• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంజినీర్ల‌కు... ఇదిగో ఆహ్వానం!

బెల్ నుంచి నాలుగు ప్ర‌క‌ట‌న‌లు
 

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) 1059 ఇంజినీర్, ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి 4 ప్రకటనలు వెలువరించింది. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు, మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదివినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులనుంచి అర్హులను ఎంపిక చేస్తారు.
 

జూనియర్‌ ఇంజినీర్‌-(1)/ ట్రెయినీ ఆఫీసర్‌కు ఎంపికైనవారు ఏడాది పాటు విధుల్లో కొనసాగుతారు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థి సమర్థత ప్రాతిపదికన మరికొన్నాళ్లు సేవలు పొడిగిస్తారు. వీరు గరిష్ఠంగా మూడేళ్లు పాటు ఉద్యోగంలో ఉంటారు. ట్రెయినీ ఇంజినీర్‌-2 పోస్టులకు ఎంపికైనవారు ఏడాది నుంచి గరిష్ఠంగా మూడేళ్ల పాటు కొలువులో ఉంటారు. ప్రాజెక్టు ఇంజినీర్‌/ ప్రాజెక్టు ఆఫీసర్‌గా ఎంపికైనవారు రెండేళ్ల ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వర్తించాలి. అవసరాలు, సమర్థత ప్రాతిపదికన ఈ వ్యవధిని మరో రెండేళ్లు పొడిగిస్తారు. ఎంపికైనవారంతా దేశంలో ఏ చోట నుంచైనా తమ సేవలు అందించాల్సి ఉంటుంది. 
 

ఎంపిక విధానం 
అకడమిక్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఉంటుంది. 10 మార్కులు అనుభవానికి, 15 ఇంటర్వ్యూకు కేటాయించారు. కనీస అనుభవం ఉన్నవారికి 2.5 మార్కులు ఇస్తారు. ప్రతి ఆరు నెలల అదనపు అనుభవానికీ 1.25 మార్కులు చొప్పున కలుస్తాయి. ఇలా గరిష్ఠంగా 10 మార్కులు వేస్తారు. అకడమిక్‌ బోధన, పరిశోధన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోరు. అప్రెంటిస్‌గా పనిచేసినవారు అర్హులే. వచ్చిన దరఖాస్తులకు సంబంధిత వివరాల ప్రకారం మార్కులు వేసి, మెరిట్‌ ప్రకారం ఒక్కో పోస్టుకీ అయిదు మందిని చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైనవారి వివరాలు బెల్‌ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అభ్యర్థులకు ఈ-మెయిల్‌ ద్వారా వర్తమానం అందిస్తారు. వీరికి నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిని ప్రత్యక్షంగా లేదా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆయా నోటిఫికేషన్లవారీ విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  
 

నోటిఫికేషన్‌ సంఖ్య: 3
మొత్తం ఖాళీలు: 549. 
పోస్టు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ 
ఖాళీలు: 118. ఎల్రక్టానిక్స్‌ 80, మెకానికల్‌ 24, కంప్యూటర్‌ సైన్స్‌ 6, ఎలక్ట్రికల్‌ 6, సివిల్‌ 2. 
అర్హత: సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. 
వయసు: అక్టోబరు 1, 2020 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. పోస్టు: ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఖాళీలు: 5 
అర్హత: హ్యూమన్‌ రిసోర్సెస్‌లో ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యు/పీజీ/పీజీ డిప్లొమా ప్రథమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణత. పై పోస్టులకు రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి.
పోస్టు: ట్రెయినీ ఇంజినీర్‌-(1) 
ఖాళీలు: 418. విభాగాలవారీ...ఎల్రక్టానిక్స్‌ 254, మెకానికల్‌ 137, కంప్యూటర్‌ సైన్స్‌ 11, ఎలక్ట్రికల్‌ 10,. సివిల్‌ 2, ఎన్విరాన్‌మెంటల్‌ 1, ఆర్కిటెక్చర్‌ 1, కెమికల్‌ 2. అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత 
వయసు: అక్టోబరు 1, 2020 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి. 
పోస్టు: ట్రెయినీ ఆఫీసర్‌ (ఫైనాన్స్‌) 
ఖాళీలు:
అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఎంబీఏ (ఫైనాన్స్‌) ఉత్తీర్ణత. పై పోస్టులకు సంబంధిత విభాగాల్లో 6 నెలల పని అనుభవం తప్పనిసరి. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 25
 

నోటిఫికేషన్‌ సంఖ్య: 4
ఇందులో మొత్తం 225 పోస్టులు భర్తీ చేస్తారు. ట్రెయినీ ఇంజినీర్‌-(1) 100, ప్రాజెక్టు ఇంజినీర్‌ 125 ఖాళీలు ఉన్నాయి. ట్రెయినీ ఇంజినీర్‌ విభాగంలో అన్‌ రిజర్వ్‌డ్‌ 40, ఓబీసీ 27, ఎస్సీ 15, ఎస్టీ 8, ఈడబ్ల్యుఎస్‌ 10 ఖాళీలు కేటాయించారు. ప్రాజెక్టు ఇంజినీర్లకు సంబంధించి అన్‌ రిజర్వ్‌డ్‌ 49, ఓబీసీ 33, ఎస్సీ 20, ఎస్టీ 10, ఈడబ్ల్యుఎస్‌ 13 పోస్టులు ఉన్నాయి. అర్హతలు, వయసు, అనుభవం...అన్నీ పై ప్రకటన మాదిరిగానే ఉంటాయి. నవంబరు 21లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
 

నోటిఫికేషన్‌ సంఖ్య: 5
ఈ ప్రకటన ద్వారా ట్రెయినీ ఇంజినీర్‌-(2) 160 పోస్టులు భర్తీ చేస్తారు. ఇందులో జనరల్‌ 66, ఓబీసీ 44, ఎస్సీ 23, ఎస్టీ 12, ఈడబ్ల్యుఎస్‌ 15 ఖాళీలు ఉన్నాయి. వీరికి నవంబరు 1 నాటికి 28 ఏళ్లలోపు వయసు ఉండాలి. అలాగే రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. ఈ పోస్టులకు ప్రథమ శ్రేణి మార్కులతో సంబంధిత విభాగాల్లో బీటెక్‌ లేదా ఎంసీఏ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 21.
 

నోటిఫికేషన్‌ సంఖ్య: 6
ఈ ప్రకటనతో 125 పోస్టులు భర్తీ చేస్తారు. వీటిలో ట్రెయినీ ఇంజినీర్‌-(1) 33, ట్రెయినీ ఇంజినీర్‌-(2) 60, ప్రాజెక్టు ఇంజినీర్‌ 29, ట్రెయినీ ఆఫీసర్‌ 2, ప్రాజెక్టు ఆఫీసర్‌ 1 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు, వయసు అన్నీ ఇతర నోటిఫికేషన్ల మాదిరిగానే ఉంటాయి. వయసు నవంబరు 1 నాటికి లెక్కిస్తారు. నవంబరు 25లోగా దరఖాస్తు చేసుకోవాలి. అన్ని పోస్టులకూ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు సడలింపులు వర్తిస్తాయి. అలాగే వీరు సంబంధిత కోర్సుల్లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. 
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్టు ఇంజినీర్‌ / ఆఫీసర్‌ పోస్టులకు రూ. 500. ట్రెయినీ ఇంజినీర్‌ / ఆఫీసర్లకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.  
వెబ్‌సైట్‌: https://bel-india.in

Posted Date : 16-11-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.