• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీకి ‘జస్ట్’ చాలు

2021 సంవత్సరానికి ప్రకటన విడుదల

ఆకాశంలోకి దూసుకుపోయే రాకెట్లు... కనువిందు చేసే లేజర్‌ మెరుపులు...నేల నుంచి నింగిని చూపే టెలిస్కోప్‌లు...ఒకటేమిటి ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రతి పరికరానికీ మూలాలు భౌతికశాస్త్ర సిద్ధాంతాలే. దేశసాంకేతిక ప్రగతికి ఫిజికల్‌ సైన్సే ప్రధాన ప్రమాణం. టాటా ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ఫండమెంటల్‌రిసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్‌) భారతదేశంలో ప్రధాన ఆధునిక పరిశోధనా సంస్థ‌. ఇది ప్రపంచస్థాయి సౌకర్యాలతో కూడిన పరిశోధనలకు కేంద్ర బిందువు. ఔత్సాహిక విద్యార్థులు శాస్త్రవేత్తలుగా తమ పరిశోధనలను ప్రారంభించడానికి చక్కటి వేదిక. అందులో భాగంగానే నేషనల్‌సెంటర్‌ఫర్‌రేడియో ఆస్ట్రోఫిజిక్స్ - టాటా ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ఫండమెంటల్‌రిసెర్చ్‌(ఎన్‌సీఆర్‌ఏ-టీఐఎఫ్‌ఆర్‌) ఆధ్వర్యంలో వివిధ విద్యాసంస్థ‌ల్లో చేరడానికి నిర్వహించే జాతీయ స్థాయి పరీక్షే జాయింట్‌ఎంట్రెన్స్‌స్క్రీనింగ్‌టెస్ట్‌(జస్ట్‌).  జస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే సంబంధిత సంస్థ‌ల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌పీహెచ్‌డీ(ఫిజిక్స్‌), థియారిటికల్‌కంప్యూటర్‌సైన్స్, న్యూరో సైన్స్, కంప్యూటేషనల్‌బయోలజీలో ప్రవేశాలు పొందవచ్చు. కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ.12,000 చొప్పున రెండేళ్లు   స్టెపెండ్‌ అందుతుంది. అనంతరం జేఆర్‌ఎఫ్‌లో భాగంగా నెలకు రూ.31,000 చెల్లిస్తారు. ఎస్‌ఆర్‌ఎఫ్‌లో రూ.35,000 చొప్పున ఇస్తారు. నేరుగా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరినవారికి మొదటి రెండేళ్లు రూ.31,000,  తర్వాత రెండేళ్లు రూ. 35,000 అందుతాయి. వీటితోపాటు ఉచితంగా వసతి కల్పిస్తారు లేదా హెచ్‌ఆర్‌ఏ అందిస్తారు.  ఈ ఏడాది చివరి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా జస్ట్‌కు అర్హులే. ఒక్కో క‌ళాశాలలో కోర్సు, అర్హతను బ‌ట్టి నిబంధ‌న‌లు వేర్వేరుగా ఉన్నాయి.‌

దరఖాస్తు ఇలా..

జస్ట్‌పరీక్షకు విద్యార్థులు కచ్చితంగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ జనవరి 11, 2021న ప్రారంభ‌మై ఫిబ్రవరి 14, 2021న ముగుస్తుంది. ఏప్రిల్ 11, 2021న పరీక్ష నిర్వహిస్తారు. జనరల్‌కేటగిరీ విద్యార్థులు దరఖాస్తు రుసుం కింద రూ.400, ఎస్సీ, ఎస్టీ, మహిళలు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ప‌రీక్ష‌రుసుం ఆన్‌లైన్‌ద్వారా మాత్ర‌మే చెల్లించాలి.

పరీక్ష విధానం..

పరీక్ష ఆఫ్‌లైన్‌విధానంలో నిర్వహిస్తారు. మూడు గంటల సమయంలో మొత్తం 50 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నాప‌త్రంలో పార్ట్‌ఎ,బి, సి అని మూడు విభాగాలు ఉంటాయి. పార్ట్‌ఎ లో 15, పార్ట్‌బిలో 10, పార్ట్‌సిలో 25 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. పార్ట్‌ఎ, బిలో సరైన సమాధానికి మూడు మార్కుల చొప్పున, పార్ట్‌సి లో ఒక మార్కు చొప్పున కేటాయించారు. తప్పు సమాధానాలకు రుణాత్మ‌క‌‌ మార్కులు ఉంటాయి. పార్ట్‌ఎలో ఒక మార్కు, పార్ట్‌సిలో 1/3 మార్కు కోత విధిస్తారు. పార్ట్‌బి లో నెగెటివ్‌మార్కులు ఉండవు. ప్ర‌శ్న‌లు ఇంగ్లిష్‌భాషలో ఉంటాయి.

సిద్ధ‌మ‌వ్వండిలా..

జస్ట్‌ ప్రశ్నపత్రం డిగ్రీ ఫిజిక్స్‌ సిలబస్‌కు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి అభ్యరులు పై అంశాలకు సంబంధించి మూడేళ్ల డిగ్రీ పుస్తకాలను బాగా అధ్యయనం చేయాలి. ప్రాథమికాంశాలపై పట్టు కోసం ఇంటర్‌ ఫిజిక్స్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదవుకోవాలి. వీటిని పూర్తిచేసిన తర్వాతే డిగ్రీ పుస్తకాలపై  దృష్టి సారించాలి. 

ఐఐటీలు నిర్వహించే జామ్, పలు సెంట్రల్‌ యూనివర్సిటీలు ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రశ్నపత్రాలను సాధన చేయడమూ మంచిదే. ఫిజిక్స్‌ పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారు నెట్‌ ఫిజిక్స్‌ పాతప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి.

మాదిరి ప్రశ్నలను జెస్ట్‌ వెబ్‌సైట్‌లో ఉంచారు. వాటిని పరిశీలిస్తే పరీక్ష సాయి, ప్రశ్నల సరళిపై అవగాహన వస్తుంది. 

ఎక్కువ ప్రశ్నలు సూత్రాలు, గణితంతో ముడిపడి ఉంటాయి. వేగంగా సమాధానం రాబట్టాలంటే ముందస్తు సాధన చాలా కీలకం. 

రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియని ప్రశ్నలు వదిలేయడమే మంచిది. 

ఎక్కువ ప్రశ్నలు ప్రాథమికాంశాలను ఆధారంగా చేసుకుని అడుగుతారు. అలాగే భావనలు, సూత్రాల అనువర్తనకూ ప్రాధాన్యం ఉంది. అందువల్ల వీటిపై దృష్టి సారించాలి. సూత్రాలు, భావనలను సమస్యల సాధనలో ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోవాలి.  

ఫిజిక్స్‌, థియ‌రిటిక‌ల్ కంప్యూట‌ర్ సైన్స్ న‌‌మూనా ప్ర‌శ్న‌పత్రం-1

ఫిజిక్స్‌, థియ‌రిటిక‌ల్ కంప్యూట‌ర్ సైన్స్ న‌‌మూనా ప్ర‌శ్న‌పత్రం-2

ఫిజిక్స్ సిల‌బ‌స్

Posted Date : 10-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌