• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బీఐఎస్‌లో 171 ఉద్యోగాలు

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) 171 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. వీటిలో గ్రూప్‌ ఎ, గ్రూప్‌ బి, గ్రూప్‌ సి విభాగాల్లో వివిధ హోదాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. సాధారణ డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ, స్కిల్‌ టెస్టు లేదా ఇంటర్వ్యూతో వీటిని భర్తీ చేస్తారు. 

ప్రకటించిన పోస్టుల్లో  అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 4, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ 17, పర్సనల్‌ అసిస్టెంట్‌ 16, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ 1, లైబ్రరీ అసిస్టెంట్‌ 1, స్టెనోగ్రాఫర్‌ 17, సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 79, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 36 ఉన్నాయి.

‣ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులకు సంబంధిత విభాగాల్లో పీజీతోపాటు పని అనుభవం అవసరం. ఇవి గ్రూప్‌ ఎ పరిధిలోకి వస్తాయి. 
‣ గ్రూప్‌ బి విభాగంలోని అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్, పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. 
‣ జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుకి పీజీలో హిందీ లేదా ఇంగ్లిష్‌ చదివుండాలి. 
‣ గ్రూప్‌ సిలో లైబ్రరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో లైబ్రరీ అసిస్టెంట్‌ పోస్టుకి డిగ్రీతోపాటు లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమా, మూడేళ్ల పని అనుభవం అవసరం. మిగిలిన పోస్టులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది.

పోస్టులను అనుసరించి కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్టు, షార్ట్‌ హ్యాండ్, టైప్‌ టెస్టుల్లో నిర్ణీత ప్రమాణాలను అందుకోవాలి.

వయసు: గ్రూప్‌ ఎ పోస్టులకు 35, గ్రూప్‌ బికి 30, సికి 27 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు: ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

వేతన శ్రేణి: గ్రూపు ఎ పోస్టులకు రూ.56,100 (లెవెల్‌ 10), గ్రూపు బి పోస్టులకు రూ.35,400 (లెవెల్‌ 6) మూలవేతనాలు ఉంటాయి.గ్రూపు సిలో లైబ్రరీ అసిస్టెంట్‌కు రూ.29,200 (లెవెల్‌ 5), స్టెనోగ్రాఫర్, సీనియర్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌లకు రూ.25,500 (లెవెల్‌ 4), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు రూ.19,900 (లెవెల్‌ 2) మూలవేతనం చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌...మొదలైనవి అదనంగా లభిస్తాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు: సెప్టెంబరు 26 సాయంత్రం 6 గంటలు.

ప్రవేశ పత్రాలు: అక్టోబరు 20 నుంచి అందుబాటులో ఉంటాయి.

పరీక్ష తేదీ: నవంబరు 8

పరీక్ష కేంద్రాలు: ఏపీలో విశాఖపట్టణం, విజయవాడ. తెలంగాణలో హైదరాబాద్‌. 

వెబ్‌సైట్‌: https://bis.gov.in/

ఎంపిక ఏ విధంగా?
అన్ని పోస్టులకూ ఆన్‌లైన్‌ పరీక్ష తప్పనిసరి. అదనంగా గ్రూప్‌ ఎ పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్‌ బిలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు టైప్‌ పరీక్ష ఉంటుంది. నిమిషానికి 35 ఇంగ్లిష్‌ లేదా 30 హిందీ పదాలు టైప్‌ చేయాలి. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు షార్ట్‌ హ్యాండ్‌ పరీక్ష ఉంటుంది. నిమిషానికి వంద పదాలు షార్ట్‌ హ్యాండ్‌లో రాయగలగాలి. వాటిని కంప్యూటర్‌లో నిర్ణీత వ్యవధిలో టైప్‌ చేయాలి. జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు అనువాదంలో ప్రాక్టికల్‌ స్కిల్‌ టెస్టు నిర్వహిస్తారు. లైబ్రేరియన్‌ పోస్టులకు లైబ్రరీ సైన్స్‌లో ప్రాక్టికల్‌ పరీక్ష ఉంటుంది. స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు షార్ట్‌హ్యాండ్‌ ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు. ఈ విధానంలో నిమిషానికి 80 ఇంగ్లిష్‌ లేదా హిందీ పదాలు రాయగలగాలి. సీనియర్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ స్కిల్‌ టెస్టులో అర్హత సాధించడం తప్పనిసరి. వర్డ్‌ ప్రాసెసింగ్‌ టెస్టులో భాగంగా 15 నిమిషాల్లో 2000 కీ డిప్రెషన్లు ఇవ్వగలగాలి. ఎక్సెల్, పవర్‌ పాయింట్‌ ఒక్కో దానిపైనా 15 నిమిషాలు చొప్పున పరీక్ష నిర్వహిస్తారు. జూనియర్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు టైప్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నిమిషానికి 35 ఇంగ్లిష్‌ లేదా 30 హిందీ పదాలు టైప్‌ చేయాలి. స్కిల్‌ టెస్టు/ టైప్‌ టెస్టులో అర్హత సాధిస్తే సరిపోతుంది.

పరీక్షలో: పోస్టును బట్టి పరీక్ష మారుతుంది. గ్రూపు ఎ, బి, సి పోస్టులవారీ ఒక్కో విభాగానికీ ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ అవేర్‌నెస్, సంబంధిత డొమైన్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 ప్రశ్నలు ఉంటాయి. గ్రూపు ఎ విభాగం ప్రశ్నలు పోస్టుగ్రాడ్యుయేషన్‌ స్థాయిలో, గ్రూపు బి, సి విభాగాల ప్రశ్నపత్రాలు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. తర్వాతి దశకు చేరుకోవడానికి పరీక్షలో 50 శాతం అంటే 75 మార్కులు సాధించడం తప్పనిసరి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.

Posted Date : 10-09-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌