• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐటీ కాన్పూర్‌లో  ఈ- మాస్టర్స్‌ కోర్సులు

ఇంజినీరింగ్‌ వృత్తి నిపుణులకు ఉన్నత చదువుల నిమిత్తం ఐఐటీ కాన్పూర్‌ ఈ-మాస్టర్స్‌ కోర్సులు ప్రారంభించింది. వీటిలో చేరడానికి గేట్‌ స్కోరు అవసరం లేదు. అకడమిక్‌ నేపథ్యం, ప్రొఫెషనల్‌ అనుభవం ఉంటే సరిపోతాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో కోర్సుల్లోకి తీసుకుంటారు. 

ఈ-మాస్టర్స్‌ కోర్సులను ఏడాది నుంచి మూడేళ్లలోగా పూర్తిచేసుకోవచ్చు. వారాంతాల్లో లైవ్‌ ఇంటరాక్టివ్‌ సెషన్లు నిర్వహిస్తారు. వీటిని పూర్తిచేసుకున్నవారు ఐఐటీ కాన్పూర్‌లో ఎంటెక్‌ లేదా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరితే 60 వరకు క్రెడిట్లను బదిలీ చేసుకోవచ్చు. అలాగే వీరికి ఐఐటీ అలమ్నై హోదా కల్పిస్తారు. కెరియర్‌ అడ్వాన్స్‌మెంట్, నెట్‌ వర్కింగ్‌లలో చోటు కల్పిస్తారు.  

ఇవీ కోర్సులు

1. కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌

2. సైబర్‌ సెక్యూరిటీ

3. డెరివేటివ్స్‌ మార్కెట్‌ ఖీ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌

4. పవర్‌ సెక్టార్‌ రెగ్యులేషన్, ఎకనామిక్స్‌ & మేనేజ్‌మెంట్‌

అర్హత: సంబంధిత బ్రాంచిలో బీటెక్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి. 

ఎంపిక విధానం: సెలక్షన్‌ టెస్టు, ఇంటర్వ్యూలతో దరఖాస్తులకు 

చివరి తేది: నవంబరు 2 దరఖాస్తు ఫీజు: రూ.1500 

వెబ్‌సైట్‌: https://emasters.iitk.ac.in/
 

Posted Date : 02-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌