• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఒత్తిడిని వదిలించుకోండి!

పరీక్షలు దగ్గర పడుతుంటే రకరకాల ఆలోచనలూ, ఒత్తిడితో సరిగా నిద్ర పట్టదు. దాంతో అనేక అనారోగ్య సమస్యలూ వస్తాయి. ఈ చిట్కాలు పాటిస్తే ఒత్తిడికి దూరంగా.. ప్రశాంతతకు దగ్గరగా ఉండొచ్చంటున్నారు నిపుణులు.  

కొంతమంది ఎక్కువ సబ్జెక్టులూ, వాటిలో ఎక్కువ చాప్టర్లూ చదివేసెయ్యాలనే పెద్ద లక్ష్యాలను పెట్టుకుంటారు. అది కుదరక నిరాశకు గురవుతుంటారు. అలాకాకుండా ఉండాలంటే ముందుగా చిన్న లక్ష్యాలను పెట్టుకుని అవి సాధించాక.. క్రమంగా పెద్ద లక్ష్యాల జోలికి వెళ్లాలి. 

చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. కానీ సమయం తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే చేయాల్సిన పనుల జాబితాను తయారుచేసుకుంటే ఒత్తిడి కాస్త తగ్గుతుంది.

టైమ్‌ టేబుల్‌ వేసుకుంటే ఒత్తిడి నియంత్రణలో ఉంటుంది. సబ్జెక్టుల క్లిష్టతబట్టి సమయం కేటాయించేలా టైమ్‌ టేబుల్‌ వేసుకోవాలి. 

స్నేహితుల్లో కొందరు ఎప్పుడూ ప్రతికూలంగానే ఆలోచిస్తుంటారు. అలాంటివారి మాటలు మన మీదా ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తాయి. అంతేకాదు, మనలో ఒత్తిడినీ పెంచేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకూ ఇలాంటివారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. 

జరిగిన విషయాల గురించీ, జరగబోయే వాటి గురించీ ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి వర్తమానంలో మాత్రమే జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి. 

‘నేనింతే.. ఇలాగే ఉంటా. నేను మారను’ అని కూర్చోవడం వల్ల పనులు కావు. ఒత్తిడీ పెరుగుతుంది. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ప్రయత్నించాలి. 

సమయ నిర్వహణ తెలిస్తే ఒత్తిడికి గురికారు. ఏ పనికి ఎంత సమయం అవసరమో అంతే కేటాయించాలి. 

‘కాదు’ అని చెప్పలేని మొహమాటంతో ఒత్తిడి పెరిగిపోతుంది. మీరు చదువుకోవాలనుకుంటారు. స్నేహితులేమో కొత్త సినిమా వెంటనే చూడాలంటారు. ఇలాంటి పరిస్థితుల్లో  కచ్చితంగా ‘నో’ చెప్పడం వల్ల ఒత్తిడి ఉండదు. 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌