• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐసీఎంఆర్‌లో అసిస్టెంట్‌ పోస్టులు

డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), న్యూదిల్లీ 80 అసిసెంట్స్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు వీటికి పోటీపడవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష, స్కిల్‌ టెస్టులో ప్రతిభ చూపినవారికి అవకాశం కల్పిస్తారు. ఇలా ఎంపికైనవారు ఐసీఎంఆర్‌ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరు మొదటి నెల నుంచే సుమారు రూ.యాభై వేలు వేతనం అందుకోవచ్చు. 

కరోనా నేపథ్యంలో ఐసీఎంఆర్‌ ప్రతి రోజూ వార్తల్లోకి రావడంతో దీని గురించి అందరికీ తెలిసింది. భారతదేశంలో వైద్యానికి సంబంధించి ఐసీఎంఆర్‌ ప్రామాణిక సంస్థ. ఆరోగ్యంపై ప్రభుత్వానికి సలహాలు అందిస్తుంది. ఈ సంస్థ మార్గదర్శకాలను ఆసుపత్రులు, వైద్యులు, ప్రజలు అనుసరిస్తున్నారు. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా అనుబంధ సంస్థలు, కేంద్రాలు ఉన్నాయి. వీటిలో నాన్‌ మెడికల్‌ కార్యకలాపాల నిమిత్తం సహాయకులు అవసరం. తాజా నోటిఫికేషన్‌ ద్వారా 80 అసిస్టెంట్ల (గ్రూప్‌ బి, లెవెల్‌ 6) పోస్టులను భర్తీచేస్తారు. ఇలా ఎంపికైనవారికి రూ.35,400 మూలవేతనం ఉంటుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అదనం. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే రూ.యాభై వేలకు పైగా వేతనం అందుకోవచ్చు. వీరు ఐసీఎంఆర్‌ దిల్లీతోపాటు ఇతర కేంద్రాల్లో కార్యాలయ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌టెస్టులో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. 

పరీక్ష ఇలా
కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షను ఆబ్జెక్టివ్‌ తరహాలో 80 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 80 నిమిషాలు. మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. జనరల్‌ ఇంటలిజెన్స్, జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (బేసిక్‌ అరిథ్‌మెటిక్‌), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (బేసిక్‌ నాలెడ్జ్‌) ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. విభాగాలవారీ సిలబస్‌ వివరాలు ప్రకటనలో పేర్కొన్నారు.  పరీక్షలో అర్హత సాధించడానికి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం (32) మార్కులు పొందాలి. మిగిలినవారు 50 శాతం (40) మార్కులు పొందడం తప్పనిసరి. ఇలా అర్హత సాధించినవారిని మెరిట్, రిజర్వేషన్ల వారీ ఒక్కో పోస్టుకు అయిదు మందిని చొప్పున స్కిల్‌టెస్టుకు ఆహ్వానిస్తారు. తుది నియామకాలు పరీక్ష, స్కిల్‌ టెస్టులో సాధించిన మార్కులతో మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం చేపడతారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టుకు 80, స్కిల్‌టెస్టుకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

ముఖ్యమైన అంశాలు
మొత్తం ఖాళీలు: 80 విభాగాలవారీ అన్‌ రిజర్వ్‌డ్‌ 33, ఓబీసీ 21, ఎస్సీ 12, ఎస్టీ 6, ఈడబ్ల్యుఎస్‌ 8. (ఈ 80 ఖాళీల్లోనే దివ్యాంగులకు 4 పోస్టులు సర్దుబాటు చేస్తారు). 
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ పరిజ్ఞానం (ఎంఎస్‌ ఆఫీస్, పవర్‌ పాయింట్‌) ఉండాలి. 
వయసు: డిసెంబరు 3 నాటికి 30 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 3, 2020
అడ్మిట్‌ కార్డులు: డిసెంబరు 21 నుంచి అందుబాటులో ఉంటాయి
ఆన్‌లైన్‌ పరీక్ష: జనవరి 3న  
పరీక్షలు: హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో నిర్వహిస్తారు
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యుఎస్‌లకు రూ.1200. మిగిలిన అందరికీ రూ.1500
వెబ్‌సైట్‌: https://www.icmr.gov.in
 

Posted Date : 11-11-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌