణం పొందవచ్చు. 

ఐఐఐటీ-హెచ్‌ పూర్వ విద్యార్థుల సంఘం అవసరమైనవారికి ఫీజు చెల్లిస్తుంది. అయితే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నవారు కోర్సు పూర్తయి, ఉద్యోగంలోకి చేరిన తర్వాత మరో విద్యార్థికి ఫీజు చెల్లించాలి. రూ.8 లక్షల కంటే తక్కువ వార్షిక కుటుంబ ఆదాయం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: యూజీఈఈ మే 10. లేటరల్‌ ఎంట్రీ గడువు ముగిసింది..

పరీక్ష తేదీ: జూన్‌ 2

దరఖాస్తు ఫీజు: డ్యూయల్‌ డిగ్రీ రూ. 2000. స్పెషల్‌ చానెల్‌ అడ్మిషన్‌  రూ.500. ఒలంపియాడ్, కేవీపీవై రూ.1500.

వెబ్‌సైట్‌: http://ugadmissions.iiit.ac.in

Posted Date : 08-04-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌