• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్ డిగ్రీతో విప్రో కొలువులు

ఎలైట్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ (ఎన్‌టీహెచ్‌) - 2021 
 

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ విప్రో బీఈ/ బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ ఆఖరు సంవత్సరం చదువుతోన్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం ఎలైట్‌- 2021 పేరుతో పరీక్షలు నిర్వహించనుంది. ఎంపికైనవారికి రూ.3.5 లక్షల వార్షిక వేతనం దక్కుతుంది. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆహ్వానిస్తున్నారు.
 

ఎలైట్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ (ఎన్‌టీహెచ్‌)-2021 పేరుతో విప్రో దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ ఫ్రెషర్ల కోసం ప్రతిభాన్వేషణ పరీక్షకు సిద్ధమైంది. కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సర్క్యూటల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యుత్తమ నైపుణ్యాలున్నవారిని ఒడిసిపట్టడానికి వీటిని నిర్వహిస్తోంది. ఇలా ఎంపికైనవారికి ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ హోదా కేటాయిస్తారు. వీరికి రూ.3.5 లక్షల వార్షిక వేతనం అందుతుంది. ఈ విధానంలో చేరినవారు ఏడాది పాటు సంస్థలో కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం రూ.75,000 విలువైన ఒప్పందపత్రం రాసుకుంటారు.
 

అర్హత
పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. అలాగే బీటెక్‌/బీఈ/ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌లో 65 శాతం తప్పనిసరి. 2021లో బీటెక్‌ లేదా ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సులు పూర్తిచేసుకుంటున్నవారే అర్హులు. సీఎస్, ఐటీ, సర్క్యూటల్‌ బ్రాంచీలకు చెందిన విద్యార్థులకే అవకాశం ఉంది. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్‌ మధ్య అకడమిక్‌ విరామం మూడేళ్లకు మించరాదు. ఎంపిక ప్రక్రియ మొదలయ్యే సమయానికి ఎరియర్స్‌ ఉండరాదు. 
 

ఎంపిక ఇలా
ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌తో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం 128 నిమిషాల వ్యవధితో 3 సెక్షన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఆప్టిట్యూడ్, రిటర్‌ కమ్యూనికేషన్, ఆన్‌లైన్‌ ప్రోగ్రామింగ్‌ విభాగాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. పరీక్షలో అర్హత సాధించినవారికి టెక్నికల్, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిలోనూ ప్రతిభ చూపితే శిక్షణకు ఎంపికచేస్తారు. దాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు. 
 

పరీక్షలో...
ఆప్టిట్యూడ్‌: ఇందులో లాజికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ (వెర్బల్‌) ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 48 నిమిషాలు. 
రిటన్‌ కమ్యూనికేషన్‌: వ్యాసం రాయాలి. దీనికి 20 నిమిషాలు కేటాయించారు. 
ఆన్‌లైన్‌ ప్రోగ్రామింగ్‌: కోడింగ్‌లో 2 ప్రోగ్రామ్‌లు రాయాలి. ఇందుకోసం జావా, సీ, సీ++, పైతాన్‌ ..వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు.వ్యవధి 60 నిమిషాలు. 
 

గడువు ఎప్పుడు?
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 5
అసెస్‌మెంట్‌ పరీక్షలు: జనవరి 18 నుంచి 23 వరకు ఉంటాయి. 
వెబ్‌సైట్‌: https://careers.wipro.com/elite
 

ఇవీ చదవండి.


ఇతర ఉద్యోగాల నోటిఫికెషన్స్  కోసం  క్లిక్ చేయఁడి

Posted Date : 14-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌