• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గూగుల్‌లో అప్రెంటిస్‌షిప్‌ చేస్తారా?

డిగ్రీ పాసైన వారికి మంచి అవకాశం

డిగ్రీ అర్హతతో ఐటీ రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నారా? అందుకు చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది. సెర్చ్‌ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌. ఇటీవల గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకున్న విద్యార్థుల కోసం గూగుల్‌ హైదరాబాద్‌ ‘అప్రెంటిస్‌షిప్‌ ప్రోగ్రాం’ను ప్రకటించింది. డిజిటల్‌ మార్కెటింగ్, డేటా ఎనలిటిక్స్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, ఐటీ విభాగాల్లో తమ నైపుణ్యాలను పెంచుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ ప్రోగ్రాంలో చేరవచ్చు. 

ఇది ఫుల్‌టైమ్‌ ఉద్యోగావకాశం కాకపోయినా ఐటీ రంగంలో ప్రవేశించాలనుకునేవారు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోడానికి ఉపకరిస్తుంది. ఇప్పటికే ఈ రంగంలో పనిచేస్తున్నవారైతే తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ చక్కని అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. 

డిజిటల్‌ మార్కెటింగ్‌లో..

డిగ్రీ చదివినవారు అర్హులు. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ఏడాది కంటే తక్కువ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్ప్రెడ్‌షీట్స్, వర్డ్‌ప్రాసెసర్స్‌ ఉపయోగించడంలో అనుభవం ఉండాలి. ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ఎనలిటికల్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, నిర్దేశిత లక్ష్యాలను సాధించాలనే తపన ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. 
నేర్పించేవి: సుశిక్షతులైన గూగుల్‌ బృందంతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. అనుభవజ్ఞులైన టీమ్‌ లీడర్ల ఆధ్వర్యంలో ప్రత్యేకమైన శిక్షణ అందుతుంది. బేసిక్‌ మార్కెటింగ్‌ ప్రిన్సిపల్స్, సెర్చ్‌ మార్కెటింగ్, పే-పర్‌-క్లిక్‌ లాంటి ఎన్నో విషయాలను  నేర్చుకుంటారు. పరిశోధన, వెబ్‌ ఎనలిటిక్స్‌లో అనుభవం సంపాదించే నేర్పు అలవడుతుంది. ఈ కోర్సు హైదరాబాద్, బెంగళూరు, గుర్‌గావ్, ముంబయిలో అందుబాటులో ఉంటుంది. 

లింకు: https://careers.google.com/jobs/results/114635695642813126-digital-marketing-apprenticeship-march-2022-start/

ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌లో..

ఈ కోర్సు కాలవ్యవధి 24 నెలలు. డిగ్రీ/ డిప్లొమా/ తత్సమాన పని అనుభవం ఉండాలి. డేటా ఎనలిటిక్స్‌లో ఏడాదిలోపు అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం. స్ప్రెడ్‌షీట్స్, వర్డ్‌-ప్రాసెసర్స్‌లాంటి టూల్స్‌ వాడకంలో అనుభం ఉండాలి. ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ఎనలిటికల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. నిపుణుల మార్గదర్శకత్వంలో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఆసక్తి ఉండాలి. 

నేర్పించేవి: సాధారణ విద్యకు, సాంకేతిక పరిజ్ఞానానికి మధ్య వారధిలా ఈ ప్రోగ్రామ్‌ పనిచేస్తుంది. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ను నేర్పిస్తారు. శిక్షణానంతరం ఈ స్కిల్స్‌ను ఉపయోగించి ప్రాజెక్టులను పూర్తిచేసే నైపుణ్యం అభ్యర్థులకు అలవడుతుంది. . 
హైదరాబాద్, బెంగళూరు, గుర్‌గావ్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. 

లింకు: https://careers.google.com/jobs/results/82975258321003206-project-management-apprenticeship-march-2022-start/

డేటా ఎనలిటిక్స్‌లో...

డిగ్రీ/డిప్లొమా/తత్సమాన పని అనుభవం ఉండాలి. డేటా ఎనలిటిక్స్‌లో ఏడాదిలోపు అనుభవం ఉండాలి. స్ప్రెడ్‌షీట్‌ సాఫ్ట్‌వేర్, ఈమెయిల్, వర్డ్‌ ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. డేటా ఎనాలిసిస్‌లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. నంబర్స్‌/ప్యాట్రన్స్‌తో పనిచేయడానికి ఆసక్తి ఉండాలి. ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ఎనలిటికల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. ఒంటరిగానూ, బృంద సభ్యుడిగా పనిచేసే నేర్పు ఉండాలి. అవసరమైన సూచనలు, సలహాలు తీసుకుంటూ నిర్దేశిత లక్ష్యాలను సాధించే నేర్పు ఉన్నవారికి ప్రాధాన్యం. 

నేర్పించేవి: అవసరమైన డేటా ఎనాలిసిస్‌ నైపుణ్యాలను నేర్పిస్తారు. స్ప్రెడ్‌షీట్స్, ఎస్‌క్యూఎల్, ఆర్‌ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు తెలుసుకుంటారు. గూగుల్‌ నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, గుర్‌గావ్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌ కాలవ్యవధి 24 నెలలు. 

లింకు: https://careers.google.com/jobs/results/143146032151044806-data-analytics-apprenticeship-march-2022-start/

ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో...

ఈ కోర్సు కాలవ్యవధి 12 నెలలు. డిగ్రీ/ డిప్లొమా/ తత్సమాన పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు. స్ప్రెడ్‌షీట్‌ సాఫ్ట్‌వేర్, ఈమెయిల్, వర్డ్‌ ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం. ప్రాబ్లమ్‌-సాల్వింగ్, ఎనలిటికల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో నైపుణ్యం ఉండాలి. స్వతంత్రంగాను, బృంద సభ్యుడిగాను పనిచేసే నేర్పు అవసరం.  

నేర్పించేవి: నిపుణులైన గూగుల్‌ బృందంతో పనిచేసే అవకాశం లభిస్తుంది. ట్రబుల్‌ షూటింగ్‌ మల్టిపుల్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫామ్స్, డేటా గేదరింగ్‌ అండ్‌ ఎనాలిసిస్, ఆటోమేటింగ్‌ రెస్పెక్టివ్‌ టాస్క్స్, రిమోట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఫ్లీట్‌ మేనేజ్‌మెంట్, ఐటీ సెక్యూరిటీ అండ్‌ పాలసీస్, ఇండస్ట్రీ ప్రాక్టీసెస్‌లో శిక్షణ ఇస్తారు. కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (వీడియో, వాయిస్‌), హార్డ్‌వేర్, మొబైల్‌ డివైజెస్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలనూ నేర్పిస్తారు. ఈ ప్రోగ్రామ్‌ గూగుల్‌ హైదరాబాద్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

లింకు: https://careers.google.com/jobs/results/96944956741952198-information-technologyapprenticeship-march-2022-start/

ఈ ప్రోగ్రామ్‌లన్నీ మార్చి-2022లో ప్రారంభమవుతాయి. 

దరఖాస్తు చేయడానికి చివరి తేది డిసెంబరు 2.

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పది ప్రశ్నలతో పరీక్షిద్దాం!

‣ ప్రతి విషయానికీ అతిగా ఆలోచనలా?

Posted Date : 30-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌