• facebook
  • twitter
  • whatsapp
  • telegram

దేశంలో స్టార్ట‌ప్‌ల‌కు భారీ పెట్టుబ‌డులు

 2020లో 1014 కోట్ల డాలర్ల పెట్టుబడులు

 బెంగళూరు, దిల్లీ, ముంబయి సంస్థ‌లకే 90% నిధులు

ఏంజెల్‌ పెట్టుబడుదార్ల ఆసక్తి వాటిపైనే

కన్సల్టింగ్‌ సంస్థ‌ హెక్స్‌జెన్‌  

భారత అంకురాలకు 2020లో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని కన్సల్టింగ్‌ సంస్థ‌ హెక్స్‌జెన్‌ అంటోంది. 1200 పైగా ఒప్పందాల ద్వారా 1014 కోట్ల డాలర్ల (సుమారు రూ.76,000 కోట్ల) వరకు నిధులు అందాయని పేర్కొంది. 2019లో వచ్చిన 1450 కోట్ల డాలర్లతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, ఒప్పందాల సంఖ్య 20 శాతం ఎక్కువగా ఉందని చెబుతోంది.  

ప్రతికూల సెంటిమెంటు నేపథ్యంలోనూ సీడ్‌ పెట్టుబడుల ఒప్పందాలు 50 శాతం పెరిగాయి. 2019లో 420 (353 మిలియన్‌ డాలర్ల నుంచి) ఒప్పందాలు జరగ్గా, 2020లో 672కు పైగా(372 మిలియన్‌ డాలర్లకు) జరిగాయి.

ప్రజలు అంకురాల వైపు చూస్తుండడం మంచి సంకేతం. ప్రారంభ దశ పెట్టుబడుదార్లు మళ్లీ నిధులు అందించడానికి సిద్ధమయ్యారు. 

ఇన్వెస్ట్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, అగ్ని తదితర కార్యక్రమాల ద్వారా పెట్టుబడుదార్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల విశ్వాసాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. దీని వల్లే అమెరికా, చైనా, బ్రిటన్‌ తర్వాత అంతర్జాతీయంగా నాలుగో స్థానాన్ని వరుసగా మూడో ఏడాదీ భారత్‌ పొందింది.

అంతర్జాతీయంగా అంకురాలు 30800 కోట్ల డాలర్ల నిధులు సమీకరించగా, అందులో అమెరికా ఒకటే 16800 కోట్ల డాలర్లను ఆకర్షించగలిగింది. 

దేశంలోని 90 శాతం అంకుర పెట్టుబడులు.. బెంగళూరు, దిల్లీ ఎన్‌సీఆర్, ముంబయిలకే వెళుతున్నాయి. ఏంజెల్‌ పెట్టుబడుదార్ల ఆసక్తి ఈ ప్రాంతాల్లోనే ఉన్నట్లు అరమవుతోంది.

ఇ-కామర్స్‌ విభాగం అత్యధికంగా 300 కోట్ల డాలర్లు సమీకరించగలిగింది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్‌టెక్‌ (237 కోట్ల డాలర్లు), ఎడ్‌టెక్‌ (152 కోట్ల డాలర్లు) ఉన్నాయి. 2019లో ఎడ్‌టెక్‌లోకి 380 మి. డాలర్లే రాగా.. ఈసారి నాలుగింతల వృద్ధి నమోదైంది.

రవాణా, ప్రయాణ, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు మాత్రం 2019తో పోలిస్తే 2020లో 90 శాతం క్షీణత కనిపించింది.

జొమోటో(102 కోట్ల డాలర్లు), బైజూస్‌(922 మిలియన్‌ డాలర్లు), ఫోన్‌పే(807 మిలియన్‌ డాలర్లు), అన్‌అకాడమీ(260 మి. డాలర్లు), ఇకామ్‌ ఎక్స్‌ప్రెస్‌(250 మి. డాలర్లు)లకు ఎక్కువ నిధులు వచ్చాయి. (జియో ప్లాట్‌ఫామ్స్‌కు వచ్చిన రూ.1.52 లక్షల కోట్లను ఇందులో కలపలేదు.) 

Posted Date : 27-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌