• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మీరూ చేస్తారా.. అణు ప‌రిశోధన!

బార్క్‌లో కొలువుల మేళా

కొత్త ఆవిష్క‌ర్త‌ల‌కు ఆహ్వానం..

దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన అణుపరిశోధన సంస్థ బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్‌(బార్క్). ఇది ముంబైకి సమీపంలోని ట్రాంబే అనే ప్రాంతంలో ఉంది. అణు శాస్త్రంలో విస్తృత పరిశోధనలు చేయడానికి కావలసిన అధునాతన పరికరాలు, వ్యవస్థ ఇందులో ఉంది. అణుశక్తిని ప్రధానంగా మానవాళి మేలు కోసం ఉపయోగించడానికి ఈ సంస్థ ప్రయోగాలు చేస్తుంది. విద్యుదుత్పత్తే బార్క్ ప్రధాన ఉద్దేశం. అలాగే యువ, ప్రతిభావంతులైన విద్యార్థులకు శాస్త్రీయ పరిశోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో మార్గనిర్దేశం చేసి కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు దోహదం చేస్తోంది. ఇందులో భాగంగానే భౌతిక, రసాయన, జీవశాస్త్ర రంగాలలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల‌ను అందిస్తోంది. అలాగే న్యూక్లియ‌ర్ రీసైకిల్ బోర్డ్ కింది స్టైపెండ‌రీ ట్రెయినీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పూర్తి వివ‌రాలు.. మీ కోసం..!

జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్)

​​​​​​మొత్తం ఫెలోషిప్ల సంఖ్య: 105

విద్యార్హ‌త‌లు:
ఎమ్మెస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ(ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత. 
అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా బీఎస్సీలో క‌నీసం 60 శాతం మార్కులు, ఎమ్మెస్సీలో 55శాతం, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, బీఎస్సీ, ఎమ్మెస్‌లో క‌నీసం 55శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
ఎమ్మెస్సీ చివ‌రి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు రాసి ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్న అభ్య‌ర్థులు కూడా అర్హులే. అయితే వారు త‌ప్ప‌కుండా బీఎస్సీ, ఎమ్మెస్సీ మొద‌టి సంవ‌త్స‌రం మార్కుల జాబితాల‌ను అప్లికేష‌న్‌తో జత చేయాలి.
అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసే తేదీ నాటికి 28 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి. ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్ల వ‌య‌సు మిన‌హాయింపు క‌ల్పించారు.

ద‌ర‌ఖాస్తు ఇలా..

చివ‌రి తేదీ: 15.1.2021
ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేయాలి. (https://recruit.barc.gov.in/)
ఒక‌రు ఒక‌టి కంటే ఎక్కువ ద‌ర‌ఖాస్తులు చేయ‌కూడ‌దు.
అప్లికేష‌న్ రుసుము: రూ.500, ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. (మ‌హిళ‌లు, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగుల‌కు రుసుము నుంచి మిన‌హాయింపు)
ద‌ర‌ఖాస్తు చేసేటప్పుడు చెల్లుబాటులో ఉన్న ఈమెయిల్, ఫోన్ నంబ‌రును పొందుప‌ర్చాలి.
అభ్య‌ర్థులు సంబంధిత డాక్యుమెంట్లు, స‌ర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది. 

ఎంపిక విధానం..

కింద సూచించిన అర్హత ప‌రీక్ష‌ల్లో సాధించిన వ్యాలిడ్ స్కోర్ ఆధారంగా ఇంట‌ర్వ్యూకి షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.

1) యూజీసీ-సీఎస్ఐఆర్‌నెట్ ఫెలోషిప్(స్లెట్/ లెక్చ‌ర‌ర్‌షిప్ వారు అర్హులు కారు) 

2) జ‌స్ట్ స్కోర్

3) ఐసీఎంఆర్‌జేఆర్ఎఫ్ టెస్ట్, ఐకార్‌జేఆర్ఎఫ్ టెస్ట్

4) డీబీటీ-జేఆర్‌బి బ‌యోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్

5) గేట్ స్కోర్ 2019/ 2020(ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ లైఫ్ సైన్సెస్/ బ‌యోటెక్నాల‌జీ)

ఇంట‌ర్వ్యూలో ప్ర‌తిభ ఆధారంగా చివ‌రి ఎంపిక ఉంటుంది.

ఎంపికైతే..

మొద‌టి రెండు సంవ‌త్స‌రాల‌కు స్టైపెండ్ నెల‌కు రూ.31,000 + హెచ్ఆర్ఏ రూ.7,440 (ఒక‌వేళ వ‌స‌తి క‌ల్పించ‌కుంటే). ఫెలోషిప్ పొడిగింపు అభ్య‌ర్థి ప‌ని విధానంపై ఆధార‌ప‌డి ఉంటుంది. ప్ర‌ద‌ర్శన బాగుంటే ఫెలోషిప్ గ‌డువు పెంచుతారు. సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలోషిప్(ఎస్ఆర్ఎఫ్) కింద మూడో సంవ‌త్స‌రం నుంచి స్టైపెండ్ రూ.35,000 + హెచ్ఆర్ఏ రూ.8,400 చెల్లిస్తారు. వీటితోపాటు కంటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ.40,000లు చెల్లిస్తారు. మొత్తంగా ఫెలోషిప్ ఐదు సంత్స‌రాలకు మించ‌దు.

వివిధ విభాగాల్లో నిర్వ‌హించాల్సిన ప్రాజెక్టులు..

భౌతిక శాస్త్రం

ఛార్జిడ్ పార్టికల్ యాక్సిలరేటర్ డెవలప్‌మెంట్, న్యూక్లియర్ ఫిజిక్స్ యూజింగ్ యాక్సిలరేటర్లు, న్యూట్రినో సంబంధిత ప్రయోగాలు, గామా-రే ఉపయోగించి ఆస్ట్రోఫిజిక్స్ టెలిస్కోపులు, ప్లాస్మా ఫిజిక్స్, లేజర్ బేస్డ్ ఫిజిక్స్, స్పెక్ట్రోస్కోపీ ఆఫ్ అటామ్స్ మరియు అణువులు, తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఘనీకృత పదార్థ భౌతిక శాస్త్రం, అధిక పీడనం మరియు అయస్కాంత క్షేత్రాలు, క్రిస్టల్లోగ్రఫీ, థిన్ ఫిలిమ్స్, నానో పదార్థాలు, ఆప్టిక్స్, సెన్సార్లు మరియు డిటెక్టర్ల భౌతిక శాస్త్రం, సింక్రోట్రోన్ రేడియేషన్ మరియు న్యూట్రాన్ వికీర్ణ ఆధారిత ప్రయోగాలు మరియు కంప్యూటేష‌న్ & సైద్ధాంతిక భౌతిక శాస్త్రం.

ర‌సాయన శాస్త్రం

న్యూక్లియర్ మ‌రియు రేడియోకెమిస్ట్రీ, ఆక్టినైడ్ కెమిస్ట్రీ, రేడియోఫార్మాస్యూటికల్స్, రేడియేషన్ ప్రాసెసింగ్, ఘన స్థితి మరియు అధిక ఉష్ణోగ్రత కెమిస్ట్రీ, న్యూక్లియర్ప ప‌దార్థాలు, నానో పదార్థాలు, ఎలక్ట్రోకెమిస్ట్రీ, స్పెక్ట్రోస్కోపీ, కెమిస్ట్రీ ఉపయోగించి లేజర్‌లు, అధునాతన విభజన పద్ధతులు, విశ్లేషణాత్మక శాస్త్రాలు, శక్తి మార్పిడి మరియు నిల్వ, రసాయన సెన్సార్లు, బయోమెటీరియల్స్, పాలిమర్లు, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ పదార్థాలు.

జీవ శాస్త్రం
మ్యుటేషన్ బ్రీడింగ్, ప్లాంట్ & అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, రేడియేషన్ ఎఫెక్ట్, ల‌క్ష‌ణాలు, రేడియో-నిరోధకత, ప్రొకార్యోటిక్ స్ట్రెస్ బయాలజీ, బయోరిమిడియేషన్, జన్యు ఇంజినీరింగ్, ఆహారం రేడియేషన్ చికిత్స, ఆహార సంరక్షణ & ప్యాకేజింగ్, బయోసెన్సర్లు, క్యాన్సర్ బయాలజీ & డయాగ్నస్టిక్స్, క్యాన్సర్ థెరప్యూటిక్స్, ఇమ్యునాలజీ, మైక్రోబయోమ్, టీబీ డయాగ్నస్టిక్స్ & చికిత్స, బయోఫిల్మ్స్ & బయోఫౌలింగ్, థర్మల్ ఎకాలజీ, ప్రోటీన్ల స్ట్రక్చరల్ బయాలజీ.

స్టైపెండ‌రీ ట్రెయినీ పోస్టులు


వివిధ విభాగాల్లో మొత్తం ఖాళీలు: 160

1) స్టైపెండ‌రీ ట్రెయినీ కేట‌గిరీ-1 (గ్రూప్-బి): 50 పోస్టులు

విభాగాలు, పోస్టులు: మెకానిక‌ల్(13), ఎల‌క్ట్రిక‌ల్(6), కెమిక‌ల్(7), సివిల్(13), ఎల‌క్ట్రానిక్స్(3), ఇనుస్ట్రుమెంటేష‌న్(4), కెమిస్ట్రీ(4).

అర్హత: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో క‌నీసం 60% మార్కుల‌తో మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్, క‌నీసం 60% మార్కుల‌తో బీఎస్సీ(కెమిస్ట్రీ ప్ర‌ధాన స‌బ్జెక్టుగా ఫిజిక్స్, మ్యాథ్స్ ఇతర స‌బ్జెక్టులుగా ఉండాలి) ఉత్తీర్ణత. 

2) స్టైపెండ‌ర్ ట్రెయినీ కేట‌గిరీ-2 (గ్రూప్-సీ): 106 పోస్టులు

ట్రేడులు, పోస్టులు: ప‌్లాంట్ ఆప‌రేట‌ర్(15), ఏసీ మెకానిక్(1), ఫిట్ట‌ర్(45), వెల్డ‌ర్(5), ఎల‌క్ట్రీషియ‌న్(6), ఎల‌క్ట్రానిక్ మెకానిక్(11), మెషినిస్ట్(3), ఇనుస్ట్రుమెంట్ మెకానిక్(13), వెల్డ‌ర్ త‌దిత‌రాలు(1), డీజిల్ మెకానిక్(3), గ్రిండ‌ర్ మెకానిక్(2), లేబొరేట‌రీ అసిస్టెంట్(1).

అర్హత: ప‌్లాంట్‌ ఆప‌రేట‌ర్, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ పోస్టుల‌కు క‌నీసం 60% మార్కుల‌తో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణత. మిగ‌తా పోస్టుల‌కు క‌నీసం 60% మార్కుల‌తో ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో సంబంధిత ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.

3) గ్రూప్-సీ పోస్టులు: 04

పోస్టులు: టెక్నీషియ‌న్ (బాయిల‌ర్ ఆప‌రేట‌ర్), టెక్నీషియ‌న్(పెయింట‌ర్).

అర్హత: క‌నీసం 60% మార్కుల‌తో సైన్స్, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత ట్రేడుల్లో స‌ర్టిఫికెట్ ఉండాలి.

కేట‌గిరీ-1 అభ్య‌ర్థుల‌కు వ‌య‌సు ప‌రిమితి: 18 నుంచి 24లోపు, కేట‌గిరీ-2 అభ్య‌ర్థుల‌కు 18 నుంచి 22 ఏళ్లలోపు
ఎస్సీ, ఎస్సీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్ల స‌డ‌లింపు.

ద‌ర‌ఖాస్తు ఎలా?
చివ‌రి తేదీ: 31.01.2021.
ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేయాలి.
గేట‌గిరీ-1 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థుల‌కు అప్లికేష‌న్ రుసుము రూ.150, కేట‌గిరీ-2 పోస్టుల‌కు రుసుము రూ.100(ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి). ఎస్సీ,ఎస్టీ, మ‌హిళ‌లు, దివ్యాంగుల‌కు రుసుము నుంచి మిన‌హాయింపు.
ద‌ర‌ఖాస్తు చేసేటప్పుడు చెల్లుబాటులో ఉన్న ఈమెయిల్, ఫోన్ నంబ‌రును పొందుప‌ర్చాలి.
అభ్య‌ర్థులు సంబంధిత డాక్యుమెంట్లు, స‌ర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది.

రాత ప‌రీక్ష విధానం:
కేట‌గిరీ-1 అభ్య‌ర్థుల‌కు..

రాత పూర్వక ప‌రీక్ష ఉంటుంది. గంట స‌మయంలో 40 ఆబ్జెక్టివ్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాలివ్వాలి. అభ్య‌ర్థులకు సంబంధించిన డిప్లొమా/ 

బీఎస్సీ సబ్జెక్టుల నుంచే ప్ర‌శ్న‌లుంటాయి. మూడు స‌రైన స‌మాధానాల‌కు ఒక మార్కు, ప్ర‌తి ఒక త‌ప్పు స‌మాధానికి ఒక మార్కు కోత విధిస్తారు. అర్హత సాధించిన  ఇంటర్య్వూకి ఎంపిక‌వుతారు. 

కేట‌గిరీ-2 అభ్య‌ర్థుల‌కు ఎంపిక మూడు విధానాల్లో ఉంటుంది. 

స్టేజ్-1(ప్రి‌లిమిన‌రీ టెస్ట్): ట‌్రేడింగ్‌లోని అన్ని విభాగాల వారికి ఒకే స్క్రీనింగ్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. గంట వ్య‌వ‌ధిలో 50 ఆబ్జెక్టివ్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం రాయాలి. మ్యాథ‌మెటిక్స్-20 ప్ర‌శ్న‌లు, సైన్స్-20 ప్ర‌శ్న‌లు, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్-10 ప్ర‌శ్న‌లు ఉంటాయి.  మూడు స‌రైన స‌మాధానాల‌కు ఒక మార్కు, ప్ర‌తి ఒక త‌ప్పు స‌మాధానికి ఒక మార్కు కోత విధిస్తారు. 

స్టేజ్-2(అడ్వాన్స్‌డ్ టెస్ట్): మొద‌టి స్టేజ్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు రెండో స్జేజ్‌కి అర్హత సాధిస్తారు. ఇందులోనూ 50 ప్ర‌శ్న‌ల‌కు రెండు గంటల స‌మ‌యంలో స‌మాధానాలివ్వాలి. మూడు స‌రైన స‌మాధానాల‌కు ఒక మార్కు, ప్ర‌తి ఒక త‌ప్పు స‌మాధానికి ఒక మార్కు కోత విధిస్తారు. ఇందులో మెరిట్ జాబితాను తీస్తారు. 

స్టేజ్-3(స్కిల్ టెస్ట్): రెండో స్టేజ్‌లో వ‌చ్చిన మార్కుల‌ను బ‌ట్టి తీసిన మెరిట్ జాబితా ఆధారంగా మూడో స్జేజ్‌కి ఎంపిక‌వుతారు.
స్కిల్ టెస్ట్ కోసం ఎంపిక చేసిన అభ్యర్థుల సంఖ్య స్టేజ్-2కి అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. స్కిల్ టెస్ట్.. గో\నో-గో ఆధారంగా ఉంటుంది.

రాత ప‌రీక్ష ముంబైలో నిర్వ‌హిస్తారు.

దేహ‌దారుఢ్య ప‌రీక్ష:

అభ్య‌ర్థి ఎత్తు: 160 సెం.మీ(క‌నీసం), బ‌రువు: 45.5కిలోలు(క‌నీసం)

ఎంపికైతే..

ట్రెయినింగ్ కాలం: 2 సంవ‌త్స‌రాలు

స్టైపెండ్ నెల‌కు:

కేట‌గిరీ-1 అభ్య‌ర్థులు: రూ.16,000(మొద‌టి ఏడాది), రూ.18,000(రెండో ఏడాది)

కేట‌గిరీ-2 అభ్య‌ర్థులు: రూ.10500(మొద‌టి ఏడాది), రూ.12500(రెండో ఏడాది)

శిక్షణ తారాపూర్\క‌ల్ప‌క్క‌మ్‌లో ఇస్తారు.

 ట్రెయినింగ్ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న అభ్య‌ర్థుల‌కు శిక్షణ చివ‌ర్లో ఇంట‌ర్య్వూ నిర్వ‌హించి సంస్థ ఉద్యోగిగా ప‌రిగ‌ణిస్తారు. 

ట్రెయినింగ్‌కు ఎంపికైన అభ్య‌ర్థులు మూడేళ్ల బాండ్ అగ్రిమెంట్ రాసివ్వాలి. 

Posted Date : 18-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌