• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఈ సంస్థ‌ల్లో చేసేయండి ఇంట‌ర్న్‌షిప్‌

నైపుణ్యాల వృద్ధికి అవ‌కాశం

వేసవిలో ఇంటర్న్‌షిప్‌ చేద్దామనుకునే విద్యార్థులకు ఇంటర్న్‌శాల సంస్థ ఓ అవకాశం తీసుకొచ్చింది. ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ చేసే వీలు కల్పిస్తోంది. ‘గ్రాండ్‌ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ఫేర్‌’ పేరిట వీటిని అందిస్తోంది. 3500కుపైగా సంస్థల్లో 44,000కుపైగా ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

సుప్రసిద్ధ సంస్థల్లో విజయవంతంగా ఇంటర్న్‌షిప్‌ చేస్తే మెరుగైన నైపుణ్యాలతోపాటు శాశ్వత ఉద్యోగ అవకాశాన్నీ కల్పిస్తుంది. అందుకే కొన్ని కోర్సులకు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి కూడా! విద్యార్థి దశలోనే పని వాతావరణాన్ని పరిచయం చేయడమూ వీటి ఉద్దేశం. అందుకే ప్రముఖ ఇంటర్న్‌షిప్‌ వేదిక- ఇంటర్న్‌శాల ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్ని కల్పిస్తోంది. ‘గ్రాండ్‌ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ఫేర్‌’ పేరిట వీటిని అందుకునే అవకాశం కల్పిస్తోంది.

ఏ సంస్థలు?

పర్సెప్ట్‌ లిమిటెడ్, హెచ్‌సీఎల్, వన్‌ ప్లస్, ఫిక్కీ, జస్ట్‌ డయల్, దైనిక్‌ భాస్కర్, ఫ్యాషన్‌ టీవీ, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ గువాహటి, నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్, ద ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్, అశోకా ట్రస్ట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ, ఏర్‌టెల్, డెలివరీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్, అర్బన్‌ కంపెనీ, కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్, ఓయో రూమ్స్, ఎకనామిక్‌ టైమ్స్‌ మొదలైన 3500కుపైగా సంస్థలు దీనిలో భాగస్వాములయ్యాయి. మొత్తంగా 44,000కుపైగా ఇంటర్న్‌షిప్‌లను ఈ ఫేర్‌ ద్వారా అందించనున్నారు.

ఏ ఇంటర్న్‌షిప్‌లు?

అన్నిరకాల విద్యా నేపథ్యాలున్నవారికీ ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. వర్క్‌ ఫ్రం హోం, ఇన్‌ ఆఫీస్, ఇంటర్న్‌షిప్‌తో జాబ్‌ ఆఫర్‌ వంటివి వీటిలో భాగం. విద్యార్థి తన ఆసక్తి మేరకు తగినదాన్ని ఎంచుకోవచ్చు. వెబ్‌ డెవలప్‌మెంట్, కంటెంట్‌ రైటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, హ్యూమన్‌ రిసోర్సెస్, ఆపరేషన్స్‌ మొదలైనవాటిలో ఇంటర్న్‌షిప్‌లు లభిస్తాయి. కాలవ్యవధి నెల నుంచి ఆరు నెలలు. ఎంపికైనవారికి సర్టిఫికెట్‌లతోపాటు గరిష్ఠంగా లక్షన్నర రూపాయలవరకూ స్టైపెండ్‌ను అందజేస్తారు.

ఎంపిక ఎలా?

ఇంటర్న్‌శాల అధికారిక వెబ్‌సైట్‌లో పేరు, వివరాలతో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఈమెయిల్‌ వెరిఫై చేసుకున్నాక ఫేర్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేకమైన విద్యార్హతలేమీ లేవు. ఇంటర్న్‌షిప్‌ ఆసక్తి ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఆధారంగా సంస్థలు అభ్యర్థిని ఎంపిక చేస్తాయి. వారికి ఆపై ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అందులోనూ అర్హత సాధిస్తే ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తారు. ఒక్కదానికే దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనేమీ లేదు. నచ్చిన వాటన్నింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్‌ 9, 2021

అదనపు వివరాలకు https://internshala.com/the-grand-summer-internship-fair ను సందర్శించవచ్చు.

Posted Date : 06-04-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌